Swara online radio - playing now

సెప్టెంబర్ 15న ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం.కానీ ప్రజాస్వామ్యం ప్రాణహితగా సాగాలి, జీవధారగా మారాలంటే వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు ప్రజాస్వామికరణ జరగాలి. ప్రజాస్వామిక ఆలోచనా విధానం పెరగాలి. అప్పుడే సమాజం లోనూ ప్రజాస్వామిక "స్థితప్రజ్ఞత"సిద్ధిస్తుంది. అప్పుడు మనకు ప్రజాస్వామ్యం గురించి మరెవరో చెప్పవలసిన అవసరం లేదు.దానికి దానికి అదే మానవ జీవితంలో అలవడుతుంది. ఆచరణలో కనపడుతుంది. 

కొత్తగా ఏర్పడిన లేక పునరుద్ధరించబడిన ప్రజాస్వామ్య దేశాలలో ప్రజాస్వామ్య భావనలు పెంపొందించి ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దాన్ని మరింత ప్రజాస్వామ్యం గా మార్చడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్ 62 తీర్మానం 7ద్వారా 8 నవంబర్ 2007 న ఐక్యరాజ్య సమితి "యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ డెమోక్రసీ" అనే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం తర్వాత వరుసగా 2008 నుండి ప్రపంచవ్యాప్తంగా "ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవంగా" జరుపుకుంటున్నాము.

1620220164626

ప్రజాస్వామ్యం లో ఎన్ని లోపాలు ఉన్నా ఆ లోపాలను పరిష్కరించడానికి "మరింత ప్రజాస్వామ్యమే మంచి మందు" అనే భావనను ఈ తీర్మానం ప్రతిఫలిస్తుంది.దేశ కాలాదులను అధిగమించి వీటికి అతీతంగా ప్రజాస్వామ్య భావనలు పెంపొందించి ప్రపంచ పౌరులుగా మనుషులను తీర్చిదిద్దాలనే ఆలోచన దీని వెనుక దాగి ఉంది. ఇలాంటి ఉదాత్తమైన ఆలోచనలకు ఇప్పటికి 131 సంవత్సరాల క్రితమే పునాది పడింది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU ఇది ఒక జాతీయ పార్లమెంట్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ. "ఫ్రెడరిక్ పాసి" అనే ఫ్రాన్స్ దేశస్థుడు,"విలియం రాండం క్రీమర్" బ్రిటన్ దేశస్థుడు వ్యవస్థాపకులుగా ఈ సంస్థ 1889 లో ఏర్పడింది. సభ్యులలో  ప్రజాస్వామ్య పాలన,జవాబుదారితనం, పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, ఈ సంస్థ చేసే ఇతర కార్యక్రమాలలో శాసనసభలో లింగ సమానత్వం పెంపొందించడం, రాజకీయాలలో యువత పాల్గొనడం ద్వారా వారి సాధికారత పెంపొందించడం, దీనిద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించడం. ఇవి ప్రధాన లక్ష్యాలుగా  ఈ అంతర్జాతీయ సంస్థ నెలకొల్పారు. ఆ తర్వాత ఈ సంస్థ ఐక్యరాజ్యసమితితో జరిపిన చర్చలలో లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ యునైటెడ్ నేషన్స్‌లలో ఈ సంస్థ శాశ్వత మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో శాశ్వత పరిశీలకుడి హోదాను ఈ సంస్థ కలిగి ఉంది.దానివల్ల ఈ సంస్థతో సంబంధం ఉన్న ఎనిమిది మంది వ్యక్తులు ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహించారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన చార్టర్‌లో ప్రపంచ పౌరసత్వం అనే అంశాన్ని ప్రధానంగా సూచించింది. దీని ద్వారా కమ్యూనిటీ ఆఫ్ డెమోక్రసీ, పెంపొందించి గ్లోబల్ గవర్నెన్స్‌తో పాటు కాస్మోపాలిటన్ ప్రజాస్వామ్యం అధునాతన యూనియన్ అనే భావనలు భావనలు ఇది ప్రోత్సహించింది.
1620220164716

జనాభా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల జాబితా తయారు చేసి వాటిలో కొన్ని ప్రజాస్వామ్య  సూచికల ద్వారా ప్రజాస్వామ్య దేశాల లో నిజంగా ఆచరణలో జరుగుతున్న ప్రజాస్వామ్యాన్ని అంచనా వేస్తుంది. చాలా ప్రజాస్వామ్య దేశాలలో  ప్రస్తుతం అమలవుతున్న "నేతిబీర" చందంగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఎండగడుతుంది.ఇలా ప్రజాస్వామ్య దేశాలకు అది మార్గదర్శకత్వం వహిస్తుంది..

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారత దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థ పుట్టకముందే మనదేశంలో ప్రజాస్వామికరణతో కూడుకున్న భావన ప్రపంచ మానవాళిని కలిపే ఉమ్మడి భావన ఓ సూక్తిలో ఇమిడి ఉంది. అందుకే మన కేవలం ప్రజలు మాత్రమే సుఖంగా ఉండాలని కాదు కోరుకుంది. లోకాసమస్తా సుఖినోభవంతు అని అన్నాము. కానీ ఆధునిక కాలంలో ప్రవేశిస్తున్న కొద్దీ ఆ సార్వజనీన భావనలు కాస్త మెల్ల మెల్లగా సంకుచిత భావనలుగా మారుతున్నాయి. సంకుచిత భావన పెరిగి ఇవాళ మనిషి మరింత సంకుచితంగా ఆలోచించడం మొదలు పెట్టారు. మొదట నేను అనే దానితో మొదలై ఆ తర్వాత నా కుటుంబం, నా కులం, నా మతం, నా జాతి, నా వర్ణం, ఇలా హద్దులేని విభజన వైపు మనిషి ప్రయాణం కొనసాగుతోంది. ఇది సరైంది కాదు. 

1620220164891 వ్యక్తి గత జీవితం నుంచి మొదలుకొని కుటుంబంతో పాటు  సమాజంలోని అన్ని రంగాల్లో ప్రజాస్వామ్యాన్ని పాటించాలి. ప్రజాస్వామిక భావజాలాన్ని పెంపొందించాలి.అప్పుడే సమాజం లో సామూహిక ప్రజాస్వామికమైన ఆలోచనా విధానం పెరుగుతుంది. అప్పుడు బయట నుండి ఎవరో ప్రజాస్వామ్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు దానంతట అదే అది సమాజంలో అంతర్భాగంగా మారుతుంది. దానివల్ల అంతిమంగా సమాజానికి ప్రజాస్వామిక స్థితప్రజ్ఞత అలవడుతుంది. ప్రజాస్వామ్యం ప్రాణహిత గా సాగుతుంది. ప్రజాస్వామ్యం జీవధారగా మారుతుంది.

మన ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అందుకే "ప్రజలే ప్రభువులు- పాలకులు సేవకులే" అనే సత్యాన్ని తెలుసుకోవాలి. దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవాలి. మిగతా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. వ్యక్తి నుండి వ్యవస్థ వరకు ప్రజాస్వామిక భావనలు అలవర్చుకోవాలి. మనందరం ప్రపంచ పౌరులమే అనే భావన పెంపొందించిన నాడు ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవానికి నిజమైన అర్థం పరమార్థం లభిస్తుంది.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge