Swara online radio - playing now

జనవరి 18 యోగి వేమన జయంతి

‘సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’అల్పాక్షరాల్లో తో అనంతమైన వేదాంత సారాన్ని పలికించిన వేమన

బండారు రామ్మోహనరావు

వేమనను ఎవరూ కవిగా భావించరుఆయన యోగి, అందుకే యోగి వేమన గా ప్రసిద్ధి చెందారుకవి కంటే యోగి వంద రెట్లు ఎక్కువఅందుకే ఆదిశంకరాచార్యులను కూడా కేవలం కవిగా పిలువముఅద్భుతమైన సౌందర్యలహరి కవితాత్మకంగా శృతి లయలతో రాసిన ఆయన కేవలం కవి మాత్రమే కాలేదుఆదిశంకరుడు అయ్యారుఅలాంటి స్థానాలకు వెళ్ళిన కవులు అరుదువారి గురించి మనం మర్చిపోకుండా అప్పుడప్పుడు వారి జయంతి, వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామువేమన  రాసిన శతక పద్యాలు  ఐదు వందల సంవత్సరాలు దాటినా కూడా నేటికీ ప్రజల నాలుకల మీద నాట్యం ఆడుతున్నాయివేమన పద్యాలు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నాయిఅచ్చమైన తెలుగు లో అవి మనను పలకరిస్తాయిపలువరిస్తాయిఅందుకే అక్షరం జ్ఞానంతో నిమిత్తం లేకుండా ఆయన పద్యాలు పండితపామర బేధం లేకుండా అందరి నోళ్లలో నేటికి నానుతున్నాయివేమన పద్యం ఒక్కటైనా రాని తెలుగు వారు ఉండరువేమన జయంతిని  పెద్దగా ఎవరూ పట్టించుకోలేదుఅది వచ్చింది, పోయిందికానీ ఆయన పద్యాలను ప్రజలు తమ నిత్య జీవితంలో మరువరుప్రజల నాలుకల మీద ఆయన చెప్పిన పద్యాల సారాంశం పద్యాలుసామెతల రూపంలో అసంకల్పితంగానే మన నోటి వెంట వస్తాయిఅందుకే ఈ సందర్భంగా ప్రజాకవి వేమన గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి.* 

‘సుకవి జీవించు ప్రజల నాలుకల మీద’

రాజుమరణించేనొకతారరాలిపోయె

కవియుమరణించెనొకతారగగనమెక్కె

రాజుజీవించెరాతివిగ్రహములందు

సుకవిజీవించుప్రజలనాలుకలయందు

అంటారు "ఫిరదౌసిలో నవయుగ కవి చక్రవర్తిపద్మభూషణ్, గుర్రం జాషువాఆయన చెప్పిన మాటలు యోగివేమన విషయంలో అక్షర సత్యాలు.

ఆటవెలదిలో ఆటలాడి.!!!

వేమన అచ్చ తెలుగులో ఆటవెలదిలో నే ఎక్కువ పద్యాలు రాశారుఆటవెలదిలో తెలుగు నుడికారాల ఆటలాడుకున్నారుఅప్పుడప్పుడు "కందపద్యాలు అందంగా రాసినా కూడా వ్యాకరణాలచందోబద్ధమైన పదాలకు అతీతంగా ప్రజలు మాట్లాడుకునే భాషలో రాశారుకనుక నేటికీ వేమన శతకం పండిత పామరుల నోళ్ళలో నానుతూనే ఉందిఆయన పద్యాలలో కేవలం మూడు చరణాలు ఉంటాయిఅన్నిట్లో ఉండే నాలుగవ చరణం విశ్వదాభిరామ వినర వేమమూడు చరణాలులోనే  విశ్వ భావనను  చేర్చి కూర్చిన  ఆయన వామనత్వాన్ని వదిలిన  త్రివిక్రముడుగా మారాడు.

సమాజపు తీరుతెన్నులను విమర్శించిన వేమన

వేమన రాసిన పద్యాలలో సమాజపు తీరుతెన్నులు నిశితంగా పరిశీలించిన తీరు కనిపిస్తుంది. ఇలా సామాజిక పరిశీలన చేసిన కవులలో వేమన తర్వాతే మిగతా వారందరూ ఉంటారుముక్కుసూటి మనస్తత్వంహేతువాద దృక్పథం కూడిన తన పద్యాల ద్వారా విశ్వజనీన  సత్యాలు చెప్పారు.

పో"తనవే"మన"

పురాతన కవులలో వేమన, పోతన లాంటి వారి గురించి చెప్పుకోవాలంటే పోతన పేరులో "తన"ఉంది. అందుకే ఆయన తనదైన శైలిలో ఆధ్యాత్మికం వైపు వెళ్లారుభారత, రామాయణాల తర్వాత పోతన తన భాగవతాన్ని నిలిపారువేమన  పేరులో "మనఉంది. అందుకే మన అందరి గురించి ఆయన రాశారులోకకళ్యాణం కోసం పరితపించారుఅందుకే వేమన పేరులోని లోని "మన". అందరి నాలుకల ఆయన పద్యాలు ముద్రించబడ్డాయి.

వేమన ప్రతిభను వెలికి తెచ్చిన విదేశీయుడు సి పి బ్రౌన్

తెలుగు వారి గురించి, వారి గొప్పతనాన్ని గురించి తెలుగువారే పెద్దగా పట్టించుకోరు అనేదానికి మనం ఉదాహరణగా నిలుస్తాం.  మన వేమన గొప్పతనాన్ని గురించి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చెప్పేదాకా మనకు అర్థం కాలేదుచార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మన తెలుగు నేర్చుకొని వెయ్యి సంవత్సరాల వెనక్కి వెళ్లి ఆదికవి నన్నయ కవిత్వంలోని చిన్న చిన్న లోపాలను కూడా సవరిస్తూ వెలుగులోకి తెచ్చారువేమన పద్యాలను వెలుగులోకి తెచ్చారుఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషలో వేమన పద్యాలను అనువదించారుచాలా ఇంగ్లీషు సామెతలకు వేమన పద్యాలకు సారూప్యత ఉంటుందిఉదాహరణ  "ప్రాక్టీస్ మేక్స్ ఫర్ ఫెక్ట్"అనే సామెత కు "సాధనమున పనులు సమకూరు ధరలోనఅనే పద్యం అచ్చంగా మక్కీకి మక్కీగా ఉంటుందివేమనను మనకు నిత్యనూతనంగా అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కి మనం ఘనమైన నివాళి కూడా అర్పించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సోక్రటీస్ మొదలుకొని అనేక మంది అంతకు ముందటి ఆ తర్వాతి గ్రీకు తత్త్వవేత్తలకు ఏ మాత్రం తీసిపోని ప్రతిభ వేమనదిఎందుకంటే ఆ తత్వవేత్త లందరూ ఏదైనా ఒక విషయం పై మాత్రమే ఆలోచించారువేమన సమగ్ర సార్వజనీన సత్యాలు గురించి ఆలోచించి పద్యాలు రాశారు.

తేట తేట తెలుగులో!

తెలుగు పేరు మీద సంస్కృతాన్ని తెలుగు గా ప్రచారం చేసిన చాలామంది మంది కవులను చూశాముకానీ వేమన పద్యాలలో అచ్చమైన మనం రోజువారీ మాట్లాడే తెలుగు ఉందిఅందుకే ఆయన మీద వందల మంది సాహిత్యకారులు పరిశోధనలు చేశారువేమన పద్యాలు జాతీయాలుగా మారి మనకు నీతులు బోధిస్తున్నాయివేమన ఎప్పుడూ ఇంకి పోనీ ఒక చెలిమె లాంటివాడుఎంత తోడుకున్నా మళ్లీమళ్లీ నీళ్ళు ఊరుతున్న చెలిమె మనకు గుర్తుకు వస్తుంది.  వేమన సోషల్ కమిట్మెంట్సామాజిక నిబద్ధత గురించి చెప్పాలంటే సామాజిక దురాచారాలను చిన్న చిన్న మాటలతో చెండాడాడు.

కొండ అద్దమందు కొంచమై నిలువదా!!!

ఇటీవలె కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభ సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గురజాడ అప్పారావు గారి కవితలు ఉటంకించారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి సాయపడవోయ్ అనే మాటలు గుర్తు చేశారుఅంటే ఫిజికల్ రిసోర్సెస్ కన్నా హ్యూమన్ రిసోర్సెస్ ముఖ్యమనిగురజాడ ఆనాడే గుర్తించారుఅందుకే హ్యూమన్ రిసోర్సెస్ లో ఉండే రకరకాల మనస్తత్వాలు, జీవిత సారాన్ని వేమన తన పద్యాలలో నిక్కచ్చిగా మొహమాటం లేకుండా చెప్పారుకవిత్వంలోని సాంద్రతకు ఆయన తన పద్యాలలో పెద్ద పీట వేశారుఅందుకే కాలానికి అతీతంగా  పద్యాలు నిలబడ్డాయివంద కిలోల బంగారు ఆభరణాలతో ఒక మగువ మన ఎదుట కనబడితే ఆహా ఓహో అంటాంఅదే ఒక పల్లెటూరి పడుచు పిల్ల ఎలాంటి ఆభరణాలు లేకుండా, సహజసిద్ధమైన పల్లెపడుచు అలంకరణతో వస్తే ఎలా ఉంటుందో అలాగే అచ్చతెలుగు నుడికారాలు తో మన వేమన పద్యం మనలను అలరిస్తుందిఅందుకే వేమన పద్యాల గురించి రాయాలంటే "కొండ అద్దమందు కొంచమై ఉండదావిశ్వదాభిరామ వినర వేమవేమన పద్యాల గురించి చెప్పాలంటే ఇంతకన్నా మరొక ఉపమానం మనకు దొరకదు.

*-బండారు రామ్మోహనరావు.*

 *సెల్ నెంబర్.98660 74027.*


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge