Swara online radio - playing now

మన ఓటుమన గౌరవంమన బాధ్యత

(జనవరి 25. జాతీయ ఓటరు దినోత్సవంజనవరి 26 భారత గణతంత్ర దినోత్సవంసందర్భంగా ప్రత్యేక వ్యాసం)

                                                                 –బండారు రామ్మోహనరావు

  • మన పన్నులుమన పనులు– మన నినాదం కావాలి.
  • హక్కుగా పౌర సేవల చట్టం రావాలి.

మన  దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం లభించిందిఆ తర్వాత సుమారు రెండున్నర సంవత్సరాల కు 1950 జనవరి 26న సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.అందుకే ఆరోజు మనం గణతంత్ర దినోత్సవంగా (రిపబ్లిక్ డేజరుపుకుంటున్నాముసరిగ్గా అంతకు ఒకరోజు ముందు మన దేశంలో జాతీయ ఎన్నికల కమిషన్ ఏర్పడిందిఆ రోజు నుంచి మన దేశంలో సార్వజనీన ఓటు హక్కు లభించిందిఅందుకే జనవరి 25న మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాముఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

మనదేశంలో 1951 -1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.ఆ తర్వాత వరుసగా ఇప్పటివరకు వరుసగా పార్లమెంటుకువివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయిఅప్పటి నుండి సామాన్య ప్రజలు మొదలుకొని ధనవంతుల వరకు ఓటు వేస్తున్నాంకానీ ఎన్నికలకుఎన్నికలకు మధ్య జరగాల్సిన పనుల గురించి మనం ఆలోచించడం లేదుఓటు వేసే మనంపన్నులు చెల్లించే మనంప్రభువులంమనం చెల్లించే పన్నుల డబ్బులతో పరిపాలన చేసే ప్రజా ప్రతినిధులుఅధికారులు మన సేవకులు మాత్రమేఅందుకే “ప్రజలే ప్రభువులు– పాలకులు సేవకులే” అన్న నినాదం తో మనం ముందుకు సాగాలి.  క్రియాశీల పౌరులుగా ఈ ప్రజాస్వామ్యాన్ని మనం నడిపించాలికానీ కొందరు ఈ ప్రజాస్వామ్యం మీద నిర్లిప్తతతో ఓటు వేయడం లేదుమనం ఒక్కరమే ఓటు వేయకపోతే ఏమవుతుందని అనుకుంటున్నాము.ఇది సరైంది కాదుఅందరం ఓటు వేయాలిఓటు వేసి ప్రశ్నించాలిఓటు వేయని వారికి ప్రశ్నించే అధికారం లేదుఅందుకే మన ఓటు– మన గౌరవం– మన బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగాలిమన ఓటు– మన పన్నులు– మన పనులు అనే నినాదంతో ప్రభుత్వాలను ప్రశ్నించాలి.

మన ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయిమనం ప్రతిరోజు చెల్లించే పన్నుల డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయిపొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా మనం వాడుతున్న అనేక వస్తువులపై ప్రభుత్వాలకు మనం ప్రత్యక్షపరోక్ష పన్నులు చెల్లిస్తున్నాముప్రత్యక్షపరోక్ష పన్నుల ద్వారా మనం పంచాయితీ,మున్సిపాలిటీకార్పొరేషన్,మొదలుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల కోట్ల రూపాయలను పన్నుల రూపేణా చెల్లిస్తున్నాముఅరవై లక్షల కోట్లు అంటే ఆరు పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి అనేది మనకు వెంటనే స్ఫురించదుఅంత పెద్ద డబ్బు మూట అన్నమాటఈ డబ్బంతా మనదే!. మన చెమట చుక్కలు ధారపోసి మన కష్టార్జితాన్ని వివిధ రకాల పన్నులు గా మనం ప్రభుత్వాలకు చెల్లిస్తున్నాము.

పొద్దున లేచింది మొదలు పడుకునే దాకాపుట్టింది మొదలు చనిపోయే దాకా!!

పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకాపుట్టింది మొదలు మరణించేదాకా మనం పన్నులు కడుతున్నాంపన్నుల బారిన పడుతున్నాంమనం పళ్ళు తోముకునే బ్రష్ నుండి మొదలుకొని దాని మీద పేస్టుస్నానం చేసే సబ్బుబట్టల గబ్బు వదిలించే  డిటర్జెంట్లుభోజనానికి బియ్యంచింతపండుపప్పుఉప్పుకారంచివరికి రాత్రి పడుకునే ముందు దోమల బాధ  లేకుండా ఉండడానికి  మనం వాడే “అల్ అవుట్ లుగుడ్ నైట్ లు” వీటి అన్నిటి మీద మనం పరోక్ష పన్నులు కడుతున్నాంపుట్టగానే బొడ్డు  కోయడానికి వాడే “బ్లేడ్” నుంచి మొదలుకొని చచ్చిపోతే తెల్లబట్ట కప్పడానికి అవసరమయ్యే వస్త్రం కొనుగోలు దాకా మనం నిత్య జీవితంలో వాడే ప్రతి వస్తువు పై పన్నులు కడుతున్నాంఈ పన్నులన్నీ ఓపిక చేసుకొని జాగ్రత్తగా కంప్యూటర్ లో లెక్క వేసి చూస్తే మనం కట్టే పన్నులు నెలకు, రోజుకిగంటకు,  నిమిషానికి, సెకనుకు ఇంత అని లెక్కకడితే మన గుండెలదిరిపోతాయిఅవిసిపోతాయి.*

పన్నుల చరిత్ర తెలుసుకుందాం!

అనాగరిక సమాజం నుండి నాగరిక సమాజం ఏర్పడిందిసమాజ మార్పు, అభివృద్ధిలో భాగంగా, మొదట ఆహార సేకరణ దశ నుంచి ఉత్పత్తి దశకి మానవుడు చేరుకున్నాడుఅలా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను దాచి పెట్టుకోవడానికి ఇల్లుముంగిలి ఏర్పరుచుకున్నాడుసొంత ఆస్తి కలిగిన సమాజం ఏర్పడిన తర్వాత దానిని గుర్తించడానికిఅదుపుచేయడానికి రాజ్యం పుట్టిందిఇదే రాజ్య అవతరణకు కారణం అయ్యిందిఇక రాజ్యం నడవడానికి ఇంధనం కావాలివనరులు కావాలిఅది డబ్బు రూపేనా సమకూర్చాలికనుక, మొదట ఉత్పత్తి సాధనమైన భూమి మీద పన్ను విధించారుఆ తర్వాత భూమిలో పండే ధాన్యపు రాశుల లో వాటా తీసుకున్నారుఅలా మొట్టమొదటి పన్ను భూమి మీద పండే పంట నుంచి తీసుకున్నారుఆ తర్వాత మెల్లగా ప్రత్యక్ష పన్నులు పెరిగి ప్రజలకు భారంగా మారాయివ్యవసాయం తర్వాత అదనంగా పారిశ్రామిక సేవారంగాలు అభివృద్ధి చెందాయిఅలా  పారిశ్రామిక ఉత్పత్తులు వాటి సేవల  మీద కూడా పన్నులు విధించారుఅప్పటి నుండి ప్రత్యక్ష పనులతోపాటు పరోక్ష పన్నులు కూడా జత కలిశాయిప్రస్తుతం మన ఆధునిక రాజ్యంలో ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల వాటా అధికంగా ఉందిదీనితోపాటు  అదనంగా విద్యవైద్యంరవాణా తదితర రంగాలలో ప్రస్తుతమున్న పన్నులతో పాటు అదనంగా “సెస్” అనే పేరు మీద కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుందివచ్చే బడ్జెట్ లో  వీటితో పాటు దేశ రక్షణ, covid 19 కు కనుగొన్న టీకాల ఉచిత పంపిణీ కోసం భారతదేశంలో మరొక రెండు రకా లు వచ్చే అవకాశం ఉందివీటిలో రాష్ట్రాల వాటా ఉండదు అది వేరే సంగతి.

పేదలుమధ్య తరగతి వారే ఎక్కువ పన్నులు చెల్లిస్తారు.

పేదల స్వేదం– పెద్దల భోజ్యం!

పన్నుల వ్యవస్థలో ఆదాయపు పన్ను ద్వారా పెద్దలే ఎక్కువ పన్నులు కడతారని ఒక అపోహ ఉంటుందిఇది నిజం కాదుపెద్దలు సంపాదించింది దాచుకుంటారుఆదాయపు పన్ను వీలైనంత మేరకు తప్పుడు లెక్కలు రాయించి తమ పలుకుబడితో ఎగకొడతారుపేదల మధ్య ఆదాయపుఅల్పఆదాయ వర్గాలు తమ రోజువారి సంపాదనను తమ నిత్య అవసరాల కోసం ఎప్పటికప్పుడు రోజువారి ఖర్చు పెడతారునెలాఖరుకు వారికి “హల్లి కి హళ్లి సున్నకు సున్న” మిగులుతుందిఇంకా చెప్పాలంటే వారికి సంవత్సరాంతానికి అప్పుల కుప్పలు జమ అవుతాయిచిల్లర సిగ్గు ఎరగదు అన్నట్లు పేదల డబ్బులతోనే ప్రభుత్వ ఖజానాలు నిండుతున్నాయి.అన్ని మతాల  గుళ్ళుమసీదులుచర్చిలలో ఇతర మతాల ప్రార్ధన మందిరాలలో దేవుళ్ళ హుండీల లో మొక్కులు మొక్కుకొని నిలువుదోపిడి ఇచ్చే పేదల లాగానే ప్రభుత్వ ఖజానా లోకి పేదల పన్నుల డబ్బు ఎక్కువగా జమ అవుతుందిచివరకి  బిచ్చగాళ్ళ ఆదాయంలో కూడా వారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద ప్రభుత్వాలకు పన్నులు వస్తాయి.ఈ నిజాన్ని మనం తెలుసుకోవాలి.

మన పన్నులకు తగ్గ సేవలు అందాలి:

మనం పన్నులు కట్టేది మన సేవల కోసంఅందుకే మన పన్నులకు తగ్గ సేవలు మనకు అందాలికానీ ప్రభుత్వాలు దుబారా చేస్తున్నాయి. “అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు,” మన పన్నుల డబ్బులను, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనుచిత ఉచితాలు ఇస్తున్నాయిమనం పన్నుల రూపేణా ప్రభుత్వాలకు చెల్లిస్తున్న ప్రజల సొమ్మును పందేరం చేస్తున్నాయిమరొక రకంగా చెప్పాలంటే ప్రజలను బిచ్చగాళ్ళుగా మారుస్తున్నాయిమన పన్నుల డబ్బులే మనకు బిచ్చం వేస్తున్నాయిరాజకీయ పార్టీలు ప్రజలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్న దృక్పథం మారాలి.

రాజుల సొమ్ము కాదు– ఇది ప్రజల సొమ్మే:

 “రాజుల సొమ్ము రాళ్ళ పాలు,” అనేది పాత సామెత. “ప్రజల సొమ్ము మట్టి పాలు” కాకూడదన్నది కొత్త నినాదం కావాలిప్రస్తుతమున్న అవ్యవస్థ వల్ల మనకు హక్కుగా అందాల్సిన విద్యఆరోగ్య సేవలు అందడం లేదుమన మౌలిక వసతుల కొరత తీరడం లేదుప్రజలకు హక్కుగా అందాల్సిన ప్రభుత్వ సేవలు అందడం లేదుపైగా ప్రభుత్వ సేవల లో అవినీతిఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయిఈ పద్ధతి మారాలి.

లంచం లేకుండాహక్కుగా ప్రభుత్వ సేవలు అందాలి

పన్నులు చెల్లించే ప్రజలుగా  ప్రభుత్వ సేవలు పొందడం మన హక్కుమనకు హక్కు గా అందాల్సిన పౌర సేవలు ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా అందాలిహక్కుగా పౌర సేవల చట్టం రావాలిఅందుకు  క్రియాశీల పౌరులుగా మనం ఉద్యమించాలిఆ బాధ్యత మన కర్తవ్యం గా నెరవేర్చాలిప్రభుత్వం  రాజకీయ పార్టీలు ఇచ్చే చిల్లర మల్లర  తాయిలాలకు మనం లొంగ కూడదుఈ డబ్బంతా మనదే  అనే స్పృహ పెంచుకోవాలి. “మన పన్నులు,మన పనులు” అనే నినాదంతో ముందుకు సాగాలిమన ఓటు ద్వారా సరైన ప్రభుత్వాలను ఎన్నుకోవాలిమన పన్నుల డబ్బును సద్వినియోగం చేసే వ్యవస్థలను ఆహ్వానించాలి.

మంచి వారి మౌనం మనకే చేటు:

ఈ దుర్మార్గపు వ్యవస్థను  చూస్తూ ఎదిరించలేకఏమీ అనలేకనిష్క్రియా పరంగా మనకేం పోయిందిలే అని మిన్న కుంటున్న మంచి వారి మౌనం వల్ల, ఆ మంచి వారు కూడా దుర్మార్గుల దుష్పరిపాలనలో మగ్గ వలసి వస్తుందిఇది మన వ్యవస్థకు చేటు చేస్తుందిమౌనాన్ని వీడుదాంపాలకులను ప్రశ్నిద్దాం!! మన పన్నుల డబ్బులతో మనకు సరైన సేవలు అందించాలని డిమాండ్ చేద్దాం!!!.

 –బండారు రామ్మోహనరావు

సెల్ నెంబర్.98660 74027


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge