Swara online radio - playing now

 SWARA NAARASIMHA

  నమో నారసింహా!
(అవతరార్చన)

                                    – వొ(ఒ) జ్జల శరత్ బాబు

“Evaluation of species which explains that all specious of live have descended from common ancestors, and it occurred by a process called natural selection, in which the struggle of existence allows organisms to become more adopted to the environment”

   — ఇది ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెస్ డార్విన్, ప్రపంచసృష్టి జరిగిన పరిణామాలను ఊహిస్తూ తాను ప్రకటించిన ‘జీవపరిణామ సిద్ధాన్తమ్’(theory of evolution). దీని ప్రకారం జీవి మొదట ఉద్భవించింది జలంలో. తర్వాత స్థితిలో జల, భూచరంగా పుట్టింది. చివరన భూసంచారక జీవిగా పరిణామమొందింది. ఇదే డార్విన్ సిద్ధాన్త తాత్పర్యం. ఈ సిద్ధాన్తం సనాతన ధర్మదశావాతార నిరూపణకు దగ్గరలో ఉంటుంది. సనాతన ధర్మ శాస్త్రీయతను ప్రశ్నించే వారికి ఓ ఆధారభూత ప్రాయమైంది.

‘the scientific theory of evolution states that life on earth began as single celled organisms and later developed into multi celled beings.’

ఈ దృష్టితో సనాతనధర్మ దశావతారాలను పరిశీలిద్దాం.

I) Aquatic form – Fish – మత్స్యావతారం

II) Amphibians stage – Tortoise – కూర్మావతారం

III) Animal Life on land – Boar – వరాహావతారం

IV) The transition form of animals – Lion man – నరసింహావతారం

V) Early homo sapiens, Home erectus –  వామనావతారం

VI) Homo sapiens – Human age – పరశురామావతారం

VII) Homo sapiens – A complete man – రామావతారం

VIII) Homo sapiens inner awareness advanced human –  శ్రీకృష్ణావతారం

IX) Consciousness home sapiens – self realization, inner enlightenment – బుద్ధావతారం (భాగవతంలోని బుద్ధుడు)

X) Ultimate terminator – next stage – కల్క్యావతారం (రావాల్సి ఉంది)

ఈ పరిణామా సిద్ధాన్తామ్‌లోనైనా, సనాతన ధర్మ అవతారాల్లోనూ కీలమైనది నృసింహావతారం. భాగవత పురాణం ప్రకారం అవతారాలు ఇరవై ఒకటి. వీటిలో విభిన్నమైనది నరసింహావతారం. ఇది ఆవేశావతారం. దుష్టశిక్షణ – శిష్టరక్షణ నిమిత్తమైనది. రౌద్ర, వీర, భీభత్స, కరుణ, అద్భుత రసాలను ఏక కాలంలో ప్రతిబింబింప చేసిన అవతార విశేషం.

ప్రపంచానికి విప్లవ బీజం:

ప్రపంచంలోని అనేక విప్లవాలకు ఈ అవతారసందేశం బీజంగా చెప్పవచ్చు. ‘రాజు సర్వస్వం కాదు. అతణ్ణి మించిన శక్తి ఉంటుంది. అది ఏ రూపంలో విజృంభించినా రాజు మట్టి కరుస్తాడు’. ఈ సందేశం కొరకు శాంతియుత విప్లవాన్ని ఎన్నుకున్నాడు. కన్నతండ్రిని ఎదిరించాడు. రాజే గొప్ప అనే విషయాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాడు.

అందుకనుగుణంగా మిత్రులను, ఇతర జీవజలాన్ని సిద్దం చేసుకున్నాడు. రాజు కంటే బలమైన శక్తి (భగవచ్ఛక్తి) ఉంటుందని నిర్దేశించాడు. అచంచల విశ్వాసంతో ముందడుగు వేసాడు. నిగమాంతర్గతుడైన ధర్మస్వరూపాన్ని తన హృదయాంతరాళల్లో నిల్పుకున్నాడు. నమ్మిన ధర్మ నిరూపణం చేసాడు. అలా చేసినతనే ప్రహ్లాదుడు.

హిరణ్యకశిపుడి వరాలే నృసింహ దర్శనం:

ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. ఈయనదొక విచిత్ర మరణం. నేనిలాగే చావాలని పరోక్షంగా నిర్దేశించుకున్న ఘనుడు. ‘జాతస్యహి ధృవో మృత్యువు…’ అని తెలిసి బ్రహ్మ వరానుగ్రహుడైనాడు. అంటే తనను చంపేవాడు ఎలా ఉండకూడదో కోరుకున్నాడు. ఎక్కడ చంపకూడదో కోరుకున్నాడు. ఏ సమయాలు కూడవో నిర్దేశించుకున్నాడు. ఇలా తన వరాలను సాధించుకోవడంలో సఫలుడైనాడు. ఆ విధంగా విష్ణువుకు నరసింహావతార స్థితిని పరోక్షంగా ఏర్పరిచాడు. తద్వారా నరసింహావతారం దర్శనమైంది.

నరసింహావతార ప్రసక్తి – ఆరాధన:

నరసింహావతార ప్రసక్తి, ప్రశస్తి, ప్రాచూర్యం, ప్రాభవాలు యావత్ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. భాగవత, పద్మ, విష్ణు, బ్రహ్మ.. ఇత్యాది పురాణాల్లో కనిపిస్తుంది. ఈ అవతారావిష్కరణ ఘట్టానికి ఊతమిచ్చే ప్రదేశాలు మన దగ్గర అహోబిలంలోను, నేటి పాకిస్తాన్‌లోని ప్రహ్లాద పురిలోనూ ఉండటం వల్ల భరత ఖండంలో నృసింహారాధన ఎక్కువ. జర్మనీలోను, టర్కీ – సిరియా సరిహద్దున టిగ్రిస్ నదీ పరీవాహక ప్రాంతంలోనూ కార్బన్ డేటింగ్ ప్రకారం దాదాపు మూడు వేల రెండు సంవత్సరాల క్రితం నాటి నృసింహ మూర్తులు (మెసపటోమియా నాగరికత కాలం నాటివట) బయట పడినట్టు వింటూన్నాం. చదువుతున్నాం. చూస్తూన్నాం.

బౌద్ధంలో కూడా నృసింహారాధన ప్రసక్తి కనిపిస్తుంది. యశోధర బుద్ధుడిని నారసింహుడుగా వర్ణిస్తుంది. ఈ విషయాన్ని సుత్తపిటకం కందక విభాగం ఇరవై యొకటవ పుస్తకం ఖండసా యుత్తంలోని ‘ఖజ్జనామవగ్గ’ అనే మూడవ అధ్యాయము (21.2.36) ద్వారా గ్రహించవచ్చు. ఇక సిక్కు మతంలో ‘సింగ్’ ప్రధాన పాత్ర వహిస్తుందనే విషయం సువిదితమే. సనాతనధర్మంలోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, నింబార్కాది సిద్ధాంతాలలో నృసింహ ప్రాశస్త్యం కనపడుతుంది. గాణాపత్య, శైవ, వైష్ణవ, శాక్తేయ, దత్తాత్రేయ ఇత్యాది మతాంతరాలలోనూ నృసింహారాధన ప్రముఖంగా ఉంది. శంకర పీఠం, జీయర్ల మఠాలు (మన దగ్గర శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజీయ మఠం, శ్రీ మదహోబిల మఠం మొదలుగునవి), మాధ్య మఠాలు, ఇస్కాన్ వారు.. ఇలా చాలా రకాలుగా ఉన్న వీరంతా నృసింహోపాసనకు పాదులు వేస్తున్న వారే. శంకర భగవత్పాదుల నృసింహారాధనా ప్రాభవం అందరికీ తెలిసిందే. ఆయన స్వయంగా రెండు మార్లు నృసింహ రక్షణ పొందారు. స్మార్త, వైఖానస, పాంచరాత్రాది ఆగమం విధానాల్లో నృసింహార్చనా విధానాలున్నాయి.

నృసింహారాధనలో చెంచులది ప్రత్యేకమైనదనే చెప్పాలి. చెంచు లక్ష్మిని నృసింహుడు పెళ్లి చేసుకున్నాడనే కథనం మనకు తెలిసిందే. నేటికీ చెంచులు అహోబిలం, లక్ష్మీ పురం లాంటి నవనారసింహాలయాల్లో వారి ప్రత్యేకతను చాటుకుంటూనేయున్నారు.

నారసింహ క్షేత్రాలు – ప్రభావాలు:

నారసింహ క్షేత్రాల స్థలమాహాత్మ్యాలు, స్థానిక గాథల్లాంటివి చూసినప్పుడు నృసింహ ప్రహ్లాదులు అనేక ప్రాంతాల్లో తిరిగినట్లు కనబడుతుంది. నరసింహోపాసన యావత్భారతంలో ఉన్నా దక్షిణ భారతంలో అందునా తెలుగు ప్రాంతాల్లో మరీ ఎక్కువ. ఇక్కడున్న అత్యధిక క్షేత్రాలే దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయాలన్నీ ఎక్కువగా గుట్టలపై, గుహల్లోను, అటవీ ప్రాంతాల్లో, నదీతీర ప్రాంతాల్లో వెలసినాయి. నృసింహోపాసకులైన తాపసులు, చెంచుల నివాసాలు పైన చెప్పుకున్న ఆయా ప్రదేశాలనే విషయం గమనార్హం. ఆ ప్రాంతాల్లోనే దుష్ట సంచారాలు ఎక్కువ. అంటే శిష్టరక్షణకు అవకాశాలు తక్కువ. అందుకనే స్వామి కరుణా ప్రపూర్ణత్వం కొరకు నృసింహోపాసన ఎక్కువ.

‘అటవ్యాం నరసింహాశ్చ..’ అని ఆదిశంకరాచార్యుల మాట ఉండనే ఉంది కదా? ఆయన స్వీయానుభవమే నృసింహ ప్రభావానికి నిదర్శనం.

నర్సింహులు, నర్సయ్య, నరహరి, నరసింహ, నర్సింగ్ .. లాంటి పేర్లతో స్వామి ప్రభావం దేశమంతటా కనబడుతుంది. ఆయా క్షేత్రాల పేర పెంచలయ్య, సింహాచలం, యాదయ్య, నాంపల్లి, నింబాద్రి, ధర్మయ్య లాంటి పేర్లతో క్షేత్ర ప్రభావం తెలుస్తోంది. ఇంత ప్రభావత్మక నారసింహ క్షేత్రాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అహోబిలం, లక్ష్మీపురం (అమ్రాబాద్ దగ్గర – మహబూబ్ నగర్ జిల్లా) లాంటి నవనరసింహ క్షేత్రాలు, యాదాద్రి లాంటి పంచనారసింహ క్షేత్రాలూ ఉన్నాయి. వేదాద్రి, మంగళగిరి, ధర్మపురి లాంటి అతి ప్రాచీన క్షేత్రాలూ ఉన్నాయి. వివిధ ప్రత్యేకతలతో కూడిన ఆలయాలూ ఉన్నాయి. తెలుగు ప్రాంతంలోనే  దాదాపు ఆరు వందల నారసింహ క్షేత్రాలు ఉండవచ్చని ఒక అంచనా. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిశోధనల ప్రకారం మూడు వందల నారసింహ క్షేత్రాలుగా తెలిసింది. కీ.శే. చెఱుకు కాశీ విశ్వనాథం ఏలూరి వారి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు అన్ని క్షేత్రాలున్నట్లు ప్రాథమిక అంచనా. పరిశోధనల్లో ఇంకా ఎక్కువ క్షేత్రాలు బయటపడేందుకు అవకాశాలు ఉన్నాయి.

Lord laxmi narasimha swamy

   నారసింహ స్వామిని స్తుతిస్తూ భక్తిప్రపత్తులతో ఎంతోమంది కవులు వివిధ రచనలను ఆయా క్షేత్రాలలోని స్వామికి అంకితమిచ్చారు. భయంకరమైన రోగాలపాలైనవారు. మానసిక ఆరోగ్యం బాగా లేనివారు, సర్వోత్తమ సిద్ధి పొందాలనుకునేవారూ, ఇలా రకరకాలుగా ఆయా క్షేత్రాలలో ఆరాధిస్తున్నారు. అలాంటి మొత్తం నారసింహ క్షేత్రాల గూర్చి ఒకటొకటిగా తెలుసుకునే ప్రయత్నం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్దాం.

(సశేషం)

Note:

తెలుగు ప్రాంతంలోనే  దాదాపు 600 నారసింహ క్షేత్రాలు ఉండవచ్చని ఒక అంచనా. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిశోధనల ప్రకారం 300 నారసింహ క్షేత్రాలుగా తెలిసింది. కీ.శే. చెఱుకు కాశీ విశ్వనాథం ఏలూరి వారి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు అన్ని క్షేత్రాలున్నట్లు ప్రాథమిక అంచనా. పరిశోధనల్లో ఇంకా ఎక్కువ క్షేత్రాలు బయటపడేందుకు అవకాశాలు ఉన్నాయి.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg
sarathbabu

Legend

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge