Swara online radio - playing now

తన తపశ్శక్తినంతా ధారపోసి బాదరాయణుడు రచించిన మహా గ్రంథం "మహా భారతం".

భారతంలో ధర్మాధర్మాల గురించిన విశేషమైన చర్చ చేయబడినది. నిర్మలమైన 

మనసుతో, ఎటువంటి పూర్వ నిశ్చితాభిప్రాయం లేకుండా గనుక భారతాన్ని చదివిన వారి

కి దాని బరువు తెలిసివస్తుంది. ప్రతి పాత్రలోనూ వెతికితే మనకు ఎన్నో ఆదర్శాలు 

కానవస్తాయి. ఈ సంచికలో, గడచిన భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని భీష్మ పితామహుని

 యొక్క గొప్పదనాన్ని గుర్తుచేసుకుందాము. పుణ్య శ్లోకులైన వారిని స్మరించినా, వారిని 

కీర్తించినా మనకు వారి గుణములు అబ్బుతాయి, పుణ్యమూ లభిస్తుంది. మహా 

భారతమంతా వేళ్ళూనుకుని పరచుకున్న మహా వృక్షం భీష్ముడు, యెన్నో తరాలను 

చూశాడు. తన అసలు పేరు గాంగేయుడు, శాంతనుడు అయినా కూడా తండ్రి బాగును 

కోరుకుని బ్రహ్మచర్య వ్రతాన్ని ఆజన్మాంతం అవలంబిస్తానని ఆయన చేసిన ప్రతిజ్ఞ 

వలన భీష్ముడయ్యాడు. ఆ ఒక్క ప్రతిజ్ఞను ఆయన జీవితాంతం నేర్పుతో నిర్వర్తించిన 

తీరు ఆయన ఎంతటి మహోన్నతుడో మనకు తెలియజేస్తుంది. అటు తరువాత కౌరవ 

సభలో జరుగుతున్న అన్యాయాలకు మౌనంగా ఆయన అనుభవించిన సంఘర్షణ ఆయనలోని ధర్మాభిలాషకు అద్దంపడుతుంది. కౌరవులకు నాశనం తప్పదని తెలిసినా అంతా దైవేచ్ఛ అనుకుంటూ విధి సాక్షియైన కురు వృద్ధునిగా భీష్ముడు పడిన తపన అంతా ఇంతా కాదు, అయినా తనకు కుదిరిన ప్రతి సమయంలోనూ హితవు పలకటానికి ప్రయత్నించిన మాహానుభావుడు.

 పాండవులు తమకంటూ ఇంద్రప్రస్థాన్ని ఏర్పరచుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా 

కురు వంశములో ఈ చీలికను భరించలేక స్వచ్ఛందంగా ధృతరాష్టృని కొలువులో 

మిగిలిపోయాడు. ఇక తన వ్యక్తిత్వానికి అసలైన పరీక్ష పెట్టిన ఘట్టం ధర్మ యుద్ధమే.

తన మరణ రహస్యాన్ని తానే బయలుపరిచి మృత్యు దేవతను అహ్వానించిన 

మహాత్ముడు. ఇదంతా ధర్మము యొక్క గెలుపు కోసమే సుమా! అంతటి మహాత్ముడు 

చివరి క్షణాల్లో అంపశయ్య మీద పడుకున్నా యెవరినీ పల్లెత్తు మాట అనలేదు.

మౌనంగా ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురుచూస్తూ తాను ఇది వరకు 

యుద్ధములో దర్శించిన శ్రీ కృష్ణ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఆ శ్రీ కృష్ణుడే 

యుద్ధములో విజయం సాధించిన అనంతరం పాండవులను వెంటబెట్టుకుని భీష్ముణ్ణి చేరాడు.

 భీష్ముని ద్వారా పాండవులకు ధర్మ బోధ చేయించాడు, అదే మనకు శాంతి మరియు 

అనుశాసనిక పర్వాల్లో కనిపించే అద్భుత విషయం. ఆయన నోటి నుండి వెడలివచ్చిన 

అద్భుతాలలో ఒకటి విష్ణు సహస్ర నామం అయితే, రెండవది భీష్మ గీత. ఆయన 

అనుగ్రహానికి నోచుకున్నారు పాండవులు, అందుకనే ఆయన శరీరాన్ని వదిలిపెట్టే

 ముందు సాక్షాత్తుగా ఆయన నుండే ధర్మ సూక్ష్మాలను తెలుసుకోగలిగారు. ఆయన

 కృష్ణుని అనుగ్రహానికి పాత్రులయ్యారు, అందుకనే ఆఖరి ఘడియల్లో అడగకనే 

దర్శనమిచ్చి భీష్మ పితామహుని ప్రాణ జ్యోతిని తనలోనికి లీనం చేసుకున్నాడు 

కృష్ణ పరమాత్మ. అటువంటి పుణ్య పురుషుడైన భీష్మ పితామహుడు భగవత్తాదాత్మ్యం 

చెందిన పుణ్య తిథినే మనం భీష్మ ఏకాదశిగా సంస్మరించుకుంటాము. భారతంలో ఎన్ని

 పాత్రలు ఉన్నా ప్రత్యేకంగా భాసించి మనతో మంచిని భాషించే పాత్ర భీష్మ 

పితామహునిది!


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge