Swara online radio - playing now

దసరాగా పిలిచే విజయదశమి తెలంగాణలో చాలా పెద్ద పండుగ. జీవన పోరాటంలో ఉద్యోగం కోసం కన్న తల్లినిఉన్న ఊరు విడిచి పెట్టి పట్టణాలునగరాలుదేశాల బాట పట్టిన పల్లె జనం దసరా నాడు మళ్లీ కన్నతల్లి గా ఆదరించే సొంత ఊరికి తరలివచ్చే రోజు. తల్లిదండ్రులతో పాటు తనతో చిన్నప్పుడు ఆడిపాడిన చిన్ననాటి స్నేహితులతో కలిసే రోజు. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే రోజు. 

1620221667383

హైదరాబాద్ నుండి అమెరికాలో ఉండే కుటుంబ సభ్యుల దాకాతాము పుట్టి పెరిగిన పల్లెలకు వచ్చికుటుంబ సభ్యులుఆత్మీయులుస్నేహితుల మధ్య సరదాగా సంతోషంగా గడుపుకునే దసరా పండుగరోజు గురించి సరదాగా చెప్పుకుందాము.

ఖాన్గి బడులు.. వస్తాద్ సాబ్‌లు

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు మన దేశంలో ప్రభుత్వ బడులు చాలా తక్కువగా ఉండేవి. ఆనాడు  తెలంగాణలో చాలా వరకు విద్య వెనుకబడే ఉంది. ఆ కాలంలో పల్లెల్లో ప్రైవేటు బడులు ఉండేవి. వీటిని ఉర్దూలో ఖాన్గి బడులని పిలిచేవారు. వీటిలో ఎక్కువ భాగం ‘ సాతాని ’ అయ్యవార్లు ఉపాధ్యాయులుగా ఉండేవారు. అలాగే పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు శారీరక వ్యాయామం కూడా నేర్పించే ముస్లిం ఉపాధ్యాయులు కూడా ఉండేవారు. వారి అసలు పేరు ఏమైనా కూడా వస్తాద్ సాబ్ అని పిలిచేవారు. 

1620221667488

జీతం సున్నా.. బాధ్యత మిన్న

ప్రైవేటు బళ్ల ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఉండేవికావు. విద్యాబోధన వారికి ఒక ప్యాషన్. అది ఒక సామాజిక బాధ్యత. అది వారికి వృత్తి కాదు ప్రవృత్తి. వారు తమ జీవనం గడవడం కోసం పిల్లల తల్లిదండ్రులు ఇచ్చే తృణమో పణమో తీసుకొనేవారు. విద్యాబోధన చేసేవారు. దాంతో వారికి ఆర్థికంగా చాలా కష్టనష్టాలు ఉండేవి. అయినా విద్యాబోధన ఒక వృత్తిగా కాకుండా ప్రవృత్తిగా తీసుకుని సమాజంలో చాలా మందిని విద్యావంతులను చేయగలిగారు.అందుకే సమాజానికి తాము ఇచ్చిన విలువైన విద్యకు ప్రతిఫలంగా అప్పుడప్పుడు గ్రామ పెద్దలచే సత్కారాలుసన్మానాలతో పాటు ఒక్కోసారి చివాట్లు కూడా  పడేవారు.ఈ ప్రైవేటు ఉపాధ్యాయులు తమ విద్యా దానానికి ప్రతిఫలంగా సమాజం మీద ఆధారపడేవారు. అలా పరస్పర ఆధారిత పద్ధతిలో సమాజం సాగేది. 

విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల పరిశీలన

మా చిన్నతనంలో మా అమ్మబాపు మాకు చెప్పిన విషయాలలో ఈ దసరా పాట కూడా ఉంది. దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది. 

1620221667596

దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే ఈ పాటఈ తరం వారికి తెలియచేస్తూమరొకసారి ఆనాటివారికి అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేయడమే ఈ వ్యాసకర్త ప్రయత్నం. 

ఈ దసరా పాటలో ప్రైవేటు బడుల అయ్యవార్ల పేదరికంతో పాటు వారి ఆర్థిక అవసరాలు కూడా ప్రతిబింబిస్తాయి.ఆ గ్రామ పెద్దలకు వారి ఆర్థిక అభ్యర్థన కూడా ఉంటుంది.

అలాగే తాము విద్యాబుద్ధులు నేర్పించే పిల్లల అభ్యసన సామర్థ్యాలను గ్రామ పెద్దల ముందు ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది. అలనాడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని తన తొడ మీద కూర్చోపెట్టుకుని అనునయిస్తూ గురువుల వద్దా ఏమి నేర్చుకున్నావురా బిడ్డా అని అడిగిన సంగతి సినిమాలలో చూసాము.తన కుమారుని విద్యా బుద్ధుల గురించి గురువులను పిలిపించివారి ముందరే ప్రహ్లాదుని విద్య సామర్థ్య పరీక్షలు పెట్టిన సంగతి మనం పురాణాల్లొ చదువుకున్నాం.ఈ ఆధునిక కాలంలో పిల్లల అభ్యసన సామర్ధ్యాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పిల్లల అభ్యసన సామర్థ్యాలను గ్రామ పెద్దల ముందు ప్రదర్శించే అలనాటి సంగతిని మనం ఒక సారి గమనించాలి.

దసరా సరదా పాట

1

ఏదయా మీ దయా మామీద లేదు!

ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

దసరాకు వస్తిమని విసవిసలు బడక!చేతిలో లేదనక ఇవ్వలేమనక !

ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!

రేపురా మాపురా మళ్ళి రమ్మనక!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా! దిగ్విజయీభవా!!

2

పావలా బేడైతె పట్టేది లేదు!

అర్థరూపాయైతె అంటేది లేదు!

ముప్పావలైతేనుముట్టేది లేదు!

రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!

జయీభవ విజయీభవా! దిగ్విజయీభవా!!

3

అయ్యవారికి చాలు ఐదు వరహాలు!

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!

శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవ! దిగ్విజయీభవ!!

దసరా పండుగ ముందు రోజు సెలవులలోగ్రామాలలోని వీధులలోపిల్లలు ముందు వరుసలో క్రమశిక్షణగా నడుస్తుంటే వారి వెనక ఉపాధ్యాయులు నడుస్తుంటేపిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిటాఆగిదసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైన ఆచారమిది. 

పెద్దల ఎదుట కుమార జ్ఞాన ప్రదర్శన

దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలుశ్లోకాలుగణిత సమస్యలుపొడుపు కథలుమొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన చేయించేవారు. 

1620221667674

పిల్లల వయస్సుతరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పితమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించిపెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు. ఇదే కదా నిజమైన పరీక్ష. 

ఉపాధ్యాయులకు విద్యార్ధులకు ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లోదేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తేముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.ఆనాటి పిల్లలు అలనాటి మహాభారతంలో అర్జునుడి  జీవన కురుక్షేత్రంలో విజయులయ్యారు. 

అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు. ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పద్యాలు పాటలు పాడుకోవడం లేదు.

ఊరు బడి – ఏలుబడి

ఊరు బడి తీరు చూసి ఆ గ్రామ ఏలుబడి గురించి అంచనా వేయవచ్చు"ఊరు బడి తీరు చూడ ఎట్లున్నది ఏలుబడి తీరు చూడ అట్లున్నది" అనే పాట మీరు వినే ఉంటారు.ఒక వ్యక్తి అభివృద్ధి గానిసమాజ అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమనిచదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామంలోని బడి‘ బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.

ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ సొంత ఇళ్లను బడి నడపడానికి ఇచ్చేవారు. పాఠశాల భవనం నిర్మించడానికి తమ సొంత పట్టా భూములనుస్థలాలను నిస్వార్ధంగా దానం చేశారు. ఆ పాఠశాల నడవడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ఊళ్లోని భూస్వాములురైతులు ఆ గ్రామంలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎకరానికి ఇంత అని చందాలు వేసుకుని స్కూలు బాగోగులు చూసుకునే వారు. భూములు లేని పేదలురైతు కూలీలు తమ శ్రమనే పెట్టుబడిగా భావించి పాఠశాల మౌలిక వసతులకు అవసరమైన శ్రమ దానం చేసేవారు.

బడికి గుదిబండలుగా నిర్లిప్తతఉదాసీనత

ఇప్పుడు అంతా ప్రభుత్వం చూసుకుంటుంది లెమ్మనే మనస్తత్వం ప్రబలింది. ప్రభుత్వ బడి పట్ల ప్రజలలో ఒక నిర్లిప్తత నెలకొంది. ప్రైవేటుకార్పొరేటు బడుల వల్ల తమ గ్రామంలోని ‘ ఊరు బడి ‘ తమది కాదు అనే ఉదాసీనత ప్రజలలో పెరిగింది. అలాగే గ్రామాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులలో కూడాఆ గ్రామంలోని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే భావన కొరవడిన ఈ పరిస్థితి నుండిఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రామాల ప్రజలతో పూర్వకాలంలోలాగా మమేకమయ్యే ఆలోచనకు వచ్చారు. 

పిల్లలు వెలుగు దివ్వెలు

కానీ ఇప్పటికీ చాలా గ్రామాలలో బడికిఊరికీ మధ్య అగాధం పెరిగింది. అందుకే బడి బాగుచేసుకునే ప్రజల భాగస్వామ్యం ఈనాడు కొరవడింది. వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞానమూర్తులు ఆనాటి ఉపాధ్యాయులు. ఈనాడు కూడా కొంతమంది అలాంటి నిబద్ధతతో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. నాటి ఉపాధ్యాయులలో పిల్లలకు విద్యజ్ఞానాన్ని అందిస్తూ కేవలం బ్రతకడానికే కాకుండా సమాజాన్ని బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలు’ గా మార్చేవారు.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge