Swara online radio - playing now

పురాణాల్లో మహాత్ములు అనే శీర్షిక కింద ఈ సంచికలో మనము  తలచుకోబోతున్న అవతార మూర్తి శ్రీ కృష్ణుడు. ఒక మనిషి ఆదర్శవంతంగా ఎలా జీవించాలో తన చరిత్ర ద్వార చూపాడు ,ఒక జీవుడు తాను పారమార్ధిక సాధన ఎలా చేయాలో,ఎలా తరించాలో భగవద్గీత ద్వార బోధించాడు.శ్రీ కృష్ణుడి చరిత్రనూ ,ఆయన నడవడినీ సునిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది .లేకపోతే ఒకదానికి మరొకటి గ్రహించి తప్పుగా అర్థం చేసుకునే ప్రమదమూ ఉంది .కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా సగుణ నిర్గుణ సమైక్యావతారం అని అది శంకరుల వారు కీర్తించారు ,ఆయన భువిపైన నడయాడిన భగవంతుడే అని భాగవతాది  గ్రంథాలు ఘోషించాయి.

తన అవతార కాలములో కృష్ణుడు నిర్వర్తించిన ధర్మాలను రెండుగా విభజించవచ్చును .ఒకటి "ఆదర్శ ధర్మము",రెండు "ఆరాధ్య ధర్మము".ఆదర్శ ధర్మం అంటే మనమూ అందుకుని ఆచరించవలసిన ధర్మం,ఆరాధ్య ధర్మం అంటే శ్రవణం చేసి నమస్కరించవలసిన ధర్మం,దానిని మానవ మాత్రులైన మనము అనుసరించేలము , ఆ యోగ్యత మరియు శక్తి సామర్ధ్యాలు మనలో లేవు.

ముందుగా ఆయన ప్రకటించిన కొన్ని ఆదర్శ ధర్మాలు చూద్దాము .తల్లిదండ్రులను గౌరవించడం,తన తోటి గోపాలకులందరినీ అమితంగా ప్రేమించటం,అన్నీ వేళలలోనూ ధర్మ పక్షానే నిలబడటం ,తనను నిష్కల్మషముగా ఆశ్రయించిన వారికి అభయాన్ని ఇవ్వటం.ఇక ఆరాధ్య ధర్మాల గురించి తెలుసుకుందాము.వెన్నను అపహరించటం,గోవర్ధన గిరిని ఎత్తటం,దావాగ్నిని నోటితో స్వీకరించటం,కాళీయ సర్పం పడగలపై నాట్యమాడటం ..ఇటువంటివి మరెన్నో దివ్యమైన లీలలు తలచినంత మాత్రానే మనల్ని పునీతులని చేస్తాయి .

భాగవతంలోనే ఒక చోట కృష్ణుడి 64 దివ్య గుణాల గురించి వర్ణించటం జరుగుతుంది .ఆ విధముగా పరిశీలన చేస్తే కృష్ణుడి చరిత్ర మనకు అటు ఆదర్శమూ ,ఇటు ఆరాధ్యమూనూ.ఆయన నోటి నుండి వెడలి వచ్చిన సర్వోపనిషద్సారభూతమైన శ్రీమద్భగవద్గీత ఒక్కటి చాలు మనల్ని సరైన దారిలో పెట్టడానికి ,అందులోని ఒక్క శ్లోకాన్ని భక్తితో పఠించినా గానీ జీవితాన్ని కావలసిన సర్వాన్నీ ఇస్తుంది .మనము సామాన్య దృష్టితో అర్థం చేసుకోలేనంత లోతైన తత్త్వం దాగున్నది కృష్ణ అవతారంలో ,అంటే శ్రీ కృష్ణుడు లోతైన సముద్రము వంటి వాడు ,అందుకేనేమో సముద్రము రంగూ నీలమే ,కృష్ణుడి వర్ణమూ నీలమే !


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
1
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge