Swara online radio - playing now

మన పురాణ వాఙ్మయంలో శివ ప్రాభవం అనేక చోట్ల విశేషంగా చెప్పబడింది. అయితేఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్న శివ గ్రంథం కాసింత ఎక్కువ ప్రత్యేకమైనది. అదే పరమాద్భుతంగా శివ ఙానాన్ని మనకు విశదపరచే శివ రహస్యం .అచ్చంగా పురాణపద్ధతిలో రచింపబడి లక్షా ఇరవై ఆరు వేల శ్లోకాలతో విలసిల్లుతుంది ఈ గ్రంథం .దీనిని సాక్షాత్తుగా మరో శివ పురాణం అని చెప్పుకోవచ్చును. సుబ్రహ్మణ్యుడు జైగీషవ్య మహా మునికి ఆదరముతో చేసిన ఉపదేశమే ఈ పన్నెండుఅధ్యాయాల శివ రహస్యం .

తాను పార్వతీ పరమేశ్వర సంవాదంగా ఆయా విషయాలనుతెలుసుకున్నట్టుగా స్కంథుడు ఉటంకిస్తాడు .అంటే ఇది సాక్షాత్తుగా శివుని ముఖంద్వార వెలువడిన శివ శాస్త్రం.గిరిజా పతికి సంబంధించిన అన్నీ విషయాలనూ ఈగ్రంథము మనకు అందిస్తుంది.ఈ గ్రంథ రచయత వ్యాసుడని చెప్పుకున్నా ఫరవాలేదు కానీ సాక్షాత్తుగా ఆ షడాననుని అనుగ్రహంగా దీనిని పొందిన జైగీషవ్యుడే దీని రచయత అనటం మరింత సమంజసంగా ఉంటుంది.అత్యంత గహనమైన శివ తత్వాన్ని అమృత ప్రాయంగాశివ రహస్యం అందించబడింది.

ఋభు గీత , వేద పాద స్తవం వంటి వేదాంత విషయాలేఅందుకు తార్కాణం.లెక్కలేనన్ని శివ స్తోత్రాలు ఈ గ్రంథంలో మణుల వలే మెరవటాన్నిమనం గమనించవచ్చు .శివ పరివారం చేసిన స్తోత్రలు ,అనేక మంది ఋషులు చేసినస్తోత్రాలు,అదే విధంగా భక్తులు చేసిన స్తోత్రాలు దేనికవే ప్రత్యేకం.ఒక్క శివ రహస్యంలోనేసుమారు 5 శివ సహస్రనామాలు చెప్పబడ్డాయి అంటే ఈ గ్రంథమ్యొక్క విస్తృతిని మనఅర్థం చేసుకోవచ్చు.అష్టోత్తరాలైతే 12 వరకూ చెప్పబడ్డాయి .రోజుకో శివ స్తోత్రం చొప్పునచదువుకున్నా సంవత్సరానికి సరిపడా శివ స్తుతులు ఈ ఒక్క గ్రంథంలోనే

ఉన్నాయనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇక శివ పూజా విధుల విషయానికొస్తేదిన ,వార ,మాస వ్రతాలెన్నో ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. అభిషేకము ,అర్చన, నైవేద్యము వీటి గురించి కూడా ఎంతో విస్తారంగా చెబుతుంది ఈ శివ రహస్యం.

ఇక రుద్ర ప్రయోగ విధులని రుద్ర నమకాన్ని మనం ఉపయోగించుకోగలిగిన అనేకవిధానాలను ,వాటి వలన కలిగే ఎన్నో ప్రయోజనాలను ఈ గ్రంథం విపులంగాచెబుతుంది. 

శివాలయ విజ్ఞానం, భస్మ మాహాత్మ్యం, బిల్వ పత్ర విశిష్టత, అనేక శివ కైంకర్యాలు ఒకటేమిటి ఎన్నో శివ సంబంధమైన అంశాలు విస్తారంగాచర్చింపబడ్డాయి. శివ క్షేత్ర రాజమైన కాశీ గురించి కళ్ళకు కట్టినట్టుగా వర్ణింపబడింది, అటువంటివే ఎన్నో దివ్య క్షేత్రాలు,అరుదైన శివ లింగాల గురించి చెప్పబడినవిషయాలు అవలోకిస్తుంటే ప్రతీ క్షేత్రాన్ని మనసికంగా దర్శించుకున్న అనుభూతి

కలగక మానదు.శివ భక్తుల గురించి ఎంతో చక్కగా చెప్పబడింది శివ రహస్యం. దీనినేఆధారంగా చేసుకుని తమిళంలో పెరియ పురాణం రాయబడింది అని చెబుతారు .

శివ భక్తిలో తరించటానికి వర్ణము ,వర్గము అడ్డుకావని మనకు ఆయా భక్తుల కథలద్వార ప్రబోధిస్తుంది శివ రహస్యం .చివరగా ప్రస్తావించబడే శాంతి అధ్యాయాలుమరియు రుద్ర తత్త్వ వివరణ లోతుగా వివేచన చేయగలవారికి రస రమ్యంగా తోస్తాయి. శివ భక్తులకు ఉండవల్సిన గుణాలను చెబుతూ మొదలయ్యి శివ పార్వతుల కల్యాణవర్ణనతో సంపూర్ణమౌతుంది ఈ శివ రహస్యం.అంతటి మహా గ్రంథం గురించి శివరాత్రిసందర్భముగా అందరితోనూ పంచుకునే అదృష్టాన్ని కలిగించినందుకు ఆ పరమేష్ఠికిప్రణమిల్లుతున్నాను.అందరిపైనా ఆ పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణ కటాక్షంప్రసరించుగాక. 

సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు

?


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge