Swara online radio - playing now

మనసులు దోచే “కళ్యాణి” రాగం

భారతీయ సంగీతానికి ఆత్మ “రాగం.”ఖగోళిక శాస్త్రీయ ఆధారాల ఆధారంగా ఋగ్వేదం సుమారు ఇరవై ఐదు వేల సంవత్సరాల క్రితం మూడు స్వరాలతో ఋషులు గానం చేసేవారని తెలుస్తోంది.ఆ తరువాత నిరంతర పరిశోధనలఅనంతరం, సుమారు ఇరవై వేల  సంవత్సరాల క్రితం  సామవేదం సప్తస్వరాలతో గానం చేసేవారు. అంతటితో ఆగకుండా, విస్తృతమైన పరిశోధనలు చేసి  గ్రామాలు, మూర్ఛనలు, ఆరు ప్రాధమిక రాగాలు కనుగొన్నారు  సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే  వేలకొలది రాగాలు సృష్టించబడ్డాయి.  సామవేదమే భారతీయ సంగీతానికి జన్మస్థానం.   అంతే  కాదు, ప్రపంచ సంగీతాలన్నింటికీ జన్మస్థానం సామవేదమే !!  ప్రాధమిక  రాగాలలో అతి ప్రాచీనమైనదీ, విస్తృత ప్రచారంలో ఉన్న అందమైన, అపురూపమైన రాగం `కళ్యాణి.’  మన రాగాలలో `దర్బారీ కానడ’ ని “King of Raagaas” అనీ, `కళ్యాణి’ రాగాన్ని “Queen of Raagaas” అనీ వ్యవహరిస్తారు.  మాధుర్యానికి మరో పేరు `కళ్యాణి.’ అందుకే బాలమురళీకృష్ణ  ఆయన స్వీయ రచన `సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి’ అనే కీర్తన లో “ఓకళ్యాణి రాగిణీ! మాధుర్యం నీ సొత్తు అని పొగుడుతారు.  హిందుస్తానీ సంగీత పద్ధతిలోకళ్యాణిస్త్రీ రాగం అంటే `రాగిణి.’ (పురుష రాగాలని `రాగ’ అని స్త్రీ రాగాలని `రాగిణి’ అని వ్యవహరిస్తారు).

సామవేదం నుండి ఉద్భవించినప్రాథమిక రాగాలలో (Primordial Scales ) సామ రాగం గా భావించే  `ఖరహరప్రియ’ రాగం లో గాంధార స్వరం గ్రహ భేదం (మోడల్ షిఫ్టింగ్) చేస్తేకళ్యాణిరాగం ఏర్పడుతుంది. ఔత్తరాహిక సంగీతం ( హిందుస్తానీ పధ్ధతి) లో ఈ రాగాన్ని`కళ్యాణ్’ (థాట్) అని వ్యవహరిస్తారు.  మన దేశం నుండిపర్షియన్దేశాలకిప్రయాణం చేసిన కళ్యాణి రాగం “యమన్” గా రూపాంతరం చెంది పాడే విధానంలో కొద్ది  మార్పులతో  మళ్లీ పర్షియన్లద్వారా ఔత్తరాహిక సంగీతం లో ప్రవేశించింది. కళ్యాణి రాగాన్నే హిందూస్థానీ  సంగీతం లో “యమన్” అనివ్యవహరిస్తారు. రెండింటిలోను స్వరాలు ఒకటే కానీ పాడే విధానం లో తేడా ఉంటుంది. .యమన్ తేలిక (లైట్ మ్యూజిక్ ) కి  అనువుగా ఉంటుంది కనుక  హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ మొదలైన చలన చిత్ర సంగీతం లోను శాస్త్రీయ, లలిత శాస్త్రీయ సంగీతం లోను (classical,light classical) బాగా ప్రాచుర్యం పొందింది. పాట పాడే వాళ్లకి, వాద్య సంగీతం వాయించే వాళ్లకి ( instrumentalists), స్వరకర్తలకి (music composers ) ఇష్టమైన రాగం. ఈ రాగాన్ని “కంపోజర్స్ ఛాయస్’ గావ్యవహరిస్తారు.  పాశ్చాత్య సంగీతంలో కళ్యాణికి సరిపోయే రాగం (equivalent ) లేదు.శాస్త్రీయసంగీతం లోనూ, తేలిక సంగీతం లోనూ, సినిమాసంగీతం లోనూ చాలా పాపులర్అయింది. “కల్యాణిరాగం సంపూర్ణ రాగం (Septa tonic scale) అంటే ఇందులో షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం,ప్రతి మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదం అనే ఏడు స్వరాలు ఉంటాయి. ఇవన్నీ తీవ్ర స్వరాలు (షార్ప్ నోట్స్  .అందువల్లే ఈ రాగం వినటానికి  శ్రావ్యంగా,హాయిగా ఉంటుంది  మనసును త్వరితంగా రంజింప చేస్తుంది.ఈ రాగం కీర్తనలు, కృతులు, తిల్లానలు, జావళీలు, శ్లోకాలు,పద్యాలు, దండకాలు, భక్తిగీతాలు, భజనలు, గజళ్ళు, శృంగార గీతాలు ఇలా అన్ని రకాల సంగీతప్రక్రియలకు అనువైన రాగం.చలన చిత్ర సంగీతం లో 1950 నుండి 1980 వరకు వచ్చిన చిత్రాలన్నింటిలోనూ ఈ రాగం ఆధారంగా స్వరపరచిన పాటలెన్నో వినిపించేవి.ఈ రాగంలో మ్యూజిక్ కంపోజ్ చేయడానికి creativity ఉండాలి.ఈ రాగంలోసంగీత త్రిమూర్తులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ , శ్యామశాస్త్రిచాలా అద్భుతమైన రచనలు చేశారు. త్యాగరాజు ఈ రాగం విశ్వరూపాన్ని అనేక కీర్తనలలోప్రదర్శించారు. చిత్రాల వల్ల  బాగా ప్రాచుర్యం పొందిన త్యాగరాజ కీర్తనలు `నిధి చాలా సుఖమా’ (ఈ  కీర్తన ని  నాగయ్య `త్యాగయ్య’ చిత్రంలో పాడారు) , ఏ తావునరా..నిలకడ నీకు’  (ఈ కీర్తన ని  `వరుడు కావాలి’   చిత్రంలో భానుమతి పాడారు).

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనుసంగీత దర్శకులు అద్భుతమైన ప్రయోగాలు చేసి అన్నీ రకాల భావాలూ ఈ రాగంలో పలికించి ఈ రాగం యొక్క బహుముఖ సౌందర్యాన్ని ఆవిష్కరింప చేశారు.

ఈ రాగం ఆధారంగా స్వరపరచినవీ ,మెచ్చుకో తగ్గవీ కొన్ని పాటలు:

పాడనా వాణి  కళ్యాణిగా (మేఘసందేశం – రమేష్ నాయుడు – మంగళంపల్లి బాలమురళీకృష్ణ)

పాల కడలిపై శేషతల్పమున (భక్త ప్రహ్లాద -రాజేశ్వర రావు-సుశీల)

శ్రీ రామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహు తీపి ( మీనా-రమేష్ నాయుడు – పి.సుశీల)

మది శారదా దేవి మందిరమే (జయభేరి -పెండ్యాల -ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,రఘునాథ్ పాణిగ్రాహి)

దొరకునా ఇటువంటి సేవ (శంకరాభరణం-మహదేవన్-ఎస్.పి.బాలు)

అగ్రజుడు రామయ్య (స్వరాభిషేకం- విద్యాసాగర్-ఏసుదాస్ )

ఈ రాగం లో మంచి భజనలు

శ్రీరామ చంద్ర కృపాళు భజు (తులసీదాస్)

కిను సంగ్కేలు  హోలీ మీరా భజన-లత మంగేష్కర్

ననుబ్రోవమని చెప్పవే (రామదాసు కీర్తన)

భావయామి గోపాల బాలం (అన్నమయ్య కీర్తన)

ఈ రాగంలో శృంగార గీతాలు :

రారా నా స్వామి రారా (విప్రనారాయణ-క్షేత్రయ్య పదం-సంగీతం సాలూరు రాజేశ్వర రావు -భానుమతి)

సా విరహే తవ దీనా రాధా (విప్రనారాయణ-జయదేవ కవి అష్టపది -సంగీతం సాలూరు రాజేశ్వర రావు -భానుమతి)

నాట్య గీతాలు:

సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల – సుసర్ల దక్షిణామూర్తి – బెంగుళూరు లత,బాలమురళి కృష్ణ)

నలుగురిలో నను నగుబాటు చేయుట ( సంఘం – ఆర్. సుదర్శనం -ఎం.ఎల్.వసంత కుమారి)

సరసాల జవరాలను (సీతారామ కళ్యాణం -గాలిపెంచల నరసింహారావు -పి.లీల)

కల్యాణి రాగంలో అరుదైన జోలపాట:

మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా (చక్రపాణి – సంగీతం, గానం -భానుమతి )

భావగీతాలు:

కుడి ఎడమైతే  పొరపాటు లేదోయ్ (దేవదాసు-సుబ్బరామన్-ఘంటసాల)

పెళ్ళిచేసుకుని ఇల్లు కట్టుకుని (పెళ్లి చేసి చూడు -సంగీతం, గానం :ఘంటసాల)

పలుకరాదటే చిలుకా (షావుకారు -సంగీతం, గానం:ఘంటసాల).  ఈ పాట స్వచ్చమైన కళ్యాణికి ఒక మంచి ఉదాహరణ.

రావే నా చెలియా (మంచి మనసుకు మంచి రోజులు  – గానం: ఘంటసాల).  ఈ పాట స్వచ్చమైన కళ్యాణికి ఒక మంచి ఉదాహరణ.

చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం -సుసర్ల దక్షిణామూర్తి -ఘంటసాల)

బహుదూరపు బాటసారి (ప్రైవేటు రికార్డు -సంగీతం, గానం:ఘంటసాల)

మంజు తార కుంజాదళ కేళి సదనే (జయదేవ అష్టపది ప్రైవేటు రికార్డు -సంగీతం, గానం: ఘంటసాల)

తలనిండ పూదండ  (ప్రైవేటు రికార్డు -సంగీతం, గానం: ఘంటసాల)

జోరు మీదున్నావు తుమ్మెదా (కల్యాణి -రమేష్ నాయుడు-సుశీల)

మావారు శ్రీవారు మా మంచివారు (గృహలక్ష్మి -రాజేశ్వర రావు-భానుమతి)

మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన (జమీందారు గారి అమ్మాయి – ఇళయరాజా-బాలసుబ్రహ్మణ్యం)

ఎవరివో నీవెవరివో (పునర్జన్మ -చలపతి రావు -ఘంటసాల )

ఊయలలూగినదోయి మనసే (బొబ్బిలి యుద్ధం-రాజేశ్వర రావు-భానుమతి)

యుగళ గీతాలు

సాలూరు రాజేశ్వరరావు గారు కళ్యాణి రాగం లో exemplary duets compose  చేసి కళ్యాణి బహుముఖ సౌందర్యాన్ని ఆవిష్కరించారు.

తొలి వలపే పదే పదే పిలిచే (రాణి రత్నప్రభ-రాజేశ్వరరావు-ఘంటసాల,సుశీల)

మనసులోని కోరికా తెలుసు ప్రేమ మాలికా (భీష్మ -సాలూరు రాజేశ్వర రావు -పి.బి.శ్రీనివాస్ -సుశీల)

నాదు ప్రేమ భాగ్యరాసి నీవే ప్రేయసి (భక్త జయదేవ – సాలూరు రాజేశ్వరరావు-ఘంటసాల, సుశీల)

కిల కిల నవ్వులు కురియగా (చదువుకున్న అమ్మాయిలు – సాలూరు రాజేశ్వరరావు-ఘంటసాల, సుశీల)

చెలికాడు నిన్నే రమ్మని పిలువా (కులగోత్రాలు -సాలూరు రాజేశ్వరరావు -ఘంటసాల,సుశీల)

మధుర భావాల సుమ మాలా (జై జవాన్-సాలూరు రాజేశ్వరరావు-ఘంటసాల, సుశీల)

చిగురులు వేసిన కలలన్నీ (పూలరంగడు – రాజేశ్వర రావు-జయదేవ్, సుశీల)

జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశద్రోహులు -రాజేశ్వరరావు – ఘంటసాల)

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు (ఏకవీర – మహదేవన్ – ఘంటసాల, సుశీల)

మహదేవన్ కళ్యాణి రాగంలో స్వరపరచిన ఒక విలక్షణమైన పాట “నీ ఎదుట నేను నా ఎదుట నీవు’ (తేనెమనసులు – సుశీల)

తొలివలపే పదే పదే పిలిచే (దేవత – కోదండపాణి – ఘంటసాల,సుశీల)

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (మాతృదేవత – మహదేవన్ – సుశీల )

హిందీ చిత్రాలలో పాపులర్ అయిన పాటలు:

యే శామ్ కీ తన్హాయియా (ఆగ్ – శంకర్-జైకిషన్ -లత )

ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ లాయె (పారస్ మణి -లక్ష్మీకాంత్ ప్యారేలాల్ – రఫీ, లత)

జిందగీ భర్ నహి భూలేగి ఓ బర్సాత్ కి రాత్ (ఘజల్ – బర్సాత్ కి రాత్ – రవి-రఫీ)

మన్ రే తూ కాహే న దీర్ ధరే (చంద్రలేఖ – రోషన్ – రఫీ )

ఘర్ సే నికల్ట్తే హి (పాపా కెహెతా హైన్ – R.D.Burman – భూపేంద్ర )

జియా లేగయోజి మోర సావరియాన్ (అంపద్ – మదన్ మోహన్ – లత)

దో సితారోంక జమీన్ పర్ హై  మిలన్ ఆజ్ కి రాత్ (కోహినూర్-నౌషాద్-రఫీ, లత)

నాం గూంజాఏగా, చెహ్ర ఏ బదల్జాఏగా (కినారా – అర.డి. బర్మన్ – లత, భూపేంద్ర)

దిల్ హై బేతాబ్ కో సీనే సే లగానా హోగా (పాల్కి-నౌషాద్ -రఫీ, సుమన్ కళ్యాణ్ పూర్ )

రే మన్ సుర్ మే గా (లాల్ పత్తర్-శంకర్ జైకిషన్ -మన్నా డే), స్వచ్చమైనకల్యాణిరాగానికి ఒక మంచి ఉదాహరణ

ఇస్ మోడ్ పే  జాతే హై (ఆOధీ – ఆర్.డి.బర్మన్ – కిశోర్ కుమార్ – లత )

చందన్ స బదన్ చంచల్ చిత్ వన్ (సరస్వతి చంద్ర – కళ్యాణిజి, ఆనంద్ జి – ముకేష్)

జబ్ దీప్ జలే ఆనా (చిత్ చోర్ – రవీంద్ర జైన్ -హేమలత, ఏసుదాస్)

యమన్ లో గజల్:

జిందగీ భర్ నహి భూలేగి ఓ బర్సాత్ కి రాత్ ( బర్సాత్ కి రాత్ – రవి – రఫీ)

రంజిష్ హీ సహీ దిల్ హి దుఖానే కే లీయే (ప్రఖ్యాత గజల్ గాయకుడు పాడిన ఒక మంచి గజల్)

విషాద గీతాలు:

మధ్యమ, నిషాద స్వరాలకి ప్రాధాన్యత ఇస్తూ కంపిత స్వరాలుగా ప్రయోగించడం ద్వారా పంచమ, షడ్జమాలని కొద్దిగా స్ప్రుసించడం ద్వారాకళ్యాణిరాగంలో విషాద ఛాయలు కల్పించవచ్చని చెప్పారు.  ముఖేష్ స్లో టెంపో లో పాడిన `ఆసు భరీ హాయ్’ (పర్వరిష్-దత్తరాం),

భూలీ హుయి యాదే (సంజోగ్ – మదన్ మోహన్)

సారంగా తేరి యాద్ మే (సారంగా- దత్తరాం – ముకేశ్).  ఈ మూడు పాటలూ మంచి`కళ్యాణి’ కి ఉదాహరణలు.

పెను చీకటాయే లోకం (మాంగళ్యా బలం -మాస్టర్ వేణు – ఘంటసాల, సుశీల)

దండకం

మాణిక్య వీణాం ఉపలాలయంతీం (మహా కవి కాళిదాసు -పెండ్యాల – ఘంటసాల)

పద్యం:  రంగారు బంగారు (లవకుశ – సంగీతం, గానం – ఘంటసాల). ఈ పద్యం మంచికళ్యాణికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.

కామెడీ సాంగ్:  మై తేరే ప్యార్ కాబీమార్ హూన్ క్యా అర్జీ కరూన్ (లవ్ ఇన్ టోక్యో – శంకర్ జైకిషన్ – మన్నా డే).  ఇటీవల వచ్చిన చిత్ర సంగీతం లోకళ్యాణిరాగాన్ని సంగీత దర్శకులు ఉపయోగించి స్వరపరచిన పాటలు చాలా తక్కువ అనే చెప్పొచ్చు.

`సింధుభైరవి’ చిత్రం కోసం ఇళయరాజా ప్రయోగాత్మకంగాఒక్కఆరోహణ స్వరాలనే ఉపయోగిస్తూ  “రసమంజరి”అనే  ఒక చక్కని మెలోడీ ని ఇచ్చారు. స్వరాభిషేకం చిత్రం కోసం విద్యాసాగర్ స్వరపరచిన `అగ్రజుడు రామయ్య’ కళ్యాణిరాగంలో స్వరపరచిన  ఒక మంచి పాట. మంత్రాలయం చిత్రం కోసం మణి శర్మ `నమ్మిన నా మది మంత్రాలయమేగా’ అనే పాటనుకళ్యాణిస్వరాలలో స్వరబద్ధం చేసి శ్రేయ ఘోషాల్ కంఠం ద్వారా మనకి  వినిపించారు.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge