Swara online radio - playing now

కేంద్ర మంత్రివర్గ విస్తరణ లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం

-బండారు రామ్మోహనరావు.

ఎవరు అవుట్, ఎవరు ఇన్?  మిత్ర  పక్షాలకు పెద్దపీట వేస్తారా? త్రిబుల్ ఆర్ కి మంత్రి పదవి దక్కేనా?

జూలై 7 బుధవారం రోజు కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. దీంతో కేబినెట్ విస్తరణ పై అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రులలో వారి వారి పనితీరును బట్టి అంచనావేసి మంత్రివర్గం నుండి ఎంత మంది బయటకు పంపబడతారు. కొత్తగా ఎంతమంది బయటి నుంచి వస్తారనే విషయంలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నరేంద్ర మోడీ అమిత్ షా ల జంట తమ రాజకీయ చాకచక్యంతో మంత్రివర్గ కూర్పులో విమర్శలు లేకుండా చేస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. 

ఆశావహులను ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ:

2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీ 2014 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సొంతంగా గెలుచుకుంది. మిత్రపక్షాల అవసరం లేకుండానే బిజెపి పార్టీ ఒక్కటే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయదగ్గ స్థానాలు గెలుచుకుంది. అప్పటి నుంచి ఇటు ప్రభుత్వం మీద అటు పార్టీ మీద నరేంద్ర మోడీ పట్టు గట్టిగా బలపడింది. గత రెండేళ్లలో ప్రస్తుత మంత్రి వర్గ విస్తరణ మొదటిదని చెప్పవచ్చు. 2019 లో రెండవ సారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన  తర్వాత నుండి మంత్రివర్గ విస్తరణ కు అదిగో ముహూర్తం ఇదిగో ముహూర్తం అంటూ ఆశావహులను ఊరిస్తూ కాలయాపన చేశారు.

ఖాళీలను మొత్తంగా పూరిస్తారా?

ప్రస్తుత మంత్రివర్గంలో 21 మంది క్యాబినెట్ మంత్రులు మరొక 9 మంది స్వతంత్ర శాఖలతో కూడిన సహాయ మంత్రులు ఉన్నారు. వీరు కాక మరో 23 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మొత్తం 53 మంది తో ప్రస్తుత కేంద్ర మంత్రివర్గం ఏర్పడింది. కేంద్రము రాష్ట్రాలలో జంబోజెట్ మంత్రివర్గాలను ఏర్పరచకుండా కట్టడి చేయడానికి అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను బట్టి మంత్రివర్గం సైజు గురించి మన చట్టాల లో పేర్కొన్నారు.దాని ప్రకారం పార్లమెంటు సీట్లను అనుసరించి కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 81 మంది మంత్రుల వరకు ఉండవచ్చు. అంటే మరొక 28 మంది వరకు మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. ఆ ప్రకారం మంత్రివర్గం పూర్తిస్థాయి విస్తరణ ఉంటుందా?. లేక రాజకీయ వ్యూహాల కోసం మరికొందరు ఆశావహులను వారి ఆశలు సజీవంగా ఉంచడం కోసం కొంతమందిని మాత్రమే మంత్రివర్గంలో తీసుకుంటారా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే మంత్రివర్గం కూర్పు అనేది పూర్తిగా ప్రధానమంత్రికి సంబంధించిన అంశం. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన నమ్మదగిన రాజకీయ సహచరులు, రాజకీయ నేతలతో కూర్చొని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సమీకరణలు చేశారు. దేశంలో వచ్చే సంవత్సరం జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగా తన పార్టీ లో బలంగా ఉన్న నాయకులను  కాపాడుకుంటూనే ఈసారి మిత్రపక్షాలకు కూడా పెద్దపీట వేస్తారని ఒక అంచనా ఉంది. మొదట తన పార్టీ వారిని ఎక్కువమందిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిన జితిన్ ప్రసాద్ ఇటీవలనే బీజేపీ పార్టీలో చేరారు. మంత్రివర్గంలో ఆయన బెర్త్ ఖాయమని తెలుస్తోంది.ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో కీలకమైన నేతగా ఉండి కాంగ్రెస్ నుండి బిజెపి లోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా తో పాటు ,బీహార్ నుంచి సుశీల్ మోడీ, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ లకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం బలంగా ఉంది.

ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని అకాలీదళ్ మహారాష్ట్రలోని శివసేన ఇలాంటి పెద్ద మిత్రపక్షాలను భారతీయ జనతా పార్టీ రాజకీయ కారణాల వల్ల వదులుకుంది. ఆ తర్వాత ప్రస్తుత మంత్రివర్గంలో రిపబ్లికన్ పార్టీ నేత రాందాస్ అథవాలే ఒక్కరే ఇతర పక్షాల నుండి ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నారు. ఇప్పుడు కొత్త మిత్రపక్షాలకు పెద్దపీట వేసే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా కమలనాథుల మిత్రపక్షాలైన అప్నా దళ్ పార్టీ నుండి అనుప్రియ పటేల్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.కీర్తిశేషులైన రామ్ విలాస్ పాశ్వాన్ స్థానంలో బీహార్ నుండి ఆయన వారసుడు పాశ్వాన్ కుమారుడైన చిరాగ్ పాశ్వాన్ కు వ్యతిరేకంగా బీజేపీ పావులు కదుపుతోంది. రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడైన లోక్ జనశక్తి చీలిక వర్గం నేత పశుపతి పరాస్ కు ఛాన్స్ వస్తుందని రాజకీయ వర్గాల లో ఒక ఊహాగానం బలంగా వినిపిస్తుంది. అలాగే బీహార్ నుండి జనతాదళ్ యు నుండి మరొక ఇద్దరికీ మంత్రివర్గంలో ఛాన్స్ లభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ నుండి మంత్రి వర్గంలో ఎక్కువమందికి చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 80 పార్లమెంటు సీట్లు ఉన్నందువల్ల ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చడానికి పార్టీని మరింత బలోపేతం చేయడానికి నరేంద్ర మోడీ ఈ మంత్రివర్గ విస్తరణను ఒక అవకాశంగా మలుచుకుంటారు. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి రాలేక పోయినా కూడా గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి అక్కడి నుండి ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది.

గవర్నర్ల నియామకం తో ప్రారంభం, ఇక మంత్రివర్గ విస్తరణ తరువాయి:

K. Haribabu

పార్టీ సీనియర్ నాయకులను కాపాడుకునే దిశలో భాగంగానే దేశవ్యాప్తంగా ఆరుగురు బిజెపి క్రియాశీల సీనియర్ నాయకులకు కొత్తగా గవర్నర్ పదవులను కట్టబెట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బిజెపి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హరి బాబును గవర్నర్ గా నియమించింది.

త్రిబుల్ ఆర్ కి మంత్రి పదవి ఇస్తారా?

Rrr

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి నుండి నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఆ తర్వాత ఆయన సొంత పార్టీలోనే కొరకరాని కొయ్యగా మారిపోయిన రఘురామకృష్ణంరాజు కి ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో స్థానం దక్కుతుందా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన గెలిచిన నాటినుండి ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ పార్టీ అది నాయకుడు, అధ్యక్షుడు అయిన జగన్ మోహన్ రెడ్డి ని రాజకీయంగా ఇబ్బంది పెట్టే చాలా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి నేర చరిత్ర గురించి, ఆయన పాలనలో తీసుకుంటున్న అనేక అవకతవకలు నిర్ణయాల గురించి సూటిగా, లౌక్యంగా ప్రశ్నించారు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ తోనే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి గా మారిన రఘురామకృష్ణంరాజు పై కేసులు పెట్టించారు. దాంతోపాటు రాజద్రోహం కేసు కింద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో కేసు పెట్టించి రఘురామకృష్ణంరాజును జైల్లో తొయించారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఈ పరిణామంతో రఘురామకృష్ణంరాజు మెల్లమెల్లగా బిజెపి పార్టీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత సీబీఐ కేసులో జగన్మోహన్ రెడ్డి కి లభించిన బెయిలు దుర్వినియోగం అవుతుందని ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలని మరొక పిటిషన్ వేశారు.

Bjp ysrcp ఆంధ్రప్రదేశ్ సీబీఐ డైరెక్టర్ తాను ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఒక మతానికి ప్రచారం చేస్తున్నారని హిందూ మతం విషయంలో ఆయన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో ఒక పిటిషన్ వేశారు. గత రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలలో సంచలనాలకు కారణమవుతున్న రఘురామకృష్ణంరాజు జగన్మోహనరెడ్డి చేస్తున్న మత రాజకీయాలను ప్రశ్నించడం వల్ల బిజెపి పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ రఘురామ కృష్ణం రాజు అనే ఒకే ఒక ఎంపీ సీటు కోసం తన అనుంగు మిత్రుడయిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బిజెపి పార్టీ వదులు కుంటుoదా అనేది  ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు గుర్రం ఎగరావచ్చు.

ఏదేమైనా రేపటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాబోయే  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రాజకీయం తో పాటు మిత్రపక్షాలను తన అక్కున చేర్చుకునే రాజకీయాన్ని కూడా చాణిక్య రాజకీయాలతో నరేంద్ర మోడీ పాటించి ప్రస్తుత రాజకీయ అసంతృప్తి నుండి గట్టెక్కుతారని ఆశించవచ్చు.

-బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge