Swara online radio - playing now

మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్

సూర్య అల్లంరాజు (మేరీలాండ్, అమెరికా)
“శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ – నా మొట్టమొదటి కథ విభాగం” లో
ద్వితీయ బహుమతి పొందిన కథ

ఆ  రోజు  ఎందుకో  చాలా  సరదాగా  వుంది.  శ్రీవారి  గుండెల  మీద  తలపెట్టుకొని  పడుకొని ఉన్నాను.  మనస్సు గతంలోకి  పోయింది. ఆఫీసులో కూర్చోని మెయిల్  చూస్తుంటే  నా పేరున  ఒక  ఉత్తరం  చూసి  ఎవరు  రాశారబ్బా  అని ఓపెన్  చేశాను. అది  నా  ఆంటీ   అమెరికానుండి  రాసిన ఉత్తరం. తాను వంటరిగా  ఉన్నానని,  తన పిల్లల్లు ఎవరు  తనను చూడటం లేదని, కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నానని,  నేను ఇక్కడ  ఒంటరిగా  ఉన్నానని,   తన  దగ్గరకు వచ్చేయమని, తన తదనంతరం తన ఆస్తిపాస్తులన్నీ నాకే  రాసేస్తానని , తనకు  సాయంగా ఉండమని. నచ్చక పోతే వెళ్ళిపోదువుగాని అని రాసింది.

ఆమెని నేను నా పదవ ఏట రైల్వే స్టేషన్‌లో చూశాను. స్టూడెంట్‌గా పై చదువులకి అమెరికా వెళ్ళి అక్కడే పెళ్లిచేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయిందని మా పేరెంట్స్ చెప్పగా వినడమే కాని తరువాత చూడలేదు.  అప్పటికే తల్లిదండ్రులని కోల్పోయి,  తమ్ముళ్ళని చెల్లిళ్ళ ని పెంచి, పెద్దచేసి చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేసి, పురుళ్లు పోసి ఉద్యోగంతో విసిగి,  జీవితంలో ఆశలు కోల్పోయి, నాలుగు పదులు దాటినా పెళ్లి లేక ఒంటరిగా ఉన్న నాకు ఆ లేఖ ఊరట కలిగించింది. 25 సంవత్సరాలకే తల్లిదండ్రులను కోల్పోయి, బరువు బాధ్యతలు భుజాన వేసుకున్ననాకు ఉద్యోగం వదిలి హాయిగా దూరంగా ఆంటీకి  సేవలు చేస్తూ అమెరికా వెళ్లడానికి  అంగీకరించాను.  అనకూడనిది ఏదేనా జరిగినట్లయితే, ఆమె నుండి వచ్చిన డబ్బుతో ఆమె పేరున అనాథాశ్రమం ఇండియాలో నిర్మించాలని  ఏవేవో ఊహించుకొని ఆరు నెలలు శలవు తీసుకుని అమెరికా వచ్చాను.

వచ్చిన మరునాడే ఆంటితో గొడవ జుట్టు కత్తిరించుకోమని. నేనెప్పుడు జుట్టు కత్తిరించుకోలేదు.  ఆ మరునాడు  ఆమె ఒక డ్రస్ ఇచ్చింది వేసుకోమని.  అది మినీ స్కర్ట్ అండ్ బ్లౌస్.  ఇంత వయస్సులో ఆ బట్టలు వేసుకోవాలా ? ఎప్పుడు పంజాబీ డ్రస్ కూడా వేసుకోలేదు.  అలాంటిది మినీ స్కర్ట్ బ్లౌస్ వేసుకోవడమా సిగ్గుతో చచ్చిపోయాను.  దాని కోసం మళ్ళీ  గొడవ. ప్రతి విషయానికి గొడవే.

ఆమె రెండు మోకాళ్ళ దగ్గర రాడ్స్ పెట్టారుట.  మోకాళ్ళు వంగవు.  కర్ర పట్టుకొని నడుస్తుంది.   అది నాకు వరం అయింది .  ఆమె మాట వినక పోయినా, ఆమెకి కోపం వచ్చినా కర్ర ఎత్తేది కొట్టడానికి. నేను చిన్నపిల్లలాగా పరిగెత్తేదాన్ని. అప్పుడే అనుకున్నాను ఆమె నోటిదురుసుకి  పిల్లలు ఆమెను వదిలేశారని. ఇలా గొడవ పడుతూ ఊరుకాని ఊరిలో ఎలా ఉండాలి. ఆమెకి సేవ చెయ్యడానికి వచ్చాను. ఇలా గొడవలు పెడుతూ, తిట్టుతూ, కొట్టుతూ వుంటే ఎవరు వుంటారు.

ఇక లాభం లేదు ఇండియా వెళ్లిపోవాలి అని వచ్చిన మూడవ రోజే  ఆంటీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలేను పంపించెయ్యమని. కాలితో  తాపు తన్నింది.  “ముండకాన, ఇంత డబ్బుపెట్టి నిన్ను తెచ్చింది పంపడానికి కాదే. చెప్పిన మాట విను, లేకపో తే చంపేస్తాను”, అని బెదిరించింది. బందీనైపోయాను.  ఒక రోజు నిజంగానే నా పీక నులిమింది.  గట్టిగా రెండు చేతులతో తోసేశాను. గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకొని వెంటనే  911 కి కాల్ చేశాను.  పోలీసులు వచ్చారు. ఆంటీతో మాట్లాడేరు. నా గది తలుపు తట్టారు. భయంగా తలుపు తీశాను. నా మేడమీద ఎర్రని చేతి వేళ్ళ గుర్తులుని చూశారు. ఆంటీకి వార్నింగ్  ఇచ్చేరు. మళ్ళీ గొడవ జరిగితే పిలవమని నాకు చెప్పి వెళ్ళిపోయారు.

ఆ రోజంతా గదిలోనే గడియ పెట్టుకుని వున్నాను.  భోజనం లేదు, నిద్రలేదు. ఏమి చెయ్యాలో తెలియలేదు. బాధతో కుమిలి పోయాను. ఉద్యోగంలో శలవు పెట్టుకొని వచ్చాను. వెళ్లి పోదామంటే పంపనంటుంది. నా అంతట నేనే వెళ్లిపోవాలంటే అంత డబ్బు ఎక్కడ నుండి తేవాలి.  ఏడవని రోజు లేదు.

“భగవంతుడా నన్నెందుకు ఇక్కడకు తేచ్చావయ్యా?  నేనేం పాపం చేశాను?  ఎంత ఆశతో వచ్చేను?”

ఆమె ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఇక లాభం లేదని ఆమె లేని సమయంలో  ఉద్యోగం వెతకడం ఆరంబించేను. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. వెళ్లని చోటు లేదు. అన్ని షాప్స్ , అన్ని దుకాణాలు, అన్ని రెస్టారంట్స్‌కీ వెళ్ళాను. కొంతమంది జాబ్స్ లేవన్నారు, కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చేరు, కొంతమంది మళ్ళీ రమ్మన్నారు.

ఒకనాడు  ఒక స్కూల్ కి వెళ్ళాను.  ఏదేనా ఉద్యోగం ఇమ్మని బ్రతిమాలేను. నా కష్టాలు చెప్పుకున్నాను. కాస్త డబ్బు సంపాదిస్తే ఇండియాకి వెళ్లిపోతానని చెప్పాను. వాళ్ళు నా మీద దయతలచి, ఉద్యోగం ఇవ్వలేముగాని సహాయం చేస్తామని ఒక సంస్థకి ఫోన్ చేసి నన్ను మాట్లాడమని, వాళ్ళు నాకు సాయం చేస్తారని చెప్పారు. వాళ్ళతో మాట్లాడేను.  వాళ్ళు నా సూట్ కేసుతో రెడీగా వుండమని, టాక్సీ పంపిస్తాము వచ్చేయ్యమని నా address  తీసుకున్నారు. ఒకసారి బయట అడుగుపెడితే మళ్ళీ వెనక్కి వెళ్లలేను. నిజంగా మీరు సాయం చేస్తారా అని అడిగితే చేస్తామన్నారు. అంతే ఇంటికి వచ్చి నా సూట్‌ కేసుతో రెడీగా వున్నాను.  కేబ్ వచ్చింది. కిటికీలో నుంచి చూశాను. చేతులు వూపాను. డ్రైవర్ చూశాడు. వచ్చి నా సూట్‌ కేసు తీసుకువెళ్లాడు. భయం భయంతో అటు ఇటు చూస్తూ గబుక్కున కేబ్‌ లో కూర్చున్నాను.

 ఏదో హోటల్ దగ్గర ఆపాడు. అక్కడ  ఒకామె నాకోసం ఎదురు చూస్తూ వుంది. ఆమె social worker ట.  నన్నులోపలికి తీసుకువెళ్లి ఒక రూమ్‌లో వుంచింది. ఆకలి దంచేస్తుంది. ఆమె ఒక nutrition బార్ ఒక చిన్న ఆరెంజ్ జ్యూస్ బాటిల్ ఇచ్చి “don’t worry, we will take care of you. I will see you in the evening”, అని చెప్పి వెళ్లిపోయింది. ఇల్లు వదిలేసానే  కానీ ఎలా వుంటానో ఎక్కడ వుంటానో ఎన్నాళ్లు వుంటానో ఏమీ తెలియక చాలా భయపడిపోయాను. ఏడవడం తప్ప మరేమీ చేయలేకపోయాను.  భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

ఆ మరునాడు  ఆమె నన్ను ఒక ఇంటికి తీసుకువెళ్లింది. అది ఒక shelter ట. ఆ ఇంటిలో చాలా మంది ఉన్నారు. అందరూ 20 నుండి 30 సంవత్సరాల్లోపు వాళ్లే.  నేనే పెద్ద దాన్ని. అది ఒక నరకం. నేను పూర్తిగా శాకాహారిని. అక్కడకి ఫుడ్, బట్టలు అన్నీ free గా వస్తాయిట . దయామయులు డొనేషన్స్ ఇస్తారుట.

Shelter లో ఎక్కడపడితే అక్కడ ఫుడ్, మీట్ , పళ్ళు అన్నీ చిందరవందరగా పడేసి వున్నాయి. తేరగా వచ్చిన ఆహారం. ఎవరికి ఖాతరు లేదు. అక్కడ  వున్నవారికి ఆహార పదార్ధాలు కొనుక్కుందికీ food stamps,  బస్‌లో వెళ్లడానికి టోకెన్స్ ఇస్తారుట. కానీ నాకేమీ  ఇవ్వలేదు. అడిగితే నేను అమెరికన్ సిటిజెన్ కాదు కాబట్టి ఇవ్వరు అన్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఏడవడం తప్ప చేసేది ఏమి లేదు. పాపం వారిలో ఒకరిద్దరు నాపై  జాలి పడి వాళ్ళ food stamps తో అప్పుడప్పుడు ఏవేన కొనుక్కోమని చెప్పారు.  నేను పాలు,  అటుకులు కొనుక్కునేదాన్ని. అటుకులు నీళ్ళల్లో నానపెట్టుకొని, పాలల్లో నానపెట్టుకొని తినేదాన్ని. అలా ఒక నెల అటుకులు, పాలు, నీళ్ళ తోనే బతికాను. అదీ రోజుకి ఒకసారే  తినేదాన్ని.  రోజుకి రెండు మూడు మైల్స్ నడకతోనే అన్నిచోట్లకి పని కోసం తిరిగేదాన్ని. భగవంతుని దయవల్ల ఒక చిన్న జాబ్ దొరికింది. ఏదేనా వండుకుందామన్నా స్టౌ క్లీన్‌గా వుండేది కాదు. క్లీన్ చెయ్యమంటే నన్నే క్లీన్ చేసుకోమనేవారు. అందరు నాన్ వెజిటేరియన్స్.  ఎక్కడపడితే అక్కడ మీట్ రసం (gravy) తో స్టౌ చెత్తగా వుండేది. నేను క్లీన్ చెయ్యలేక  సీరియల్స్, బ్రడ్, బాగేల్, మఫిన్స్ అలా dry ఫుడ్ తినేదాన్ని.  అలా 3 నెలలు గడిచాయి.

ఈ లోపల లైబ్రరిలో జాబ్ దొరికింది. 12 గంటలు వారానికి. గంటకి $5 చొప్పున.  అప్పుడు షెల్టర్ వాళ్ళు నాకు ఒక చిన్న ఇల్లు ఇచ్చారు. దాన్ని ఎఫిషియెన్సీ అంటారుట. ఒక్క గదే.  అందులోనే ఒక పక్క బాత్రూమ్, ఇంకో పక్క కిచెన్, లివింగ్ రూమ్, బెడ్రూం అన్నీ ఆ గదిలోనే.     దానికి నా జీతంలో 30% అద్దె ఇవ్వాలన్నారు. నాకు చాలా హేపి అనిపించింది. ఎందుకంటే ఆగది (ఆ ఇల్లు) నాకే సొంతం. అందులో వున్నవన్ని నావే. వంట చేసుకోవడం ఆరంభించేను.  కడుపు నిండా తినగలిగేను. కొన్ని నెలలు గడిచాయి. లైబ్రరీలో ఇంకో డిపార్ట్‌మెంట్  (processing section) లో మరి కొన్ని గంటల జాబ్ సంపాదించేను. పార్ట్ టైమ్ వల్ల మెడికల్ ఫెసిలిటీస్ లేవు. కానీ రెండు పూటలా తినగలుగుతున్నాను. మూడు సంవత్సరాలు పార్ట్ టైమ్ గానే పనిచేశాను. ఆ మూడు సంవత్సరాలు అక్కడే షెల్టర్‌ లోనే వున్నాను.

అంతవరకు ఇండియాలో నా జాబ్‌తో correspondence లేక, అక్కడ నుండి వచ్చిన లెటర్స్ మా ఆంటీ అడ్రస్‌కే రావడం వల్ల, నాకు ఏమీ తెలియకపోవడం వల్ల, నా నుండి ఏమీ జవాబు లేనందున  వాళ్ళు నన్ను జాబ్ నుండి తీసేశారు.  షెల్టర్‌లో నా విషయాలు, నేను ఎక్కడవున్నది ఎవరికి చెప్పకూడదు అని చెప్పడంవల్ల నేను ఎవ్వరికీ నా విషయాలు చెప్పలేదు.

ఇండియాకి వెళ్లాలంటే, అక్కడ జాబ్ లేదు.  నాకు తల్లిదండ్రులు లేరు. పెళ్లి లేదు, పిల్లలు లేరు. ఎవరు చూస్తారు నన్ను?  సిస్టర్స్ వున్నారు. వాళ్లు వాళ్ళ వాళ్ళ సంసారాలతో. ఎవరు ఎన్నాళ్లు చూస్తారు? స్వంత పిల్లలే తల్లిదండ్రులను చూడని ఈ రోజుల్లో సిస్టర్ ని నన్నెవరు చూస్తారు, ఎన్నాళ్లు చూస్తారు?  అందుకే ఇక్కడే వుండదలచుకున్నాను.

ఈలోపు ఫుల్ టైమ్ జాబ్  దొరికింది. నా జీవితం మళ్ళీ కొత్త మలుపు తిరిగింది. ఖేతలిక్ ఛారిటీస్ ద్వారా ఐ‌ఎన్‌ఎస్ (Immigration and Naturalization service) కి అప్లై చేశాను సిటిజెన్ షిప్‌కి. నేను green card holder గా వచ్చినందున 5 సంవత్సరాలకి సిటిజెన్ షిప్ దొరుకుతుందని చెప్పారు. అంటే ఇంకో సంవత్సరం వెయిట్ చెయ్యాలి.

Shelter వదిలి అద్దెకి సింగల్ బెడ్ రూమ్ ఇల్లు తీసుకున్నాను. ఆ జాబ్‌లో ఒకాయనతో పరిచయమైంది. ఆయన ఒకరోజు ఎక్కడికో తీసుకువెళతాని నన్ను రమ్మన్నారు. “ఛీ, నేనెందుకు మీతో వస్తాను”, అన్నాను.  “It’s ok it’s ok. Just I am asking”, అని తన రూ మ్‌కి వెళ్ళిపోయారు. ఆ విషయం నేను ఒక కొలీగ్‌తో మాట్లాడితే, ఆమె “that is called dating. Don’t refuse. Go…go he is a very nice man”, అని చెప్పింది.

అప్పటి నుండి నేను ఆయన గురించి ఆలోచిచడం మొదలుపెట్టాను. పెళ్ళి లేకుండా ఆయనతో ఎక్కడికి వెళ్లదలచుకోలేదు. ఆయన నన్ను ఇష్టపడ్డారు. ఇంత వయస్సులో పెళ్ళా?  ఆలోచించాను. నాకు ఒక తోడు కావలనిపించింది.  నా సిస్టర్స్‌తో మాట్లాడేను. వాళ్లందరు ‘మంచివాడైతే పెళ్ళి చేసుకో ‘, అని సలహా ఇచ్చేరు. ఆయన గురించి ఆఫీసులో ఎంక్వయిరీ చేస్తే అందరూ ఆయన చాలా చాలా మంచివారని, ఎంతమందో ఆయనని కావాలనుకుంటున్నారని, కానీ ఆయన ఎవ్వరికీ లొంగడం లేదని చెప్పారు. సరే ఆయనతో పెర్సనల్‌గా మాట్లాడాలని decide అయ్యాను.

ఒక రోజు ఆయనతో నా గురించి వివరంగా చెప్పి, ఆయన గురించి వివరంగా తెలుసుకొని, “నిజంగా మీకు నేనంటే ఇస్టముంటే, నన్నుపెళ్ళి చేసుకుంటారా”, అని అడిగేను. దానికి ఆయన అంగీకరించారు. “అలా అయితే నాకు ఎంగేజిమెంట్ రింగ్ పెట్టండి”, అనగానే, వెంటనే ఆయన కార్‌లో బంగారం షాప్‌కి నన్ను తీసుకువెళ్ళి, రింగ్ కొని, అక్కడే ఆ షాప్‌లోనే అందరి ముందు  మోకాలి మీద కూర్చొని  “నువ్వంటే నాకు ఇష్టం, నిన్నుపెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను, పెళ్ళి చేసుకుంటావా?”, అని అడిగేరు. నేను తలవూపాను. ఆయన నా వేలుకి వుంగరమ్ తొడిగారు. అక్కడ ఉన్నవాళ్ళంతా చప్పట్లు కొట్టారు.

ఈలోపున INS (Immigration and Naturalization service) నుండి ఉత్తరం వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని. అదే రోజు ఆయన నేను కలసి కోర్ట్‌లో మేరేజ్ రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసి,  ఐ‌ఎన్‌ఎస్ ఆఫీసుకి ఇంటర్వ్యూకి వెళ్ళేను. అదే రోజు ఈవినింగ్ ఓత్ తీసుకున్నాను. సిటిజెన్ షిప్ సర్టిఫికేట్‌తో ఇంటికి వచ్చేను. నెల రోజుల తరువాత పెళ్ళి చేసుకున్నాను.

అది Marriages are made in Heaven అంటే.  భవంతుడు నాకోసం మనిషిని ఇక్కడ (Americaలో ) పుట్టించాడు.  ఆయన కోసం నన్ను ఇక్కడికి తేవడానికి  మా ఆంటీని ఉపయోగించాడు. లేకపోతే ఎక్కడనుండి ఎక్కడికి వచ్చాను?  ఎక్కడ వున్నాను? ఎలా వున్నాను? ఎంత కష్టపడ్డాను? ఎలా settle అయ్యాను?  ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యంగా వుంది.  ఇంతలో ఫోన్ మోగింది. ఉలిక్కి పడ్డాను. గతం నుండి present లోకి వచ్చేను. ఇప్పుడు నా శ్రీవారితో, నా స్వంత ఇంట్లో, మూడు పూటలా కడుపు నిండా తింటూ ఎంతో  హాయిగా, ఆనందంగా ఉన్నాను. GOD IS GREAT!!

Courtesy: Telugu Association of Greater Sacremento


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge