Swara online radio - playing now

జ్ఞానపదులు

 బి.కె.ప్రేమ్, మోండా మార్కెట్, సికింద్రాబాద్

1

పరిస్థితులు చుట్టుముడితే –
పరిమళమనిపిస్తుందా చందనం.
పసిపాపలా ఉండగలిగితే –
పండువెన్నెలే కదా జీవితం.
    రంగులగూర్చి ఎవరికి కావాలోయ్ –
    అంతరంగంలో మార్పు రావాలి.
    నింగికి నిచ్చెన ఎందుకు వేయాలోయ్ –
    నిల్చున్నచోటే నిర్భయంగా బ్రతకాలి.

2
 ఆపదవచ్చిందని అనుకుంటే ఎలా –
 అనుభవం వచ్చిందనుకుంటే పోలా.
 ఆదమరచి నిదిరిస్తే ఎలా –
 అడుగు ముందుకేయి దివిటీలా.
              మనల్ని మనం అర్థంచేసుకుంటేనే కదా –
              ఇతరులను అర్థం చేసుకోవడం తేలిక.
              ఇవన్నీ అర్థం కాకుంటేనే కదా –
              అందరిమధ్య వస్తుంది చీలిక.

3

చెడు సాంగత్యంతో ఎప్పటికైనా –
చెడుపు కాకుంటుందా.
పాలుపోసి పెంచినంత మాత్రానా –
పాము కాటేయక మానుతుందా.
      ఎదిగినకొద్దీ ఒదిగినవాడు –
      అనబడతాడయ్యా ధన్యుడు.
      ఏ ఎండకాగొడుగు పట్టినవాడు –
      ఎలాఅవుతాడయ్యా మాన్యుడు.

4

జరిగిన చెడునెందుకు తలుచుకుంటావు –
మిగిలేది బాధే కదా.
ఇతరులతో ఎందుకు పోల్చుకుంటావు –
కలిగేది మనోవ్యధే కాదా.
         నోటితో నవ్వుతూనే –
        నొసటితో వెక్కిరిస్తారు రామా.
        పరులను నిందిస్తూనే –
        పరమానందం పొందుతారు భావ్యమా.            

5

కానున్నది కాకమానదు కదా –
 కంగారుపడతావెందుకు.
 రానున్నది రాకమానదు కదా –
 ఎదురు చూస్తావెందుకు.
           బండరాయి సైతం ఓర్పు వహిస్తే –
           అవుతుంది ఆలయంలో విగ్రహం.
            మనిషి సహితం సహనం వహిస్తే –
            మారడానికి తోడ్పడుతుంది నిగ్రహం.

6

మనసుకు నచ్చినదేదైనా –
మహదానందమే మనకు.
మనవారని హితవు పలికినా –
మనసంగీకరించదెందుకు.
       ఎన్నెన్నో గీతలను ధరిస్తుందయ్యా –
      తెల్లకాగితం కదా.
      ఏవేవో బాధలను భరిస్తుందయ్యా –
      మూగజీవితం కాదా.

7

ఎంతగ లాగితే అంతగ బాణం –
మునుముందుకు దూసుకుపోతుంది.
విలువైనదే ప్రతిక్షణం –
గడిచిందా తిరిగి రానంటుంది.
         కళ్ళముందున్నది కాలదన్నుకుంటూ –
         పరుగులు పెడుతుంటారు రామా.
        చంద్రునిలో మచ్చలున్నాయంటూ –
        వెలుతురునే కాదనుకుంటామా.

8

ఊహల్లో ఊరేగుతూ –
ఉనికిని మరుస్తుంటారు రామా.
చుక్కలను లెక్కిస్తూ –
మేధావిని అనుకుంటారు భావ్యమా.
            పరస్పరం నిందలతోని –
           ఎలా వస్తుందయ్యా ఫలితం.
            ఆశించని సేవలతోని –
           ఉంటుందయ్యా ప్రతిఫలం.

9

అందరికందరు దేవతలైతే –
ఎందుకు మరి ఆ గుడులు.
అనుభవమే పాఠాలైతే –
ఎందుకు వేరేబడులు.
         నీచచేష్టలు మరిగినవానికి –
         నీతిబోధ ఎలా వినిపిస్తుంది.
         అదుపుతప్పితే నాలుక మనిషికి –
         అధోగతికి చేరుస్తుంది.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg
prem

Novice

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge