Swara online radio - playing now

1.భజేహం కుమారం భవానీ కుమారం 

గళోల్లాసి హారం నమత్సద్విహారమ్ ।

రిపుస్తోమపారం నృసింహావతారం  

సదా నిర్వికారం గుహం నిర్విచారమ్

పార్వతికి కుమారుడైన కుమార స్వామి కంఠమున శోభిల్లు హారముగల వానిని, వినీతులైన

సత్పురుషుల మదులందు  విహరించు వానిని, శత్రు సమూహమునకు ఆవలి వానిని, నృసింహావతారుని, అంటే ఆయన అవతరించటంతోనే దుష్టశిక్షణ, భక్త పరిపాలన చేసినవాడని రెండే రెండు నామాల ద్వారా అందంగా వెలిబుచ్చారు , వికారములకు లోనుకాని వానిని, దహరాకాశ రూపుని,

సదా  బ్రహ్మభావమందు స్థిరముగా ఉండు  వానిని ఎల్లప్పుడూ నేను భక్తితో సేవిస్తున్నాను.

2.నమామీశపుత్రం జపాశో గాత్రం 

సురారాతి శత్రుం రవీంద్వగ్నినేత్రమ్ 

మహాబర్హిపత్రం శివాస్యాబ్జమిత్రం

ప్రభాస్వత్ కళత్రం పురాణం పవిత్రమ్

జగాలను శాసించగల ఈశ్వరుని పుత్రుని, మందార పుష్పం వంటి ఎర్రనైన మేనిఛాయ కలిగిన వానిని, దేవతలకు శత్రువులైన రాక్షసులకు శత్రువైన వానిని, సూర్య, చంద్ర, అగ్నులు మూడింటినీ కన్నులుగా గల వానిని, గొప్పదైన నెమలినివాహనముగా కలవానిని, పార్వతి ముఖపద్మమును వికసింపజేయు సూర్యుని వంటివానిని, ప్రకాశించు భార్యలతో విలసిల్లు వానిని, పురాతనుడైనా కూడా కొత్తగా  కనపడు వానిని, పవిత్రుడైన వానిని భజిస్తున్నాను 

3.అనేకార్కకోటి ప్రభావజ్వలన్తం

మనోహారి మాణిక్య భూషోజ్జ్వలం తమ్ ।

శ్రితానామభీష్టం నిశాన్తం నితాంతం

భజే షణ్ముఖం తం శరచ్చంద్రకాన్తమ్

అనేక కోట్ల సూర్యులకాంతి వంటి అద్భుతమైన  ప్రకాశం కలిగిన వానిని , మనస్సును ఆకట్టుకొను కెంపులు పొదిగిన ఆభరణాలతో మెరిసే వానిని, ఆశ్రయించిన వారికి పరమ ఇష్టుడైన వానిని, అజ్ఞానమనే చీకటిని అంతము చేయువానిని, శరత్కాలపు చంద్రుని వలె మనస్సును అపహరించువానిని, ఆరుముఖములవానిని ఎల్లప్పుడు సేవించుచున్నాను 

4.కృపావారికల్లోల  భాస్వత్కటాక్షం 

విరాజన్ మనోహారి శోణాంబుజాక్షమ్ ।

ప్రయోగ ప్రదాన ప్రవాహైక దక్షం 

భజే కాంతి కాంతం పర స్తోమరక్షమ్

ఎగసిపడు దయాసముద్రము వంటి క్రీగంటి చూపులతో ప్రకాశించు వానిని, ఎర్ర తామర వలె మెరయుచూ ఆకట్టుకొను కన్నులు గలవానిని. గొప్పదైన యోగాన్ని ప్రసాదించి దానిని నిరంతరముగా ప్రవహింప చేయుటలో ,అంటే కాపాడటంలో సమర్ధుడైన వానిని, కాంతికే మనోహరుని, ఎంతో మందిని  కాపాడు వానిని  భజిస్తున్నాను . 

5.సుకస్తూరి సింధూర భాస్వల్లలాటం  

దయాపూర్ణచిత్తం మహాదేవపుత్రమ్ ।

రవీందూల్ల సద్రత్న రాజత్కిరీటం 

భజే క్రీడితాకాశ గంగాద్రికూటమ్

సొంపైన కస్తూరి, ఇంపైన సింధూరాలచే మెరయు నుదురు గలవానిని , దయతో నిండిన మనస్సుగల వానిని ,మహా దేవునికి పుత్రుడైన వాడిని ,  సూర్యచంద్రుల వలె ప్రకాశించే రత్నాలతో పొదగబడిన కిరీటము గలవానిని, ఆకాశగంగతోనూ, పర్వతశిఖరము తోనూ ఆడుకొన్నవానిని భజిన్చుచున్నాను.  

6.సుకుంద ప్రసూనావళీ శోభితాంగం

శరత్పూర్ణ  చంద్ర ప్రభాకాంతి కాంతమ్

శిరీష ప్రసూనాభి రామం భవన్తం

భజే దేవసేనాపతిం వల్లభం తమ్

చక్కని మల్లెమొగ్గలు శోభిల్లు శరీరముగల వానిని, శరత్కాలమందలి పున్నమినాటి పూర్ణచంద్రుని కాంతి వంటి కాంతితో మనస్సునాకర్షించు వానిని, దిరిసెన పవ్వువలె సుకుమారుడైనవానిని, దేవతల సైన్యమునకు అధిపతి మరియూ దేవసేనకు భర్తయైన వానిని, ప్రియతముడైనవానిని కొలుచుకుంటాను.

7.సులావణ్య సత్సూర్య కోటి ప్రతీకం

ప్రభుం తారకారిం ద్విషడ్బాహు మీశమ్ ।

నిజాంక ప్రభాదివ్య మానాపదీశం

భజే పార్వతీ ప్రాణపుత్రం సుకేశమ్

మంచి అందముగలిగి కోటి సూర్యులొక్కటై వెలుగొందుచున్నట్లు వానికి గుర్తుగా ఉన్నవానిని, ప్రభువైన వానిని, తారకుడనే రాక్షసునకు శత్రువైనవానిని, పన్నెండు బాహువులు కలిగి, అందరినీ తన అదుపులోనుంచుకోగల శివుని ఒడియందుండి తన కాంతిచే ఆయనను వెలుగొందునట్లు చేయుచున్న పార్వతికి ప్రాణమైన కుమారుని, చక్కని తలకట్టు కలవానిని భజిస్తున్నాను. 

8.అజం సర్వలోక ప్రియం లోకనాథం

గుహం శూర పద్మాది దంభోళి ధారమ్ ।

సుచారుం సునాసాపుటం సచ్చరిత్రం 

భజే కార్తికేయం సదా బాహులేయమ్

పుట్టుకలేని వానిని, అన్ని లోకములందున్నవారికి  ప్రియమైన వానిని, ప్రపంచమునకు ప్రభువైనవానిని, హృదయ కుహరము దహరాకాశము స్వరూపముగా గలవానిని, శూరపద్ముడనే రాక్షసునకు వజ్రాయుధపుటంచు వంటి వానిని, చక్కదనముచే తీర్చి దిద్దినట్లున్న వానిని, కోటేరులాంటి ముక్కుగలవాని, చక్కని నడవడిగలవానిని, కృత్తికా కాంతలకు బిడ్డయైన వానిని, పెక్కుమంది తల్లులు గల వానిని, ఎల్లవేళలా భజింతును.

9.శరారణ్య సంభూతమింద్రాది వంద్యం 

ద్విషడ్బాహు సంఖ్యాయుధ శ్రేణిరమ్యమ్ ।

మరుత్సారథిం కుక్కుటేశం సుకేతుం

భజే యోగిహృత్పద్మమధ్యాధివాసమ్

రెల్లుగడ్డి (అడవి) సమూహమున జన్మించిన వానిని, ఇంద్రుడు మొదలైన వారిచే నమస్కరించదగిన వానిని, పన్నెండు చేతుల సంఖ్యకు తగిన ఆయుధములతో అందమైన వానిని, వాయుదేవునికి సారథ్యము నెరపు, కోడికి ప్రభువైన, చక్కని పతాకముగల, యోగుల హృదయములను పద్మముల నడుమ అధిష్టించియుండువానిని కొలుచుకుంటున్నాను  

10.విరించీంద్ర వల్లీశ దేవేశ ముఖ్య 

ప్రశస్తామర స్తోమ సంస్తూయమాన

దిశత్వం దయాళో  శ్రియం నిశ్చలాం మే

వినా త్వాం గతిః కా ప్రభో మే ప్రసీద

బ్రహ్మకు ప్రభువైన వాడా! వల్లీపతీ! దేవతలకు నాయకులైన వారిలో ముఖ్యమైన వాడా! 

ప్రశంసించదగిన దేవసమూహములచే బాగుగా స్తుతింపబడు వాడా! దయామయా! ప్రభూ! 

నాకు నీవు స్థిరమైన సంపదనిమ్ము. నీవు గాక నాకు దిక్కెవరు? నా యెడల ప్రసన్నుడవు 

అగుము.

11.పదాంభోజసేవా సమాయాత 

బృన్దారక శ్రేణికోటీర భాస్వల్లలాటమ్ 

కలత్రోల్లసత్పార్శ్వయుగ్మం వరేణ్యం

భజే దేవమాద్యంత హీన ప్రభావమ్

తన పద్మముల వంటి పాదములను సేవించుటకై వచ్చిన దేవతల  కిరీటముల 

మణులచే ప్రకాశించు నుదురుగల వానిని, ఇరుప్రక్కల తన దేవేరులతో ప్రకాశించు

వానిని, మిక్కిలి కోరదగిన వానిని, మొదలు తుదిలేని మహిమగల దేవుని నేను సేవింతును.

12.భవాంభోధి మధ్యే తరంగే పతంతం

ప్రభో మాం సదా పూర్ణదృష్ట్యా సమీక్ష్య 

భవద్భక్తినావోద్ధరత్వం దయాళో 

సుగత్యంతరం  నాస్తి దేవ ప్రసీద

సంసారమనే సముద్రం మధ్య అలలో కొట్టుమిట్టాడుతున్న నన్ను నిండుచూపుతో బాగా 

చూచి,ఓ దయామయుడా! ప్రభూ! నీవు నీ భక్తియను నావచేత పైకి తీయుము. 

దేవా! దానికి మించిన చక్కనిగతి మరోకటి లేదు. నా యెడల ప్రసన్నుడవు అగుము.

13.గలే రత్నభూషం తనౌ మంజువేషం

కరే జ్ఞానశక్తిం ధరస్మేరమాస్యే 

కటిన్యస్త పాణిం శిఖిస్థం కుమారం

భజేహం గుహాదన్య దైవం న మన్యే

మెడ యందు రత్నాల హారం, శరీరమున ఆకట్టుకొను వేషమును,చేతియందు జ్ఞానశక్తిని,

ముఖమున చిరునవ్వునూ, నడుమున ఉంచుకున్న చేయి గలిగిన, నెమలి పైనున్న 

కుమారస్వామిని నేను భజిస్తున్నాను. ‘గుహుని’ కన్న వేరు దైవమును తలచను.

14.దయాహీనచిత్తం పరద్రోహవృత్తిం  

సదా పాపశీలం గురోర్భక్తిహీనమ్ ।

అనన్యావలంబం భవన్నేత్రపాత్రం

కృపాశీల మాం భో పవిత్రం కురు త్వమ్

మనసున దయలేని, ఇతరులకు ద్రోహము చేయుటయే వృత్తిగా, ఎల్లప్పుడూ పాపపు 

నడవడి గల, గురువు యందు భక్తి లేని నన్ను, ‘కృప’యే నడవడికగా, గల ఓ దేవా! నీ చూపు

పడుటకు యోగ్యునిగా, పవిత్రునిగా చేయుము. 

15.మహాసేన గాంగేయ వల్లీసహాయ 

ప్రభో తారకారే షడాస్యామరేశ ।

సదా పాయసాన్న ప్రియస్త్వం గుహేతి 

స్మరిష్యామి భక్త్యా కదాహం విభో త్వామ్

గొప్ప సైన్యము కలవాడా! గంగకు కుమారుడైన వాడా ! వల్లికి తోడైన వాడా! తారకాసురునికి 

శత్రువైనవాడా! ఆరు ముఖముల కలవాడా! దేవతలకు నాయకుడైనవాడా ! పాయసాన్నాన్ని  

ఇష్టపడేవాడా! గుహా! అని ఎల్లప్పుడూ ప్రేమతోనిన్నుస్మరింతును కదా!! 

16.ప్రతాపస్య బాహో నమద్వీరబాహో

ప్రభో కార్తికేయేష్ట కామప్రదేతి ।

యదా యే పఠంతో  భవంతం తదైవ

ప్రసన్నస్తు తేషాం బహుశ్రీర్దదాసి|| 

నీ బాహువుల ప్రతాపమునకు నమస్కరించు వీరులుగల బాహువులున్నవాడా! 

కృత్తికలకు కుమారుడైన వాడా! ఇష్టమైన కోర్కెలనుతీర్చేవాడా! అని నీ గురించి ఎవరు 

ఎప్పుడు స్తుతిస్తారో ,అప్పుడే వారికి ప్రసన్నుడవై అధికమైన సంపదనిస్తున్నావు.

17.అపారాతిదారిద్య్రవారాశిమధ్యే

భ్రమన్తం జనగ్రాహపూర్ణే నితాన్తమ్ ।

మహాసేన మాముద్ధర త్వం 

కటాక్షావలోకేన కిఞ్చిత్ప్రసీద ప్రసీద

ఎల్లప్పుడూ వేగముగా నోటకరచుకొను మొసళ్ళతో నిండిన ఒడ్డులేని , భయంకర

దరిద్రమనే సముద్రము మధ్య తిరుగుచున్న నన్ను మహాసేనుడివైన నీవు క్రీగంటి చూపుతో 

ఉద్దరించుము. కొద్దిగా ప్రసన్నుడివికమ్ము! 

18.స్థిరాం దేహి భక్తిం భవత్పాదపద్మే

శ్రియం నిశ్చలాం దేహి మహ్యం కుమార ।

గుహం చన్ద్రతారం స్వవంశాభివృద్ధిం

కురు త్వం ప్రభో మే మనః కల్పసాల:

ప్రభూ! నా మనస్సుకు కల్పవృక్షము వంటి వాడవు! ఓ కుమారస్వామీ! గుహా! నాకు నీ

పద్మములవంటి పాదములందు స్థిరమైన భక్తినివ్వు. శాశ్వతమైన సంపదనివ్వు.

చంద్రుడు నక్షత్రాలు ఉన్నంతవరకు చక్కనైన వంశము అభివృద్ధి చెందినట్లు చేయి .

19.నమస్తే నమస్తే మహాశక్తిపాణే 

నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ।

నమస్తే నమస్తే కటిన్యస్తపాణే

నమస్తే నమస్తే సదాభీష్టపాణే 

ఆ మహాశక్తిని చేతిలో ధరించిన వాడా! నీకు నమస్కారము. ప్రకాశించు వజ్రాయుధం 

చేతిలో గలవాడా! నీకు  నమస్కారము.నడుమును ఉంచుకొన్న చేయిగలవాడా! నీకు నమస్కారము.ఎల్లవేళలా కోరిన కోర్కెలు నేరవేరేలా చేయిని చూపు 

వాడా! నీకు నమస్కారము.ఈ శ్లోకంలో నమస్కార ద్వయాన్ని ప్రయోగించి తన ఆర్తిని 

ప్రకటించుకున్నారు.

20.నమస్తే నమస్తే మహాశక్తిధారిన్ 

నమస్తే సురాణాం మహాసౌఖ్యదాయిన్ ।

నమస్తే సదా కుక్కుటేశాగ్నికేతాః 

సమస్తాపరాధం విభో మే క్షమస్వ

మహా శక్తిని ధరించి ,దేవతలకు సుఖాన్ని ఇచ్చే వాడా !కుక్కుటాన్నీ ,అగ్నినీ ధ్వజంగా 

కలిగినవాడా ! నా అపరాధాలను క్షమించవలసిందిగా నిన్ను ప్రార్ధిస్తున్నాను,మనసారా 

నమస్కరిస్తున్నాను.

21.కుమారాత్పరం కర్మయోగం న జానే

కుమారాత్పరం కర్మశీలం న జానే

య ఏకో మునీనాం హృదబ్జాధివాసః

శివాంకం సమారుహ్య సత్పీఠకల్పమ్

ఓ కుమారా, నాకు కర్మ యోగం తెలియదు, పరము గురించి తెలియదు . తెలిసినదొక్కటే ,

నువ్వు మునుల హృదయాలలో వాసం చేస్తావు అని ,శివుని ఒడినే పీఠంగా కలిగి 

అలరారుతుంటావని  

22.విరించాయ  మంత్రోపదేశం చకార 

ప్రమోదేన సోఽయం తనోతు శ్రియం మే

యమాహుః పరం వేద శూరేషు ముఖ్యం

సదా యస్య శక్త్యా జగద్బీతభీతమ్ ।

సకల దేవతలు నిన్ను ఆశ్రయించి శుభాన్నీ, సుఖాన్నీ పొందుతుంటారు. అటువంటిది 

నీవు నాకు కూడా శ్రేయస్సును కలిగించమనిమనవి చేసుకుంటున్నాను. 

23.యమాశ్రిత్య దేవాః స్థిరం స్వర్గపాలాః

సదోంకార రూపం చిదానందమీడే

గుహస్తోత్ర మేతత్ కృతం తారకారేః

భుజంగ ప్రయాతేన హృద్యేన కాంతమ్

నీవు సాక్షాత్తుగాప్రణవాకార స్వరూపుడవు .మాకు సచ్చిదానందమును ఇచ్చేవాడవు. ఈ

భుజంగ ప్రయాతాన్ని నా చేత పలికించావు 

24.జనా యే పఠంతే మహా భక్తి యూక్తాః

ప్రమోదేన సాయం ప్రభాతే విశేషః

స్వజన్మ రక్షయోగే యదాతే రుదంతా

మనోవాంఛితాన్  సర్వకామాన్ లభన్తే 

ఈ రమ్యమైన స్తోత్రాన్ని ఆనందం చేత పొద్దున్నా, సాయంకాలం ఎవరైతే పఠిస్తారో వారికి 

గొప్ప రక్షణ లభించి వారి సకల మనో వాంఛితాలూ నెరవేరుతాయి.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge