Swara online radio - playing now

సంతృప్తిగా, సంతోషంగా ఉంది.. 

పదవీ విరమణ సందర్భంగా  ‘తానా’ అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి

సేవే లక్ష్యంగా తన రెండేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి సమర్ధంగా, సంతృప్తి కరంగా ముగించగలుగుతున్నానని ’తానా’ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి చెప్పారు. ఆయన 2019 జులై నుంచి అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీ ఎన్నికైనందున ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా జయ్ తాళ్ళూరి తన మనోభావాలు పంచుకున్నారు.

Images jay
’తెలుగు భాష, సంస్కతి, సేవ’ అనే మూడు అంశాలపై తాను పనిచేశానని అన్నారు. అయితే కోవిడ్ కు కొద్ది కాలానికి ముందే తాను బాధ్యతలు చేపట్టడం దాదాపు ఏడాదిన్నరగా ఆ మహమ్మారి వల్ల పూర్తి స్థాయిలో ఆశించిన మేరకు కార్యక్రమాలు నిర్వహించలేకపోయామన్నారు. అయితే సాధ్యమైనంతవరకూ, వీలైనంతవరకూ  చేసిన కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా విజయవంతమయ్యాయన్నారు. ఆరు నెలల్లోనే 200 కార్యక్రమాలు చేశామన్నారు. ఉదాహరణకు  పాఠశాల అనే కార్యక్రమం ద్వారా దాదాపు వెయ్యికి పైగా మినీ లైబ్రరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ‘అమ్మా,నాన్నా, గురువు’ అనే  వినూత్న కార్యక్రమం ద్వారా తెలుగు పద్యానికి పట్టం కట్టే కార్యక్రమం నిర్వహించామన్నారు. తెలుగు భాషకే సాధ్యమైన ఈ పద్య ప్రక్రియలో పిల్లలను భాగస్వాములను చేయాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఒక్క రోజునే ఆరు లక్షల మంది చిన్నారులు పాల్గొని విజయవంతం చేశారన్నారు. పిల్లలు పద్యాలను కంఠస్థం చేసి బృందగానంగా వాటిని ఆలపించడం ఓ అద్భుతంగా అభివర్ణించారు.

అలాగే తాము నిర్వహించి ‘బాలోత్సవం’ కార్యక్రమంలో అమెరికాలోని 2200 మంది పిల్లలు పాల్గొన్నారు. 3.50 లక్షల మంది తలిదండ్రులు వచ్చి ఓటు వేశారు అని చెప్పారు. తన రెండేళ్ళ పదవీ కాలంలో చేతనైనంత వీలైనంత మేరకు అనుకున్న కార్యక్రమాలు చేసినా, కన్వెన్షన్ నిర్వహించలేకపోవడం వెలితిగా పేర్కొన్నారు. అలాగే ఆరునెలలకు ఒకసారి జరిగే బోర్డు సమావేశాలు, వివిధ ప్రాంతాల్లో తానా తరపున చేయాల్సిన కార్యక్రమాలను ప్రత్యక్షంగా చేయలేకపోయాం. కోవిడ్ కారణంగా వీటికి ఆటంకం ఏర్పడిందన్నారు. అయితే ప్రపంచంలో అన్ని తెలుగు సంఘాలను ఒకే గొడుగు కిందకు తేవాలన్న ’తానా’ స్థాపక లక్ష్యాన్ని సాధించి పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగామన్న పెద్ద సంతృప్తి మిగిలిందన్నారు. ఇందుకోసం తాము నిర్వహించిన కార్యక్రమంలో 40 దేశాల నుంచి 100 సంస్థలు పాల్గొనడం సంతోషం కలిగించిందన్నారు. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని తెలుగు సంఘాలు ’తానా’ తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు.

తన పదవీ కాలంలో చిన్న చిన్న సవాళ్ళను దాటుకుంటూ ముందుకు సాగామన్నారు. అయితే సమయంతో పోటీ పడి పనిచేయడం అతి పెద్ద సవాల్ అనిపించిందని అయినా ఒప్పుకున్న బాధ్యతను సక్రమంగా నిర్వహించడం కోసం ఇష్టంగానే ఆ సవాల్ ను కూడా  అధిగమించానని చెప్పారు. ఇప్పటి వరకూ తాను విజయవంతంగా నిర్వహించిన కార్యక్రమాల పట్ల సంతోషంగానూ, సంతృప్తిగానే ఉందన్నారు. తన ఈ ప్రయాణంలో సహకరించిన తన బృంద సభ్యులకు, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు.

కొత్త కార్యవర్గానికి ఇచ్చే సూచనలు అంటూ ఏమీ ఉండవని అంతా ఇప్పటివరకూ కొనసాగిన కార్యక్రమాల్లో పాల్గొన్నవారే కావడంతో అన్నీ తెలుసన్నారు. ఎక్కడ ఏయే ఏయే కార్యక్రమాలు నిలిచి పోయాయి, బలం, బలహీనతలు అన్నీ తెలిసినందుు ఎక్కడ ఆగపోయాయో అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తారన్నారు.  ముఖ్యంగా  తానా లాభాపేక్షలేని సేవా సంస్థ కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకుని సేవాకార్యక్రమాలు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. అలాగే, ఈ సేవా సంస్థకు జరిగే ఎన్నికలు రాజకీయపరమైన ఎన్నికలు కానందున అంతా అది గుర్తెరిగి పనిచేయాలన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. ఇక ముందు కూడా తాను సేవా కార్యక్రమాల్లోనే కనసాగుతానని చెప్పారు.      

Jaytalluri

నేను అనుకుంటే ఒకడుగు.. మనం అనుకుంటే ముందడుగు : ’తానా’ అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి 

‘పరోపకారమే అన్ని ప్రార్ధనలకన్నా మిన్న’ అన్న సూక్తిని మససా వాచా కర్మాణా నమ్మి మానవతా సేవలో ముందుకు సాగుతూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు  జయ శేఖర్ తాళ్ళూరి. వ్యక్తిగా అనుకుంటే ఒక్కరే..సమష్ఠిగా నుకుంటే శక్తిగా ఆవిర్భవించవచ్చన్న ప్రాతిపదికన‘నేను అనుకుంటే ఒక్క అడుగే..మనం అనుకుంటే ముందడుగే’ అన్న నినాదంతో దూసుకుపోతున్నారు ఆయన పలు సేవా రంగాల్లో.

అమెరికాలో ’హాల్ మార్క్ టెక్నాలజీ గ్రూప్’ సంస్థను స్థాపించి వ్యాపారవేత్త్తగానే గాక సామాజిక సేవా తత్పరుడిగా అటు అమెరికాలోనూ, మాతృభూమి ఇండియాలో ముఖ్యం గా ఆయన జన్మభూమి ప్రాంతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎందరికో చేయూతనిస్తూ, ఉపాధి కల్పిస్తూ వారి స్వశక్తితో నిలబడేలా తోడ్పాటునందించారు. 

’తానా’(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) తో ఆయనకు దాదాపు 20 సంవత్సరాలకు పైగా అనుబంధం ఉంది. ఫిలదెల్ఫియాలో 2001లో జరిగిన సదస్సు నుంచి ’తానా’తో అనుబంధం పెనవేసుకున్నారు. తానా ఫౌండేషన్ లో వివిధ పదవులు నిర్వహించడమే గాక  ఆ సంస్థ ఛైర్మన్ గా తానా కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళారు. ఆ అనుభవంతోనే ఆయన 2019 జులై 8న ’తానా’ అధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు.  సేవకు మారుపేరుగా ’తానా’ను నిలపడమే తన లక్ష్యమని చెబుతున్నారు. 

జయ్ తాళ్ళూరి సేవా ప్రస్థానం:

జయ్ శేఖర్.. ’తాళ్ళూరి ట్రస్ట్’ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలు(మెడికల్ క్యాంప్స్) నిర్వహిస్తూ వైద్య సలహాలు, చికిత్సలు, శస్త్ర చికిత్సలు( సర్జరీలు)  చేయిస్తూ సాయమందిస్తున్నారు. 

సేవా కార్యక్రమాల్లో ’తానా’ ను అగ్రగామిగా నిలపాలన్న ఆశయంతో అన్నశ్రీరాజ్ శ్రీకృష్ణ తోకలిసి 2.50 లక్షల డాలర్లు, మిత్ర బృందంతో కలిసి 5లక్సల డాలర్ల విలరాళాలు సేకరించి అందించారు.

Progress

విద్యారంగ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ’ మై ప్రోగ్రెస్ కార్డ్ .కాం ద్వారా  ఎందరో మెరిట్ విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు  అందిస్తున్నారు.  డిజిటల్ క్లాస్  రూమ్ లను ఏర్పాటు చేయడంలో సాంకేతిక పరికరాలు(కంప్యూటర్లు) అందిస్తున్నారు. ఎన్నో పాఠశాలల అభివృద్ధికి చేయూతనందిస్తున్నారు.. సొంత ప్రాంతంలో కాలేజీల స్థాపన, పాఠశాలలను దత్తత తీసుకుని అభివద్ధి పర్చడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.  

సొంత ప్రాంతంలోని వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి నిధుల కల్పన :

ఆయన సొంత జిల్లా అయిన ఖమ్మం జిల్లా టేకుల పల్లిలో ’తాళ్ళూరి టెక్స్ట్ టైల్స్’ స్థాపించి ఆ ప్రాంతంలో ఎంతో మంది యువతకు, మహళలకు కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించారు.  అలాగే భారత్ లో ఏర్పడిన విపత్తు సమయాల్లో తన వంతు సాయంగా  బాధితులకు బాసటగా నిలిచారు. వరదల సందర్భంలో బాధితులకు భరోసా కల్పిస్తూ పునరావాస కార్యక్రమాలకు ఆర్ధికంగా సహకరించారు.  

వృద్ధాప్యం శాపం కాదని, కాల చక్రంలో వచ్చే మార్పేనని ధైర్యం చెబుతూ ఆసరా లేకుండా అనాధలుగా మిగిలిపోతున్న వృద్ధులకు కొంతమందికైనా సాయమందించాలన్న లక్ష్యంతో తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇలా ’తాళ్ళూరి ట్రస్ట్’ ద్వారా పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 

వ్యక్తిగతం..వ్యక్తిత్వం..

ఖమ్మం జిల్లా ప్రాంతంలో ప్రముఖుడిగా ఉన్న  తాళ్ళూరి పంచాక్షరయ్య చిన్న కుమార్డుడు జయ్ శేఖర్. భద్రాచలం సమీపంలోని విరివిండి గ్రామంలో ఆయన జన్మించారు.  జయ్ బాల్యం గుడివాడలోనూ, హైస్కూల్ విద్యాభ్యాసం కాకినాడలో జరిగింది. రాయచూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి లాంగ్ ఐల్యాండ్ లో స్థిరపడ్డారు. హాల్ మార్క్ టెక్నాలజీస్ గ్రూప్  ను ఏర్పాటు చేసి అక్కడే స్థిరపడ్డారు.  ధార్మిక. సామాజిక రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వివాద రహితుడిగా, సౌమ్యుడిగా పేరొందారు జయ్ శేఖర్ తాళ్ళూరి.  


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg
Krishna Kumar

Legend

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge