Swara online radio - playing now

తెలంగాణలో ఉద్యోగ పర్వం మొదలయ్యేది ఎప్పుడు? 

-బండారు రామ్మోహనరావు.

నీళ్లు,నిధులు సరే నియామకాలెప్పుడు?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం మేరకు వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని జూలై నెల 13,14 వ తేదీ లలో వరుసగా రెండు రోజులు జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం వార్షిక క్యాలెండర్ తయారు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.ప్రతి సంవత్సరం గుర్తించిన ప్రభుత్వ ఉద్యోగాలను అదే సంవత్సరం విధిగా భర్తీ చేయాలని ఆదేశించింది. కొత్త జిల్లాల వారిగా ఉద్యోగులు అధికారుల సంఖ్య ఎంత మేరకు ఉండాలో తేల్చాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరింది. దీనికి ఆయా జిల్లాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని అని సూచించింది.

Jobs

ఈ వార్త చదవడానికి బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఉందిలే మంచి కాలం ముందుముందునా అని నిరుద్యోగులు అపరిమితమైన ఆనందం తో పాట పాడుకుంటారనిపిస్తుంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట ఇలాంటి మాటలు గత ఏడు సంవత్సరాలుగా నిరుద్యోగులతో పాటు తెలంగాణ సమాజం ఎన్నోసార్లు విన్నది. ఇంకా వింటూనే ఉంది. కెసిఆర్ మాటలు కోటలు దాటుతాయి కాని అడుగు బయట పడదన్నట్లు గత ఏడేళ్లుగా ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం చాలావరకు విఫలమైంది. ఒకరకంగా ఎన్నికలప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ మొదటిసారి గెలిచిన ఐదేళ్లలో ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా నియామకాలు అదిగో ఇదిగో అంటూ ఊరించి ఊరించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో కూడా సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. ఎన్నికలయిపోయిన తర్వాత ఆ మాటే మరిచిపోయారు. ఆ తర్వాత మొదట హుజూర్ నగర్ ఉప ఎన్నిక, తర్వాత దుబ్బాక, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ ప్రకటనలు చేశారు. కానీ ఆ మాటలు నీటి మూటలయిపోయాయ. ఇక ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుంది. 

మళ్లీ ఉద్యోగ నియామకాల మీద మాటల గారడీ మొదలైంది.రాష్ట్రంలో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు మొన్నటి మంత్రివర్గ సమావేశాల్లో కేవలం 60 వేల లోపు ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తేల్చిచెప్పారు. ఈ లెక్కలకు పొంతన కుదరడం లేదు.అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని సరిగ్గా లెక్క తేల్చి  వచ్చే వారం పది రోజుల లోపు ప్రభుత్వం ముందు పెట్టాలని ఆదేశించారు. అదీకాకుండా గత మూడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానివల్ల రాష్ట్రంలో జోనల్ సమస్య పరిష్కరించబడడం లేదు.చివరగా ప్రస్తుతం వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ జిల్లాల పేర్లు మారుస్తూ హనుమకొండ వరంగల్ జిల్లాలు ఏర్పాటు చేశారు. వాటిలో కూడా మళ్లీ మండలాలు, డివిజన్ల పరిధిలో మార్పు జరుగుతుంది.దీంతో ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఇలా కొనసాగుతుండడం వల్ల మరో కొత్త సమస్య ఏర్పడే అవకాశం ఉంది.ఉద్యోగ కల్పనలో వచ్చే సాంకేతిక సమస్యల గురించి కూడా ఎప్పటికప్పుడు ఇలా తాత్కాలికంగా ఆలోచించడం వల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడం లేదు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఎత్తుగడగా మాత్రమే నిరుద్యోగ సమస్యను లేవనెత్తడం ఖాళీలను నింపుతామని ఆశలు కల్పించడం ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. దీంతో నిరుద్యోగులు ఎన్నికలకు ముందు "ఓడ మల్లయ్యలుగా ఎన్నికల తర్వాత బోడి మల్లయ్యలుగా" మారిపోతున్నారు. ఇప్పటికైనా ఎన్నికల రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ సమాజం కోరుకున్న తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ ఆయన "నీళ్లు నిధులు నియామకాలు" అనే అంశంలో చివరిదైన నియామకాలను వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే లభించవు. ఇది ఏ దేశంలోనైనా కష్టమే. కానీ ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో కూడా యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు పెరగాలంటే దానికి  అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. నైపుణ్యాలు పెంచడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపవచ్చు. మనసుంటే మార్గం ఉంటుందిగా!

-బండారు రామ్మోహనరావు.

  సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge