Swara online radio - playing now

తత్వవేత్త సంఘ సంస్కర్త, ఈశ్వరచంద్ర విద్యాసాగర్

-బండారు రామ్మోహనరావు.

స్వామి వివేకానందనే ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

జూలై 29,1891.బెంగాలీ కవి, విద్యావేత్త, తత్వవేత్త, పారిశ్రామికవేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఈశ్వరచంద్ర బందోపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటను మనం చాలామందికి  అలవోకగా అన్వయిస్తూఉంటాము. కానీ ఈ మాట అందరికీ వాడడం మంచిది కాదు.ఈశ్వరచంద్ర బందోపాధ్యాయ కాస్త విద్యాసాగర్ అనే బిరుదు అందుకున్న తర్వాత ఆయన కు సరిగ్గా సరిపోయే మాట బహుముఖ ప్రజ్ఞాశాలి.ఎందుకంటే విద్యా వేత్త, తత్వవేత్త, పారిశ్రామికవేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు, బెంగాలి  కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవి  వర్యులు గా ఆయన నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. బెంగాలీ లిపిని 1780 తర్వాత మొదటిసారి క్రమబద్ధీకరించిన భాషాభిమాని ఈశ్వరచంద్ర విద్యాసాగర్.

ఈశ్వరచంద్ర నేటి పశ్చిమ బెంగాల్ లోని బిర్సింగా గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 1820 సెప్టెంబర్ 26 న జన్మించాడు. బాల్యమంతా పేదరికంతో గడుపుతూ కూడా పుస్తక జ్ఞానం సంపాదించాడు.తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావడం చేత కొడుకు కూడా అదే వృత్తిని ఎంచుకున్నాడు. మొదట గ్రామంలో పాఠశాలలో చదివిన ఈశ్వర్ 1928 లో తన తండ్రికి కలకత్తాలో ఉద్యోగం దొరకడంతో కలకత్తాకు మకాం మార్చాడు. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో చదివాడు. 1839లో హిందూ న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులైన ఈశ్వరచంద్ర  కాస్త విద్యాసాగర్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. చదువు ముగిసిన రెండు సంవత్సరాల తర్వాత కలకత్తాలోని "ఫోర్ట్ విలియం" కాలేజీలో ప్రధాన సంస్కృత పండిత స్థానాన్ని పొందాడు. 

అప్పుడే ఆయన అభ్యుదయ భావాలు కలిగిన వాడు. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నత విద్య పరిమితం కావడం సరైంది కాదు అని ఆయన భావించారు. అందుకే ఆ కళాశాలలోనే అన్ని కులముల బాలబాలికలకు విద్య నేర్పించాలని ముఖ్యంగా మహిళలకు కూడా విద్య నేర్పించాలని ఆయన కోరారు. మహిళలు విద్యకు ఎట్టి పరిస్థితులలో కూడా దూరం కాకూడదని ఆయన పోరాటం మొదలు పెట్టాడు. దానివల్ల ఆ కాలేజీ యాజమాన్యానికి ఇబ్బంది కలిగింది. దాంతో 1849లో ఆ కాలేజీ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేశారు. 

అభిమానుల ప్రోత్సాహంతో ఒక సంవత్సరం తర్వాత అదే కాలేజీలో సాహిత్య పండితుడి పోస్టులు మళ్ళీ లభించింది. అయినా తాను మొదట డిమాండ్ చేసినట్లుగా అన్ని కులముల వారికి విద్య అందించాలని మరొకసారి పోరాటం ప్రారంభించారు. ఆ తర్వాత  ఆయన స్కూల్స్ ఇన్ స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది తాను అనుకున్న విధంగా అన్ని కులాల వారికి చదువుకునే అవకాశం కలిగిన సుమారు 20 స్కూళ్లను ఆయన స్థాపించారు. ఆ తరువాత చారిత్రక నేపథ్యంలో ఫోర్డ్ విలియమ్స్ కళాశాల మూతపడింది. ఆ స్థానంలోనే కలకత్తా విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఆ విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక సభ్యుడిగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా ఉన్నారు.

స్వామి వివేకానందనే  ప్రభావితం చేసిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్:

ఉత్తర భారతదేశంలో విద్యాసాగర్ నీడ సోకని నా వయసు వరకు కలవారు ఎవరూ లేరని ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారి గురించి స్వామి వివేకానంద గారు స్వయంగా పేర్కొన్నారు. అంతటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులనే  ప్రభావితం చేసిన అద్భుతమైన వ్యక్తిత్వం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారిది. విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయం కలవాడు. 

ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే సమాజంలో పేదల పై దయ జాలి కనికరం చూపించారు. సమాజంలో అందరికీ సహనము నైతిక విలువలను నేర్పించారు. వితంతు వివాహాలు ప్రోత్సహించి మహిళల జీవన గతిని మెరుగుపరచడానికి విద్యాసాగర్ అలుపెరుగని ఉద్యమం చేశారు.

హిందూ మతంలోని సంస్కరణలు:

      విద్యాసాగర్ కాలంలో బ్రహ్మసమాజం నాయకుడైన రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్ర సేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కృష్ణ మోహన్ బెనర్జీ లతోపాటు క్రైస్తవ మత ఆచార్యులైన "అలెగ్జాండర్ డాం" లాంటి సమకాలికులకు ధీటుగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ హిందూ మత సంస్కరణ ఉద్యమం లో పని చేశారు. 

హిందూ మతం లోని అనేక అవలక్షణాలు విమర్శించి ఆర్యసమాజము బ్రహ్మ సమాజం స్థాపించి పని చేసిన న అలాంటి సంఘ సంస్కర్తల కంటే మరొక సంఘం పెట్టుకునే బదులు అదే హిందూమతంలో ఉన్న మూఢాచారాలను కుళ్ళును  కడిగి వేయడానికి అందులోనే  లోపం ఎక్కడ ఉందో గుర్తించి సంస్కరణలు చేపట్టి ముల్లును ముల్లుతోనే తీయాలని  భావించిన వ్యక్తి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్.

కలకత్తా లోని ప్రఖ్యాత సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ గా పండితులను శాస్త్రములు చదివి వాటి అర్థములు సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెప్పాలని కోరారు. 19వ శతాబ్దంలో అణగదొక్కబడిన మహిళల స్థితి బాగుచేయడానికి అవసరమైతే హిందూధర్మశాస్త్రాలను కూడా సంస్కరించాలని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న వారి మూర్ఖత్వం వల్లనే హిందూ సమాజంలో సరైన సంస్కరణలు జరగడం లేదని ఆయన భావించారు.

1627916385750

వితంతు వివాహాలు జరిపించిన విద్యాసాగర్:

అప్పటివరకు బ్రహ్మ సమాజంలో అక్కడక్కడా జరిగే వితంతు వివాహాలను ప్రధాన హిందూ సమాజంలోకి విద్యాసాగర్ ఒంటి చేతితో తీసుకొని వచ్చారు. బెంగాలీ  కులీన బ్రాహ్మణులలో ఆ కాలంలో బహుభార్యత్వం విరివిగా విస్తృతంగా ఉండేది. దాంతో ముసలివాడైన బ్రాహ్మణులు కూడా యుక్తవయసు కూడా రాని  బాలికలను పెళ్లి చేసుకునే వారు. అలా పండు ముదుసలిలకు పడుచు పిల్లలతో పెళ్లి కావడం వల్ల అతను చనిపోయిన తర్వాత వారు వితంతువులుగా మారే వారు. అలా అప్పటి బెంగాలీ బ్రాహ్మణ సమాజంలో కోకొల్లలుగా ఇంటికి ఒక వితంతువు ఉండేవారు.

వితంతు వివాహాల చట్టం:

1627917120854వితంతు వివాహాల కోసం విద్యాసాగర్ 1856లో నే వితంతు పునర్వివాహ చట్టం పదిహేనవ నెంబర్ చట్టం ప్రతిపాదించి దాని అమలుకు అన్నివిధాలుగా కృషి చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో సంస్కృత కళాశాలలో విద్యా సాగర్ సహోద్యోగి అయిన "శ్రీశ చంద్ర విద్యా రత్న" వివాహాన్ని ఈ చట్టం కింద మొదటిసారి జరిపించారు. సాంప్రదాయ పురోహితులు వెలివేసిన వితంతు వివాహాలకు విద్యాసాగర్ స్వయంగా పురోహితునిగా వ్యవహరించేవారు. 

ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్న సూత్రాన్ని పాటించకుండా తాను చెప్పిన సూత్రాలను తన కుటుంబంలో కూడా ఆయన అమలు చేశారు. తన కొడుకు ఒక వితంతువును పెళ్లాడటానికి కూడా ఆయన ప్రోత్సహించారు. పెళ్లి చేసుకోలేని వితంతువులకు సహాయార్థం ఆయన ఒక నిధి ని కూడా ఏర్పాటు చేశారు. అలా సమాజ సంస్కర్త గా అనేక వితంతు వివాహాలు జరిపించే వాటికి అయ్యే ఖర్చు తానే భరించి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనేక ఆర్థిక సామాజిక కష్టనష్టాలు కూడా ఎదుర్కొన్నారు.

అంతర్జలి యాత్ర సినిమా కథ కు స్ఫూర్తి ఆయనదే:

19వ శతాబ్దంలో గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన "అంతర్జలి యాత్ర"అనే సినిమా ఈ నేపథ్యంలోనే వచ్చింది. అప్పటి బెంగాలీ సమాజంలో బహుభార్యత్వం ఇతివృత్తంగా ఇది నిర్మించబడింది. ఆ సినిమాలో ఒక ఒక పడుచు తన ముసలి భర్త మరణం కోసం గంగా నది తీరాన వేచి ఉంటుంది. అప్పుడు వృద్ధాప్యం తో అనారోగ్యం పాలైన ముసలి వారిని ఆ కుటుంబం  అలా నది వద్ద నిర్దాక్షిణ్యంగా వదిలి వేసేది.కానీ కట్టుకున్న భార్య కనక పడుచు భార్య తన ముసలి భర్త చనిపోయే వరకు వేచి ఉండి తర్వాత వితంతువుగా మారిపోయేది. ఇలాంటి దుర్మార్గాన్ని ప్రశ్నించిన సాహసి సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్.

సంస్కృత ముద్రణాలయ స్థాపన తో సాహితీ సేవ:

1627909798641ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1857లో కలకత్తా నగరంలో సంస్కృత ముద్రణాలయాన్ని  స్థాపించారు. ఎన్నో తాళపత్ర గ్రంథములను భద్రపరిచి కేంద్రాన్ని కలకత్తాలోని "ఆమహేర్స్" వీధిలో నెలకొల్పారు. 600 రూపాయలు అప్పు తో దీన్ని ఆయన ప్రారంభించారు. బెంగాలీ సాహిత్యం లోని అనేక అముద్రిత గ్రంథాలను ఆయన ఈ ముద్రణాలయం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ముద్రణాలయం ఏర్పాటుతో ఆయన ఒక వ్యాపారవేత్తగా కూడా ప్రాచుర్యం పొందారు. 

అనేక సంస్కృత గ్రంథాలను బెంగాల్ భాష లోకి అనువదించడం మూలంగా ఆయన అనువాదకుడిగా కూడా మారారు. అందుకే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కేవలం సంఘసంస్కర్త గానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. బెంగాల్ సాహిత్యానికి భాషకు ఎంతో వన్నెతెచ్చిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ తన 71 ఏళ్ల వయసులో 1891 జూలై 29 న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మరణించారు.

-బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge