Swara online radio - playing now

చర్విత చరణం

మన స్వాతంత్రం

                                            -బండారు రామ్మోహన రావు

  (గత సంచిక తరువాయి)

ఏ దేశ చరిత్రలోనైనా స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత అని ఎలా చెప్పుకుంటామో, అలాగే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన కరోనా మహమ్మారి కష్ట కాలం తీరిన తర్వాత, కరోనాకు ముందు ప్రపంచం కరోనా తర్వాత ప్రపంచం అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఈ స్థితిలో మానవ సంబంధాలలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి.
మనదేశంలో నైపుణ్యానికి లభించని గౌరవ మర్యాదల కోసం, జీతభత్యాల కోసం విదేశాలకు వలస వెళ్లిన యువత మళ్లీ మన దేశానికి తిరిగి వస్తున్నారు. గ్రామాలలో ఉపాధి లభించక, పొట్టకూటి కోసం పట్టణాలకు, నగరాలకు వలస పోయిన కార్మికులు మళ్లీ తమ తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. మారుతున్న అభివృద్ధి నమూనాకు ఇది శుభ సూచకమే.

ముడి సరకూ మనదే.. శ్రమ దోపిడీ మనదే..!

అలాగే, పెట్టుబడిదారి విధానంలో కూడా, దోపిడీ విధానాలు కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒకనాడు విదేశీ దండయాత్రలకు గురైనప్పుడు, మనదేశంలోని ముడిసరుకులను తీసుకెళ్లి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో, అక్కడి శ్రమశక్తి తో వస్తువుగా తయారు చేసేవారు. అలా తయారు చేసిన వస్తువులను వాళ్ళ దేశాల్లో అమ్ముకోగా, మిగిలిన వాటిని మనకు మళ్ళీ అమ్మేవారు. అలా మన ముడిసరుకు మీద వాళ్ళ దేశంలో శ్రమశక్తి వాడుకుని, వాళ్ళ దేశంలోని వినిమయ సంస్కృతి వాడుకొనిదోపిడీ చేసేవారు. 90వ దశకంలో వచ్చిన గ్లోబలైజేషన్‌లో భాగంగా ప్రస్తుత పద్ధతి మారింది. ముడిసరుకు మనదే, శ్రమదోపిడి మనదే. వినియోగదారులకు అధిక ధరలకు అమ్మి, వినియోగదారులను దోచుకోవడం కూడా మనదే. అంటే మార్కెట్ కూడా మనదే అన్న మాట. ఇది గ్లోబలైజేషన్‌లో వచ్చిన మార్పు.

1620224641570

గ్లోబంతా గ్లోకలైజేషన్‌

ఇక తర్వాతి స్టేజికి మనం చేరుకున్నాం. ఇది ఏమిటంటే గ్లోబల్ లోకల్ రెండింటి మిశ్రమాన్ని ఏకం చేస్తూ,  సంకరం చేయగా వచ్చిన కొత్త పదాన్ని, మాటను మనం వాడుతున్నాం. అదే గ్లోకలైజేషన్’.

లోకలైజేషన్‌లో స్థానిక వనరులు, స్థానిక శ్రమ, స్థానిక మార్కెట్‌ను, స్థానిక అంశాల మీద ఆధారపడి అమ్ముకోవడం. అంటే ఎక్కడో స్థాపించిన సంస్థ మనదేశంలో లోకల్‌గా మారి, మన మానవ వనరులను ఉపయోగించుకుని, ఇక్కడే వారి పరిశ్రమలు అభివృద్ధి చేసుకుంటారు. సహజంగా, ప్రపంచంలో అతిపెద్ద మధ్యతరగతి సమూహం ఉన్న మన భారత దేశ మార్కెట్‌లోనే ఆ వస్తువులు అమ్ముకుంటారు. ఇది సమాజ అభివృద్ధిలో సహజం. దీన్ని ఎవరూ ఆపలేరు. ఏ దేశానికి ఆ దేశం తన చుట్టు ఒక గోడ కట్టుకొని ఉండలేదు. అందుకే గ్లోకలైజేషన్‌లో స్థానిక సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక ఆహారపు అలవాట్లు అన్నీ మార్కెట్ విలువలలో భాగం అవుతాయి. మానవీయ కోణంలో చూసి, మనదైన రీతిలో, మనం అన్వయించుకోవాలి, చూసుకోవాలి. చైనా దేశం ఆ పని చేసింది. అందుకే ప్రపంచ మార్కెట్ పోటీలో అమెరికాకు దీటైన జవాబు ఇస్తుంది. పుష్కలమైన సహజ వనరులు, మానవ వనరులు కలిగి ఉన్న మన దేశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం నయా ట్రెండ్ గా మారిన గ్లోకలైజేషన్‌లో భాగంగా, మన దేశంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. దానికి, మనం ప్రస్తుతం అవలంభిస్తున్న అభివృద్ధి మోడల్‌ను పూర్తిగా మార్చాలి. నగరాలకు, పట్టణాలకు తరలి వెళ్తున్న వలసలను తగ్గించాలి. నరకాలుగా మారుతున్న నగరాల అడ్డగోలు విస్తరణ ఆపాలి. గ్రామ, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. నివాసయోగ్యమైన మౌలిక వసతులను కల్పించి, అభివృద్ధి చేయాలి. చిన్న పట్టణాల ను అభివృద్ధి చేసి, అక్కడే విద్య, ఆరోగ్య, ఉపాధి అవకాశాలను కల్పించాలి. వ్యవసాయ ఆధారిత ఆగ్రో బేస్డ్ పరిశ్రమలు స్థాపించాలి. అభివృద్ధిని వికేంద్రీకరించాలి. అప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాధ్యమవుతుంది.

అధిక జనాభా శాపం కాదు వరం

1620224641696

స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశ జనాభా 33 కోట్లు మాత్రమే. కానీ, ఈ నాడు అది 133 కోట్లకు చేరింది. అంటే 73 సంవత్సరాలలో వంద కోట్ల జనాభా పెరిగింది. ఈ పెరుగుదల సంవత్సరానికి కోటిపైనే ఉంటుంది. ప్రస్తుతం, ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా మనం ఉన్నాము. అలాగే, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా మనదే. సుమారు 100 కోట్ల ఓటర్లు ఉన్న పౌర సమాజం, ప్రజాస్వామ్యం మనది. ఒక నాడు అధిక జనాభా ఒక శాపం. కానీ, ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ట్రెండ్ ప్రకారం అధిక జనాభాలో యువ జనాభా అధికంగా ఉంటే అది ఒక వరంగా మారుతుంది. ఆ వరం మనకు పుష్కలంగా ఉంది. ఎందుకంటే, మన దేశ జనాభాలో సుమారు 70 శాతం మంది జీరో నుండి 35 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. మిగతా 30 శాతంలోనే దేశంలోని మిగతా వయసుల వారు ఉన్నారు. ఇది ప్రపంచంలోని ఏ దేశానికి లేని సంపద. మన మానవ వనరులే మనకు కీలకమైనవి. మానవ అభివృద్ధిలో మానవ వనరులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అందుకే మానవ అభివృద్ధిలో గతంలోని సూచికలు కూడా మారాయి గతంలో ఆ దేశ సహజ వనరులు, జాతీయ సంపదను, ఆ దేశ జనాభా తో భాగించి నిర్ణయించేవారు. కానీ, నేడు మానవ అభివృద్ధి అంటే, ఆ దేశంలోని విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, వినిమయ సంస్కృతిని బట్టి దేశంలోని మానవాభివృద్ధిని నిర్వచిస్తున్నారు. ఈ లెక్కన మానవ వనరులు (హ్యూమన్ రిసోర్సెస్) మనకు అపారంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోకపోవడం మన దురదృష్టం. ఉపయోగిస్తే, మనం ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. చిక్కంతా ఇక్కడే వచ్చింది. 

విద్య, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం.. స్వయం సమృద్ధి శూన్యం

ప్రపంచంలో నిరుద్యోగ సమస్య కూడా మన దేశంలో ఎక్కువగా ఉంది. మానవ అభివృద్ధిలో భాగమైన విద్య, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేయకుండా విస్మరించడమే దానికి కారణం. ఈ 73 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో, మనం నిర్లక్ష్యం చేసిన అంశాలు ఇవి రెండే. విద్య, ఆరోగ్య రంగాల నిర్లక్ష్యం వల్ల, సరైన నైపుణ్యం గల శ్రామికులను తయారు చేసుకోకపోవడం, అనారోగ్యం వల్ల పని దినాలు నష్టపోవడం జరుగుతుంది. ఇది దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. అలాగే మనకంటే తరవాత స్వాతంత్రం వచ్చిన చైనా లాంటి దేశాలు ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున ఎగిసిపడే అభివృద్ధి సాధించాయి. కానీ, మనం ఇంకా పరాయి పాలన అవశేషాలు కొనసాగిస్తూ ఉత్పత్తి రంగంలో అవసరమైన మేరకు స్వయం సమృద్ధిని సాధించలేకపోయాము.

గగనంలోఘన భారతం

1620224641799

అలా అని, మనం  ఇప్పటివరకు ఏమీ సాధించలేదు అంటే కూడా పొరపాటే. గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి అనేది ఆశావాదం. సగం నీళ్ళు లేవు అనేది నిరాశావాదం. అలా ఉంది మన దేశ పరిస్థితి. గ్లాసులో సగం దాకా లేని నీళ్ళను మనం నింపుకోవాలి. కొరతలను తీర్చుకోవాలి శాస్త్ర, సాంకేతిక రంగాలలో మనం ఎన్నో విజయాలు సాధించాము. మన దేశంలోని శ్రీహరికోట నుంచి మన దేశ ఉప గ్రహాలు మాత్రమే కాదు,  ఇతర దేశాల ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తున్నాము. ప్రపంచంలోని అణ్వాయుధ సంపత్తి కలిగిన  తొమ్మిది దేశాలలో మన దేశం కూడా ఉంది. 

భేషుగ్గా రక్షణ, విదేశీ వ్యవహారాలు

ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో మన దేశం రక్షణ విదేశీ వ్యవహారాల విషయంలో మరింత పటిష్టంగా తయారైంది. కానీ, దేశ రాజకీయాల్ని మొత్తంగా తీసుకుంటే, శాస్త్ర విజ్ఞాన రంగాలలో మనం అభివృద్ధి సాధిస్తుంటే, ఇంకా మన దేశంలో, ఆదిమ సమాజపు  రాజకీయాలనే, అనుసరిస్తూ కొనసాగిస్తున్నాము. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం ముందుకు సాగుతుంటే, రాజకీయం దాన్ని వెనక్కు లాగుతోంది. ఇది సరైనది కాదు. రాజకీయాలు ఒక పవిత్రమైన వ్యాసంగం. రాజకీయం లేనిదే అభివృద్ధి లేదు.
యువతరం కదలాలి

1620224641880

"మ్యాన్ ఈజ్ పొలిటికల్ అనిమల్", అంటాడు ప్రఖ్యాత సామాజిక తత్వవేత్త అరిస్టాటిల్. అందుకే రాజకీయాలను నిరసించవలసిన అవసరం అసలే లేదు. కానీ, దేశ అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న దుర్మార్గ రాజకీయాలను మనం మార్చుకోవాలి. దీనికి యువతరమే పూనుకోవాలి. అప్పుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుంది.

అభివృద్ధి.. ఓ నిరంతర ప్రక్రియ

మహాకవి శ్రీశ్రీ రాసిన వెలుగునీడలు సినిమాలోని పాటతోనే ఈ వ్యాసాన్ని ముగిస్తాను దేశసమాజ అభివృద్ధి ఒకనాటితో మొదలయ్యేది కాదు. పూర్తయ్యేది అంతకంటే కాదు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఇప్పుడున్న దానికంటే మరింత మెరుగైన సమాజం కోసం ప్రయత్నించాలి. ఈ ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో అనేక మార్పులు జరగాలి. సంస్కరణలు రావాలి. 73 ఏళ్ళ స్వాతంత్రంలో, మనం సాధించింది ఎంతో ఉంది. కానీ, సాధించాల్సింది ఇంకా ఎంతో మిగిలి ఉంది.

సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయి 

ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులాఅన్న  మహాకవి శ్రీ శ్రీ మహిమాన్విత ప్రబోధ సూక్తి మనకు ఆదర్శం కావాలి.

    **   జై హింద్ **


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge