Swara online radio - playing now

ప్లవ నామ సంవత్సరం మొదలైంది. ఇది శుభప్రదమైన సంవత్సరం. ప్లవ అంటేదాటించునది అని అర్థం. “దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం”దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహితవివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం. ప్లవ నామసంవత్సరం ముగియగానే “శుభకృత్”, ఆ తరువాత “శోభకృత్” సంవత్సరాలు వస్తాయి.పేరుకు తగ్గట్టుగా ఇవి కూడా మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి.ఈ ఉగాది ప్లవ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి (ఉగాది పంచాంగం)ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

  1. మేషం (అశ్వినిభరణికృత్తిక 1):

ఆదాయం – 08 వ్యయం – 14; రాజపూజ్యం – 04 అవమానం – 03

ఏప్రిల్ 6వ తేదీ నుంచిసెప్టెంబర్‌ 14 వరకు గురువు కుంభంలో సంచరిస్తున్నందువల్ల ఆర్థికంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, సామాజికంగా విజయాలు వరించే అవకాశం ఉంది.అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలోఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగజీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారు మంచి మార్పునుఆశించవచ్చు. ఈ ఏడాదంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. కష్టకాలంముగిసిపోయినట్టే భావించవచ్చు. అప్పు తీరుస్తారు. కుటుంబపరంగా అభివృద్ధినిసాధిస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. శని సంచారం కారణంగా తిప్పుట ఎక్కువగాఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాల సూచనలు ఉన్నాయి.సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగామంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకూ దారితీస్తాయి.

2.  వృషభం(కృత్తిక 2,3,4, రోహిణిమృగశిర 1,2):

ఆదాయం–02 వ్యయం– 08; రాజపూజ్యం–07 అవమానం – 03

గురు గ్రహం కుంభంలోకిమారడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. శ్రమఅధికమవుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీకావడం, అదనంగా బాధ్యతలు మీద పడటం వంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లోసొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈ రంగాల్లో కూడా శ్రమ అధికమవుతుంది.ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి.పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బుతీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగాఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు.ఎవరికీ హామీలు ఉండవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక, వ్యాపార, ఆధ్యాత్మిక, స్వయం ఉపాధి వంటి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది.వివాదాలకు దిగవద్దు. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి.

3.  మిధునం(మృగశిర3,4, ఆర్ద్రపునర్వసు 1,2,3):

ఆదాయం – 05 వ్యయం – 05; రాజపూజ్యం–03 అవమానం – 06

మీకు భాగ్య స్థానమైనకుంభ రాశిలోకి గురు గ్రహం ప్రవేశిస్తున్న కారణంగా, ఆర్థిక లాభం, ఆకస్మికధనలాభం, రుణ బాధ నివృత్తి వంటివి అనుభవానికి వస్తాయి. కీర్తి ప్రతిష్ఠలుపెరుగుతాయి. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్‌ పనులను పూర్తిచేస్తారు. శుభకార్యం చేస్తారు. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. ఉద్యోగంలోప్రమోషన్‌, ఇంక్రిమెంట్‌లో పెరుగుదల వంటివి కూడా జరిగే అవకాశం ఉంది.అష్టమంలో శని సంచారం వల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడాఅధికంగా కష్టపడటం వంటివి అనుభవానికి వస్తాయి. ఇంటా బయటా కొన్ని చికాకులుతప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగాఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి.పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతనపెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. ఎవరికీహామీలు ఉండవద్దు.

4.  కర్కాటకం(పునర్వసు 4, పుష్యమిఆశ్లేష):

ఆదాయం – 14     వ్యయం – 02; రాజపూజ్యం – 06 అవమానం – 06

ఈ ఏడాది కొద్దిగా గ్రహబలంతగ్గినందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఏప్రిల్‌ 6న గురు గ్రహంకుంభ రాశిలోకి,… అంటే మీకు అష్టమ రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగాఆర్థికంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయంలో పెరుగుద ఉండదు.ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలోను, వృత్తిలోను శ్రద్ధను, శ్రమను బాగాపెంచాల్సి ఉంటుంది. ఇక సప్తమంలో శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్యసమస్యులు తలెత్తుతుంటాయి. నిరుద్యోగులకు ఉన్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలుఉన్నాయి. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్య కోసంసంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శ్రమ మీద పనులుపూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు ప్రశంసలుఅందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితంకనిపించదు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకు సమయం అన్ని విధాలాబాగుంటుంది. బాధ్యతను సహనంతో నిర్వర్తించాల్సి ఉంటుంది.

5.  సింహం (మఖపుబ్బఉత్తర 1):

ఆదాయం – 02 వ్యయం – 14;రాజపూజ్యం – 02 అవమానం – 02

మీకు సప్తమ రాశి అయిన కుంభం రాశిలోకిగురు గ్రహం ప్రవేశించినందు వల్ల విశేషమైన శుభాలు జరగబోతున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీవిజయంగా మార్చుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరి జీవితంలోస్థిరపడతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఇల్లు గానీ, స్థలంగానీ కొనేఅవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. శుభవార్తలు వింటారు. మొత్తానికిఈ ఏడాది అన్ని విధాలా అనుకూలంగా ఉంది. జీవితంలో ఎదుగుదలకు సంబంధించి కొత్తనిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు.భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు అభినందనలుఅందుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, రాజకీయాు, సామాజిక సేవా రంగాల్లోఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు. ప్రేమవ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశంఉంది. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండండి.

6. కన్య (ఉత్తర 2,3,4, హస్తచిత్త 1,2):

ఆదాయం – 05 వ్యయం – 05; రాజపూజ్యం – 05 అవమానం – 02

గ్రహ సంచారం కారణంగా ఈ ఏడాది ఈరాశి వారు మిశ్రమ ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. గురు గ్రహం మీకు ఆరవరాశి అయినా… కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగరంగాల వారికి కొద్దిగా చిక్కులు ఎదురవుతాయి. ఏది సాధించాలన్నా పట్టుదలపెంచాల్సి ఉంటుంది. ఆదాయంలోను, లాభాల్లోను పెరుగుదల, ఎదుగుదల కనిపించవు.సమస్య పరిష్కారంలో కొద్దిగా ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. విమర్శలు, ఆరోపణలు, నిందలు, అభాండాలు మీద పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవా లేదు. పెళ్లిప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు.స్నేహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. తోబుట్టువుతో విభేదాలు తలెత్తేఅవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు.స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా బాగా కలిసి వచ్చే సమయం.

7. తుల (చిత్త 3,4, స్వాతివిశాఖ 1,2,3):

ఆదాయం – 02 వ్యయం – 08; రాజపూజ్యం – 01 అవమానం – 05

ఈ నెల 6వ తేదీన మీకు అయిదవరాశి అయిన కుంభ రాశిలోకి గురు గ్రహం ప్రవేశించినందువల్ల ఆర్థిక పురోగతిఉంటుంది. అన్నివిధాలా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లోఅభివృద్ధికి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు.ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలనుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నాలుగింట శనిసంచారం కారణంగా మధ్య మధ్య తిప్పుట, అనారోగ్య బాధలు తప్పవు. పెండింగ్‌ పనులుపూర్తవుతాయి. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పుపొందుతారు. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులకు బాగాఅనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోవడం వల్ల ఇబ్బందులు పడతారు.చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు ప్రయోజనం పొందుతారు. సమయం అనుకూంగాఉంది. కోర్టు కేసు వాయిదా పడుతుంది. కొత్త పరిచయాల విషయంలో ఆచితూచినిర్ణయాలు తీసుకోవాలి.

8.  వృశ్చికం (విశాఖ 4, అనురాధజ్యేష్ఠ):

ఆదాయం – 08 వ్యయం – 14; రాజపూజ్యం – 04 అవమానం – 05

ఏప్రిల్‌ 6న గురువు కుంభరాశిలోకి ప్రవేశించిన కారణంగా ఆర్థిక సమస్యలు కొంత వరకు పరిష్కారం అవుతాయి.ఇల్లు మారే అలోచన చేస్తారు. ఇల్లు గానీ, స్థలం గానీ కొనాలనిప్రయత్నిస్తారు. ఉద్యోగ రీత్యా స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలోమార్పు సంభవం. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు మీద పడతాయి. మొత్తం మీదజీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందనుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దాదాపుపూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలుసిద్ధం చేస్తారు. క్రియాశీలంగా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటే అవిభవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లిప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అందిఅవసరాలు తీరతాయి. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.బ్యాంకర్లు, డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లోఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమవ్యవహారాల్లో దూసుకుపోతారు.

9.  ధనస్సు (మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1):

ఆదాయం – 11 వ్యయం – 05; రాజపూజ్యం – 07 అవమానం – 05

ఈ రాశివారికి గ్రహసంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. గురు గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశంవల్ల సరికొత్త నిర్ణయాలు, ఆలోచనలతో పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో ఉన్నతశిఖరాలను అధిరోహిస్తారు. జీవితంలో సాహసాలకు ఒడిగడతారు. ఆదాయం బాగాపెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడి, భవిష్యత్తుకు బాటలు వేస్తాయి.ప్రయాణాలు లాభిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. పెళ్లిసంబంధాలు కుదురుతాయి. బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారరంగాల్లోని వారికి పరిస్థితులు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికితిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే, వృత్తి ఉద్యోగాల్లోవిపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులుబాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఐ.టి నిపుణులకు బాగుంటుంది.

10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణంధనిష్ఠ 1,2):

ఆదాయం – 14 వ్యయం – 14; రాజపూజ్యం – 03 అవమానం – 01

ఈ రాశివారికిగురువు రెండో రాశిలోకి ప్రవేశించినందువల్ల, శుభ ఫలితాలు అనుభవానికివస్తాయి. కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలోప్రమోషన్‌, ఇంక్రిమెంట్‌, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు వంటివిచోటు చేసుకుంటాయి. సమాజంలో పలుకుబడి పెరగడానికి, పలుకుబడి కలిగిన వాళ్లతోపరిచయాలు పెరగడానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలున్నాయి. సమాజానికిఉపయోగపడే పనులు చేస్తారు. ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యేఅవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనులు నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా డాక్టర్ల సాయంతో బయటపడతారు. విదేశాల్లోఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపికబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు రాణిస్తారు.ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. రాజకీయ, సామాజిక రంగంలోని వారుఅభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది.

11.  కుంభం (ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఆదాయం – 14 వ్యయం – 14; రాజపూజ్యం – 06 అవమానం – 01

ఈ ఏడాది ఈ రాశివారికి గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. ఈ నెల 6 నుంచి గురుగ్రహం కుంభ రాశి లోకి సంచారం వల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. ఆశలు, ఆశయాలు పెరుగుతాయి. సంతానం కలుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారాలనే ఆలోచన పెట్టుకోవద్దు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. అదనపు బాధ్యతలు మీద పడతాయి. అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు హద్దులు దాటుతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువుతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. సంతానంలో ఒకరికి సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లు, వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

12. మీనం(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4):

ఆదాయం – 11 వ్యయం – 05; రాజపూజ్యం – 02 అవమానం – 04

ఈ రాశివారికి 12వ రాశిలో గురువు ప్రవేశిస్తున్నందువ్ల ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. సమాజంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికార, పదవీ లాభాలు ఉన్నాయి. శుభకార్యాల మీద భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు, ఆలోచనల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు బాగుంది.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg
swaramagazine

Legend

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge