Swara online radio - playing now

                          చర్విత చరణం 

                    మన స్వాతంత్రం

                                               -బండారు రామ్మోహన రావు

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు  అవుతుంది. 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ ఆగస్టు 15న జరుపుకుంటున్నాము. ఆ వచ్చే సంవత్సరం అంటే 2021 నాటికి భారత 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్నాము

చరిత్రలో 73 ఏళ్లు చాలా చిన్న కాలం. అందులో శతాబ్దాల తరబడి పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి 1947 ఆగస్టు 15నఅప్పుడు పాలిస్తున్న బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రము వచ్చింది. ఇప్పుడున్న భౌగోళిక స్వరూపంతో ఒక దేశంగా ఏర్పడింది. స్వతంత్రం తర్వాత సుమారు 650 సంస్థానాలు ఏకమై ఒక దేశంగా ఏర్పడిన  సందర్భం అరుదు.

అందుకే భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలను భిన్నత్వంలో ఏకత్వంగా పేర్కొంటాము. మన దేశం భిన్నమైన భాషలుభిన్నమైన సంస్కృతులతో  విరాజిల్లుతున్నది. అన్నిటినీ కలుపుకొని మనదైన రీతిలో జీవనం సాగిస్తున్నాము. ఇదే భారతీయతలోని గొప్పతనం. అందుకే ప్రపంచంలో ఏ దేశానికి లేనన్ని పేర్లు మన దేశానికి ఉన్నాయి. హిందూస్థాన్భారత్ఇండియా ఇలా ఏ పేరుతో పిలిచినా అది మన దేశ ఔన్నత్యాన్ని చాటుతుంది.
నదీనదాల దివ్య ధామం 
1620222981455

భారత దేశానికి భౌగోళికంగా ఉత్తరాన ఉన్నాయి హిమాలయాలు. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత భ్రమ కలిగిస్తుంటాయి. దేశానికే తలమానికంగా నిలిచాయి. ఉత్తరాన హిమాలయాలుమిగిలిన మూడు వైపులా కాపుగాచిన సముద్రపు నీటి నీలిరంగు తళతళ మెరుపులతో మన దేశం ఒక ద్వీపకల్పంగా భాసిస్తున్నది. ఉత్తరాన గంగానది నుంచి దక్షిణాన కావేరి వరకుఈశాన్యాన బ్రహ్మపుత్రా నదితో పాటు నర్మదాతపతిమహానదిగోదావరికృష్ణపెన్న లాంటి నదులుఅనేక ఉపనదులతో భారతదేశం సమశీతోష్ణస్థితిని సంతరించుకుంది. 

జాతిపిత మాటే మంత్రము
1620222981530

'భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉంది', అని అన్న పూజ్య బాపూజీ మాటలను గౌరవిస్తూ గ్రామాలుపట్టణాలునగరాలను అభివృద్ధి పరుచుకుంటూప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాము. మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో, 'అర్ధరాత్రి స్వతంత్రంఅన్న వారు ఉన్నారు. "వచ్చింది స్వాతంత్రం కాదు కేవలం అధికారం మార్పిడి"అని అన్న వారూ ఉన్నారు 'తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చినారుఅని నిరసన ధ్వనులు  కూడా వినిపించాయి. వీటన్నిటినీ సమన్వయపరుస్తూ మన దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఈ నడిచే క్రమంలో ఎన్నో వెలుగునీడలు మరెన్నో తప్పటడుగులు. అయినా ఆశతో ముందుకు సాగుతూనే ఉన్నాము. 

సర్దార్ ఏకతా రాగం
1620222981599

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోఅప్పటి జాతీయ నాయకత్వం దేశ అభివృద్ధి పట్ల ఒక విజన్‌తో ముందుకు సాగింది. ప్రస్తుతం ఉన్న భౌగోళిక స్థితిలో కాకుండా ఒక సమగ్ర దేశంగా లేకుండా, చెల్లాచెదురుగా ఉన్న 650 సంస్థానాలను ఆనాటి జాతీయ హోం మంత్రి  సర్దార్ వల్లభాయ్ పటేల్  ఒకటిగా కలిపారు. ఆనాడు జాతీయ నాయకత్వాన్ని పెద్దగా ప్రశ్నించే వారు కూడా లేరు. అయినా వారు దేశ క్షేమం కోరి అనేక అభివృద్ధి పథకాలకు పునాది వేశారు. దేశంలో 80 శాతానికి పైగా గ్రామీణ భారతం20 శాతం దాటని పట్టణనగరీకరణ మాత్రమే ఉంది. అప్పటికి 80 శాతం పైగా నిరక్షరాస్యులు ఉన్న మన దేశంలో అభివృద్ధి ఒక సవాలుగా మారింది. 

అభివృద్ధికి ఆధునిక దేవాలయాలు 
1620222981697

ఆ దశలో భారత ప్రప్రథమ ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ తనదైన రీతిలో దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎన్నుకున్నారు. అలాగే అలీన విదేశాంగ విధానాన్ని పాటించారు. పరిశ్రమలనువ్యవసాయాన్ని అనుసంధానం చేశారు. అందుకే ఒకవైపు భిలాయ్బొకారోరూర్కెలా లాంటి ఉక్కు కర్మాగారాలు నిర్మించారు. మరోవైపు నాగార్జునసాగర్భాక్రానంగల్శ్రీశైలంశ్రీరాంసాగర్ లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ఆనాడే పునాది వేసుకుని పూర్తి చేసుకున్నాము. వీటిని ఆధునిక దేవాలయాలుగా నెహ్రు అభివర్ణించారు. అలా మన దేశానికి ఒక పటిష్టమైన అభివృద్ధి నమూనాకు పునాది పడింది.

ఇది గతం. ఆ తర్వాత మెల్లమెల్లగా రాజకీయాలలోకి కొత్త తరం ప్రవేశంతో ఎంతో కొంత మంచి కూడా జరిగింది. కానీఅదే క్రమంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. దేశ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 1967 నాటికిదేశానికి స్వాతంత్రం రావడంలో ప్రముఖ పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం సన్నగిల్లింది. 1958లో కేరళలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. స్వాతంత్రం వచ్చిన 20 ఏళ్ల తర్వాత1967 కల్లా దేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇలా రాజకీయమైన మార్పు వచ్చింది.
వెలుగు నీడల దోబూచులాట.. శ్రీశ్రీ హిత బోధ
1620222981765

ఇక పాలనాపరమైన విషయానికి వస్తే 60వ దశకంలో వెలుగునీడలు అనే ఒక తెలుగు సినిమా వచ్చింది. ఆ సినిమాలో మహాకవి శ్రీశ్రీ ఒక పాట రాశాడు.

పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతిక అనే పల్లవితో ఆ పాట, నేటికీ మన దేశానికి యథాతథంగా అన్వయించేలా ఉంది. పాటలోని చరణాలు ఆనాటికీ నేటికీ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి”, అంటాడు శ్రీశ్రీ.

అలాగే అప్పటికే దేశంలో పెచ్చుమీరిన అవినీతిని ప్రస్తావిస్తూ ఆయన తర్వాత చరణం రాశాడు.
1620222981837అవినీతీ బంధుప్రీతి చీకటి బజారు అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు”, అంటాడు.
ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు  అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు 
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ”, అని సమాజాన్ని చైతన్య పరిచాడు

పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునే వాడే

స్వార్థమే అనర్థ కారణం అది  చంపుకొనుటె క్షేమదాయకం”,
అంటూ సమాజానికి హిత బోధ చేస్తాడు

దాదాపు60 ఏళ్ల క్రితం ఆయన ఆవేదనతో ఆయన అన్న మాటలు ఆనాడే కాదు ఈనాడు కూడా అక్షర సత్యాలు. ఆ తర్వాత కూడా దేశంలో ఈ అవలక్షణాలు అక్షరాలా మరింత పిచ్చి పెరిగి విజృంభించాయి. ప్రభుత్వాలు లైసెన్స్ పర్మిట్ రాజ్యంగా మారిపోయాయి. ఏ చిన్న పని కావాలన్నా ప్రభుత్వం అనుమతి లేనిదే జరగని పరిస్థితి తయారైంది. ఎంత తక్కువ పాలన చేస్తే అంత మంచి ప్రభుత్వం అన్న నానుడిని పక్కన పెట్టి, ఎంత వీలైతే అంత ప్రజల మీద ప్రభుత్వాలు పెత్తనం చేస్తూ వచ్చాయి, వస్తున్నాయి. ఈ ట్రెండు ఆనాడే మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

అస్థిర ప్రభుత్వాలకు ఎమర్జెన్సీ పునాది

1620222981914

ప్రభుత్వ దుర్నీతికి 1975లో వచ్చిన ఎమర్జెన్సీ చీకటి రోజులు ఒక మంచి ఉదాహరణ. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. కానీ రెండేళ్ల లోపే జనతా పార్టీఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వ పాలన కిచిడీ ప్రభుత్వ పాలనగా మారి విఫలమైంది. ఆ తర్వాత 1991 దాకా ఒకటి రెండు సార్లు సుస్థిర ప్రభుత్వం, మరికొన్నిసార్లు అస్థిర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

పీవీ తంత్రం.. ఎల్పిజి మంత్రం

1620222981989

1991 తర్వాత దేశంలో అప్పటి ప్రధానమంత్రి  పి వి నరసింహారావు సారథ్యంలో ఆర్థిక సంస్కరణలు ముందుకు సాగాయి. ఈ ఆర్థిక సంస్కరణల వల్ల దేశంలో పెను మార్పులు సంభవించాయి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ (ఎల్పిజి) గా పేర్కొన్న మంత్రంతో ఈ ఆర్థిక సంస్కరణలు కొనసాగాయి.
అప్పటిదాకా లైసెన్స్ పర్మిట్ రాజ్యంగా ఉన్న భారత ప్రభుత్వం, మెల్ల మెల్లగా ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తనను తాను మార్చుకుంది. ప్రపంచ అభివృద్ధి నమూనాలో ఒక భాగమైంది. ఇది మంచిదా చెడ్డదా అన్నది ఇక్కడ అప్రస్తుతం. అద్దంలో మన ముఖం చూసుకుంటే మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తుంది, మన ముఖాన్ని మార్చుకుంటే తప్ప. అప్పుడు కూడా మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాము. ఇది అద్దం చెప్పే వాస్తవం. 

అలాగే సమాజ పరిణామ క్రమంలో, ఇందులో మంచి, చెడు రెండూ ఉంటాయి ఉన్నాయి. ఏదీ పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు. గత 73 ఏళ్లుగా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా మొదలై, ఎంత అభివృద్ధి సాధించినా కూడా, ఇంకా అలాగే అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగుతున్నాము. దానికి కారణాలను అన్వేషించాలి

పెరుగుతున్న ఆర్థిక అంతరాలు
1620222982072

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రకటించిన వివరాల ప్రకారం, ప్రపంచంలోని సగం సంపద కేవలం 26 మంది కుబేరుల వద్దనే ఉందని తేలింది. దీంతో ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతుంటే, పేదలు మరింత పేదలుగా దిగజారుతున్నారు. ఇది మన దేశంలో కూడా ఎక్కువగా ఉంది. ఆర్థిక అసమానతలు మానవ సంబంధాల మీద ప్రభావం చూపుతాయి ధనవంతులు అద్దాల గదిలో భద్రంగా ఉంటే, అద్దాలను పగలగొట్టే పేదలు బయట ఉంటారు. సమాజం దీన్ని సమన్వయం చేసుకోవాలి. ఆర్థిక అంతరాలు తగ్గించుకోవాలి. సమ సమాజ నిర్మాణానికి సర్వశక్తులను వాడుకోవాలి. (సశేషం)


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge