Swara online radio - playing now

               వరాహ నారసింహ క్షేత్రం

                      (నేటి ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రకంగా అత్యంత ప్రాచీన క్షేత్రం)

         ”The Lord has a beautiful body, his face is as bright as full-moon, the neck being gratefully covered with a twisted tail, with one hand holding up the cloth the lord is wearing while the other hand is used to make Garuda drink nectar. The Lord is in a Soumya form and is white in colour. His face is that of a Boar and his tail is that of a Lion”     

  • Dr. M. S. Rajajee I. A. S (Rtd.)

[Sri Narasimha Avatars /2002 – Ahobil Math pub.]Varaha_lakshminarasimha. Jpg

              ఇవి సింహాచల క్షేత్ర మాహాత్మ్యం లోని వరాహ నృసింహ రూపంకు సంబంధించిన మాటలకు ఆంగ్ల -అనువాదం.

   అద్భుత నారసింహ క్షేత్రాల్లో ఒకటి. విశేషమైనది. 

  ఈ క్షేత్రం నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం జిల్లా అడవివరం గ్రామ సమీపంలోది. సింహాచలం,విశాఖపట్టణం నుండి దాదాపు పదహారు కి.మీ. దూరం. 

స్వామి వరాహ నరసింహుడు.

చారిత్రకంగా : 

                    A_side_view_of_simhachalam_gopuram. Jpgఈ క్షేత్రానికి సంబంధించి 524 శాసనాలు లభ్యమయ్యాయి.ఈ విషయాన్ని మాడభూషిణి నరసింహాచార్య గారు తన పరిశోధనా గ్రంథంలో పేర్కొన్నారు. అందుకే అద్భుత చారిత్రక ప్రాచీన క్షేత్రం.శాసనల్లో ఈ గ్రామాన్ని అడివరం(నేటి అడవివరం) గా పేర్కొన్నట్లు రాశారు. ఈ ఆలయానికి సంబంధించిన అతి ప్రాచీన శాసనం క్రీ.శ. 1087 నాటిది. తొమ్మిదో శతాబ్దం లోనే ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని ఒక అంచనా. క్రీ.శ.13వ శతాబ్దం లో తూర్పు గంగ రాజైన నరసింహ దేవుడు ఆలయ పునరుద్ధరణ గావించారు.శ్రీకృష్ణ దేవరాయలతో సహా అనేక మంది రాజులు స్వామి కి భూరి విరాళాలు సమర్పించుకున్నట్లు అనేక శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఆలయం లాంగూల గజపతి నిర్మితం అని తెలుస్తున్నది. ద్రావిడ – కళింగ శిల్ప సౌందర్యం కనబడుతుంది.

పౌరాణికం : 

            ‘శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్మ్యం’ స్కాందపురాణం లోనిది. ఇది ముప్పై రెండు అధ్యాయాల స్థలం పురాణం.దీనిలో ఆలయానికి సంబంధించిన వివరాల గూర్చి ఉంది. విష్ణు వైరి అయిన హిరణ్యకశిపుడు విష్ణు భక్తుడు,తన కొడుకైన  ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు. సముద్రంలో పడవేయిస్తాడు.పిల్లాడు పైకి తేలుతాడేమో అని ఊహిస్తారు.అందుకే ప్రహ్లాదుడిపై ఓ పర్వతం కూడా వేయిస్తాడు. అయినా విష్ణువు వరాహ రూపంలో తన భక్తుడిని సముద్రం నుండి పైకి వేస్తాడు. ఆ సముద్రభాగమే బంగాళా ఖాతం. ఆ పర్వతమే సింహగిరిగా చెపుతారు. కొండపైన బడిన ప్రహ్లాదుడిని నరసింహ రూపంలో శిష్ట రక్షకుడుగా కాపాడుతాడు. వరాహ, నారసింహ రెండు రూపాల్లో స్వామి ఇక్కడ దర్శన మిచ్చిన కారణంగా వరాహనారసింహుడుగా ఏక రూప దర్శనం ఇస్తున్నారు. ఆ తర్వాత ఈ సింహగిరి పై  ప్రహ్లాదుడు ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో స్వామి పుట్టలో కూరుకు పోయారు. షట్చక్రవర్తులలో ఒకడైన పురూరవ మహారాజు నృసింహుడి ఆజ్ఞ మేరకు పుట్టను తొలగించాడు. స్వామి పాదాలు మాత్రం పుట్టలోనే ఉండిపోయాయి. పురూరవుడు ఆలయం పునరుద్ధరణ నిర్మాణం చేసాడు. 

మూలవిరాట్టును చందనంతో కప్పి ఉంచే సంప్రదాయం పురూరవ మహారాజే నెలకొల్పారు. అదీ స్వామి ఆదేశం మేరకే. నేటి వరకు అది అఖండంగా కొనసాగుతన్నది.
Lord_varaha_stonecarved_statue_at_simhachalam_temple. Jpg

ప్రత్యేకతలు/విశేషాలు :

  • వైశాఖ శుద్ధ తదియ నాడు నిజరూప దర్శనం – చందనోత్సవం.

  • చైత్ర శుద్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు.

  • వైశాఖ శుద్ధ తదియ, పూర్ణిమ, జ్యేష్ట పూర్ణిమ – మొత్తం మూడుసార్లు స్వామికి చెందిన సమర్పణ చేస్తారు.

  • ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు భక్తుల గిరి ప్రదక్షిణ ఉంటుంది. 

  • స్వామి ద్వారం పడమటి ముఖంగా ఉంటుంది. మొత్తం ఐదు ద్వారాలున్నాయి.

  • కల్యాణ మండపంలో ఉన్న మొత్తం స్తంభాలు 96. దాదాపు ముప్పై రకాల నృసింహ రూప శిల్ప సౌందర్యం కొన్ని స్తంభాలపై కనబడుతోంది.

  • సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్టించిన కప్ప స్తంభం చాలా ప్రత్యేకం.

  • స్వామి వారి గర్భాలయ ద్వారాన్ని ‘నీలాద్రి గుమ్మం’ గా పిలుస్తారు.

  • 18వ శతాబ్దం నాటి మహమ్మదీయ దండయాత్ర సమయంలో గోగులపాటి కూర్మనాథ కవి ‘నీలాద్రి గుమ్మం’ ద్వారాన్ని మూసుకొని గర్భగుడిలో కూర్చొని కాపాడుకొమ్మని వేడుతూ సింహాద్రి నరసింహ శతకం రాసాడట. అది పూర్తి అయ్యేలోపే తుమ్మెదల గుంపొకటి ముష్కరులను తరిమేశాయట. ఆ ప్రదేశాన్నే నేడు తుమ్మెదల మెట్టుగా పిలుస్తున్నారు.

  • మల్లంపల్లి శరభేశ్వర శాస్త్రిగారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి విరచితమైన ‘ఆలయాలు – దేవాలయాలు ‘ ప్రకారం తొల్త ఇది శైవ క్షేత్రం. 

  • చందనోత్సవం తర్వాత స్వామి శివ కేశవ అభేద రూపకంగా దర్శనమిస్తారు.( ఆనాభేర్బ్రహ్మణీ రూపం,ఆగళాద్వైష్ణవం వపుః। ఆశీర్షాద్రుద్రమీశానం,తదగ్రే సర్వతఃశివం।। అని నరసింహ రూపం గూర్చి చెప్పే శ్లోకం – సింహాచల సంబంధితం కాదు.)

  • దశవిధ లీలల్లో స్వామిది  ఇక్కడ చందనలీల.

  • సింహాద్రి అప్పన్నగా స్వామి పేరొందాడు. ఈ స్వామి పేరును చాలా మంది పెట్టుకోవడం అనేది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.

  • క్షేత్ర పాలకుడు శ్రీ త్రిపురాంతక విశ్వేశ్వరుడు. ఆంజనేయ, కాలభైరవులు ద్వార పాలకులు. అందుకే భైరవ పురంగా కూడా పేరుంది.

 

సాహిత్యం :

 
శ్రీ కాంత కృష్ణమాచార్య గారి  నాలుగు లక్షల తెలుగు వచన కీర్తనలు.

గోగులపాటి కూర్మనాథ కవి – సింహాచల నరసింహ శతకం

కూచిమంచి తిమ్మకవి – సింహాచల మాహాత్మ్యం

కట్టమూరి కామేశ్వర కవి – శ్రీ లక్ష్మీ నృసింహ చరిత్రము. మొ।।వి ఉన్నాయి.

Relief_of_varaha_narasimha_on_walkway_to_simhachalam. Jpg

స్వామి ప్రత్యక్ష ప్రభావం : 

   అనేక తార్కాణాలు ఉన్నప్పటికీ సింహగిరి వచనాల రచయిత గూర్చి తప్పనిసరిగా చెప్పుకోవాలె. శ్రీ కాంత కృష్ణమాచార్యులు పుట్టుగుడ్డి. స్వామి అనుగ్రహంతోనే నాకు చూపు వచ్చిందని చెప్పుకున్నాడు. పుట్టుగుడ్డిగా పుట్టిన ఆయనను తల్లిదండ్రులు బావిలో వేసారట. మరొకరు బయటికి తీసి సింహాచలం తీసికెళ్ళారట. అక్కడ స్వామిని కొలుస్తూండగ చూపు వచ్చిందని ఆయన్నే తన గురించి చెప్పారు.నాలుగు లక్షల వచనాలు స్వామిపై రాసి తెలుగు వచన రచనకు మొదటి వాడయ్యాడు.కాకతీయుల కాలం నాటి వాడు.

                        (వచ్చే మాసం లో కలుద్దాం..)

ఉపయోగపడిన గ్రంథాలు:

1.శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రాలు – గుండు వేంకటేశ్వర రావు/ శ్రీ రామ పబ్లిషర్స్ 1989.

2.History of the cult of Narasimha in Andhra Pradesh – Dr. M. N. Acharya/Ahobil Math 1989.

3.ఓం నమో శ్రీ నారసింహాయ – భండారు పర్వతాల రావు /వేదభారతి-2002.

4.Sri Narasimha Avatara – Dr. M. S. Rajaji I. A. S.(Rtd)/ Ahobil Math 2002.

5.తెలుగు సాహిత్యంలో నరసింహ వృత్తాంతం – Dr.కండ్లకుంట నరసింహ మూర్తి / 2002.

6.ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాలు – ప్రధాన దేవాలయాలు – Dr. జి.ఎస్. మోహన్ /TTD 2014.

  


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg
sarathbabu

Legend

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge