Swara online radio - playing now

ఒకే రాగంతో విభిన్న రసాలు పలికించవచ్చా?

రాగాలను గుర్తించడం ఎలా?

హిందుస్థానీ రాగాలను మనవాళ్ళు ఎందుకు విరివిగా వాడటంలేదు?

సినిమా పాటల్లో రాగాలు వాడిన, వాడుతున్న తీరు అశాస్త్రీయమా?

ఇలాంటి, ఇదే రంగానికి సంబంధించిన అనేక అంశాలను రానున్న సంచికల్లో ఒక ధారావాహిక తరహాలో సునిశితంగా, సరళంగా, అందరికీ అర్థమయ్యేలా విశ్లేషించనుంది, సరికొత్త శీర్షిక స్వర విజయమ్. ఈ శీర్షిక  రసజ్ఞులైన పాఠకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము – ఎడిటర్

స్పందించే మ‌న‌సుంటే పండితుడికీ పామ‌రుడికీ సంగీతం ఆత్మబంధువే. లక్ష అక్ష‌రాలేల (న‌వ‌ ర‌సాలకు) స‌ప్త స్వ‌రాలు చాలంటుంది సంగీతం. అనుభూతికీఅనుబంధానికీ అంతులేని స్వర రాగ గంగా ప్రవాహం సంగీతం. భాష తెలిస్తేనే గద్యమైనాపద్యమైనా. మరి భాషకందని భావానికి సంగీతానికి మించి ఏముంటుందిస‌ల‌లితసుమ‌ధుర సంగీత‌ ప్రవాహ మధురిమలో మనసులను తడపనివారుతడిసి మురియని వారు అరుదు. గ‌మ్మ‌త్తైన స్వరాల అల్లిక‌ల‌కుఎత్తుప‌ల్లాల గమకాల సోయ‌గాల‌కు దాసోహం కాని వారు ఉంటారార‌స‌జ్ఞ పాఠ‌కుల‌కు శాస్త్రీయసినీలలిత సంగీత విశేషాలను ప్రతి సంచికతో అందించే ప్రయత్నమే స్వర విజయమ్ శీర్షిక. చక్రవాకంచారుకేసిల చక్కిలిగింతలుమోహనమధ్యమావతిల మాయాజాలాలుకళ్యాణికదనకుతూహలాల అల్లరిని ఆస్వాదిస్తూమన ఈ స్వరాల పల్లకిని సంతోషంగా మోసేందుకు సిద్ధం అవుతారని ఆశిస్తూషడ్రసోపేతసప్త స్వరనవ రసయుత విజ్ఞాన విందుకు ఇదే మా ఆహ్వానం.  

          

మనదేశంలో ప్రాచీన సాంప్రదాయ సంగీతాలపై జరిగిన పరిశోధనలుప్రయోగాలు శాస్త్రీయ విద్వాంసుల‌కే పరిమితం కాలేదు. డెబ్భయ్యేళ్ళ తెలుగు చిత్రసీమ సాక్షిగా సంగీతంపై జరిగిన ప్రయోగాలు నూతన ఒరవడులకు శ్రీకారం చుడుతూ విద్వాంసుల మన్ననలూ పొందాయి. టాకీ చిత్రాల తొలినాళ్ళలో స్వర రచననేపథ్య సంగీతం అంతా సాంప్రదాయ సంగీతం ఆధారంగానే సాగేది. సింధుభైరవికాపీఝింఝోటిఅహిర్ భైరవి లాంటి హిందుస్థానీ హిట్ రాగాలను సందర్భానుసారం ఉపయోగిస్తూ చేసిన ప్రయోగాలకు మంచి స్పందన లభించడంతో ఆ ఒరవడి చాలాకాలం కొనసాగిచివరికి ఆ రాగాలు మన సొంతమైపోయాయి. 

శుభప్రదమైన కళ్యాణి రాగంతో ఓ విషాద సినీ గీతాన్ని స్వరపరిచిన ఎం. ఎస్. విశ్వనాథన్ సాహసానికి అప్పట్లో ప్రశంసల జల్లు కురిసింది. ఇక సినిమాల్లో హరికథలుసంగీత కచేరీల వంటి సందర్భాల్లో మన సంగీత దర్శకులు గీత రచయితలతో కలిసి సృష్టించిన శబ్ద కళాఖండాలు, నాటి వాగ్గేయ కారుల దృష్టి చిత్ర ప‌రిశ్ర‌మపైకి కర్షించాయి.

ఒక‌ ద‌శ‌లో శాస్త్రీయ సంగీత ఛాయ‌లు ప‌డ‌కుండా సినీ సంగీతానికంటూ ఓ ప్ర‌త్యేకత సంత‌రించేలా జి. కె. వెంక‌టేష్‌ర‌మేష్ నాయుడుకె. వి. మ‌హ‌దేవ‌న్‌రాజ‌న్ నాగేంద్రచ‌క్ర‌వ‌ర్తిమొద‌లైన వారు వీనుల విందైన పాట‌ల్ని అందించారు. ఓ రాగం ఆధారంగా ట్యూన్ చేసినాఆ రాగ ల‌క్ష‌ణాలు పాట‌ల్లో క‌న‌బ‌డ‌కుండా వీరు కట్టిన బాణీలు ఎప్ప‌టికీ ఆపాత మ‌ధురాలే. 

కాల‌క్ర‌మంలో సినీ సంగీతానికీ, శాస్త్రీయ సంగీతానికీ మ‌ధ్య అంత‌రం పెరిగినాసినిమాల్లో అడ‌పాద‌డ‌పా జ‌రిగిన ప్ర‌యోగాలు, శాస్త్రీయ సంగీతంపై సినీ సంగీత ద‌ర్శ‌కుల సాధికార‌త‌ను చాటి చెబుతూ వ‌చ్చాయి. 

శంకరాభరణం, సిరివెన్నెల, ‌శృతిలయలు, స్వాతికిరణం మొదలైన కె.విశ్వనాథ్, మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు సినీ సంగీత చరిత్రలో సువర్ణ అధ్యాయాలుగా నిలిచాయి. ‌శృతిలయల్లో సామజవర గమన కీర్తనలో గ్రహభేద ప్రయోగం, శ్రీ శారదాంబ నమోస్తుతే పాటను సరస్వతి రాగంలో స్వరపరిచి, సరస్వతీ నామాలతో స్వరకల్పన చేసిన తీరు, సిరివెన్నెలలో చౌరాసియా వేణువుపై మామ పలికించిన నాదం విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. స్వాతికిరణంలో ఆనతినీయరా పాట ఏ వాగ్గేయకారుడి కీర్తనకీ తీసిపోని విధంగా ఉందంటే అతిశయోక్తి కాదు. 

ఇక ఇళయరాజా రాకతో సంగీతంలో ఓ నూతన అధ్యాయం మొదలైందని చెప్పాలి. ఓ వినూత్న మ్యూజిక్ ల్యాబ్ ను ప్రారంభించి, రాజా చేసిన స్వర విన్యాసాలు శాస్త్రీయ, సినీ సంగీత సరిహద్దులను తుడిచేశాయి. సినిమా వేదికగా శాస్త్రీయ సంగీతంపై రాజా చేసిన, చేస్తున్న స్వర కల్పనలను ప్రత్యేక సిలబస్ గా చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఒక పాట గురించి చెబితే ఓ పాఠం అవుతుంది, ఓ పరిశోధనా వ్యాసం అవుతుంది. 

వచ్చే సంచికలో మరిన్ని స్వర సంగతులతో ………


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg
vijaygopal

Novice

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge