Swara online radio - playing now

కెసిఆర్ దళిత రాగం ఎందుకోసం?

ఈ ప్రశ్నలకు బదులేది?

-బండారు రామ్మోహనరావు.

  • తెలంగాణ రైతు బంధు పథకం హుజురాబాద్ ఎన్నికల కోసమేనా?
  • రాజకీయ విమర్శల పాలవుతున్న తెలంగాణ రైతు బంధు…
  • దళిత ముఖ్యమంత్రి సంగతి ఏమిటి?
  • 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమైంది?
  • దళితులకు 3 ఎకరాల భూమి పథకం ఏమైంది?

ఈ ప్రశ్నలకు కె సి ఆరే  జవాబివ్వాలి…

తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ దళిత బంధు అనే ఒక కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపక్ష నాయకులు, వివిధ దళిత సంఘ నాయకులతో పాటు అధికారులు అనధికారులు తో వారం 10 రోజుల క్రితమే ఒక సమావేశం జరిపారు. ఆ సమావేశంలో ఈ పథకం గురించి చర్చించారు. చివరికి దాని సారాంశం దళితుల అభ్యున్నతికి అభివృద్ధి కోసం దళితులు తమ కాళ్ల మీద తాము నిలబడడం కోసం ఒక కొత్త పథకానికి అంకురార్పణ చేశారు. ఆ పథకానికి "దళిత బంధు"అని నామకరణ చేశారు.

ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు?

కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా భాష, రాష్ట్రం, ప్రాంతం తేడాలేకుండా దేశమంతటా దళితులు అణగారిన వర్గాలు గా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారనే వాస్తవం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు.దేశ స్వాతంత్య్రానంతరం అన్ని పార్టీల వారు దళితుల అభ్యున్నతికి ఎంతో కొంత చేశారు. కానీ వారికి అరకొర పథకాలతో తాత్కాలిక తాయిలాలతో ఎన్నో కార్యక్రమాలు రూపొందించినా వారు పేదరికం నుంచి బయట పడడం లేదు. ఇది వాస్తవం. దేశంలో పేదలు మరింత  పేదలుగా మారుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులుగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ తీరును మార్చాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. సూత్రప్రాయంగా చూస్తే ఇది మంచి పథకం. చాలీచాలని నిధులు ఇస్తూ దానిద్వారా సంపూర్ణమైన అభివృద్ధి కావాలంటే సాధ్యం కాదు. పేదరికంలో ఉన్న ఒక దళిత కుటుంబాన్ని గుర్తించి వారికి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా సహాయం చేసి దాని ద్వారా వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు చేయడమే ఈ పథకం ఉద్దేశం. మొదటగా ఈ పథకాన్ని ఆహ్వానించాలి. కానీ దీనికి ప్రతిపక్షాలు రాజకీయ ఉద్దేశాలను కూడా అంత కడుతున్నాయన్న విమర్శ అధికారపక్షం చేస్తుంది.

విమర్శకు విమర్శ- తప్పుకు  మరో తప్పు సమాధానం కాదు:

విమర్శకు విమర్శ తప్పు కు మరో తప్పు సమాధానం ఎంత మాత్రము కాదు. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి పథకాల తీరుతెన్నులను చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వీటిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.లేకపోతే మేము చేసేది చేస్తాము మీరు చెప్పేది మీరు చెప్పండి అనే తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాదే ఎందుకు?

1626717571603

  మొదటగా ప్రతిపక్షాలు చేసే విమర్శ ఏమిటంటే ఈటల రాజేందర్ రాజీనామా వల్ల వచ్చే హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని ముందుకు తీసుకు వచ్చారని ఒక విమర్శ చేస్తున్నారు. ఇది వాస్తవమే అనడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఈ పథకాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారి అమలు చేయడానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలోనే తమ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1200 కోట్ల రూపాయలను కేటాయిస్తామని ప్రకటించింది. అదికాక హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్టుకు ఈ సంవత్సరమే 1200 నుంచి 1500 కోట్ల రూపాయల వరకు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా బట్టబయలైంది. 

Hzbd 1హుజూరాబాద్ నియోజకవర్గం లో ఇప్పటికే అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి దళిత కుటుంబాలు ఉన్నాయి. సుమారు 60 వేల మంది దళిత ఓటర్లు ఉన్నారు. పిల్లలతో కలిసి మరొక 20,30 వేల మంది దళిత జనాభా ఉంటుంది. ఈ పరిస్థితులలో ఒకే సంవత్సరంలో హుజరాబాద్ నియోజకవర్గం లోని 100% దళితు కుటుంబాలకు ఈ సహాయం అందే వీలుంది. ఇది ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే ప్రజాధనంతో ప్రభుత్వం హుజురాబాద్ ఓటర్లకు ఇచ్చే ఎన్నికల తాయిలంగా చెప్పవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాబాద్ నియోజకవర్గంలో సుమారు 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ లను ఈ పనిని నియోగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కన్నా ముందు ఈ పథకం అమలు కోసం అనే నెపంతో హుజురాబాద్ నియోజకవర్గంలో వాడుకుంటుంది. అందుకోసమే మొత్తం హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. నియోజకవర్గంలో ఎంత మంది దళితులు ఉన్నారు. వారి కుటుంబాల సంఖ్య ఎంత. వారి ఆర్థిక స్థితిగతులు, గతంలో వారు ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్న పథకాలు ఇతర సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తారు. ఆ తర్వాత ఈ పథకం అమలు మొదలుపెడతారు. ఇంతవరకు బాగానే ఉంది. 

ఈ ప్రశ్నలకు బదులేది?

గత ఏడు నెలలుగా దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ ఏమయ్యాయని ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాలు క్రియాశీల పౌరులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా దళితులకు 3 ఎకరాల భూమి పంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే ఆర్భాటంగా ప్రకటించింది.అందులో పూర్తిగా భూమిలేని నిరుపేదలతోపాటు ఒకటి లేక రెండు ఎకరాలు ఉన్న దళిత కుటుంబాలను కూడా గుర్తించి వారికి మూడెకరాల కు  నిండేలా మిగతా భూమి కొని ఇస్తానని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా హామీ ఇచ్చింది. ఆ పథకం కొంతమందికి మాత్రమే వర్తించింది. ప్రస్తుతం దాదాపుగా ఆగిపోయింది. దీనికి ఉన్న అవరోధాలను ప్రభుత్వం ముందుగా గుర్తించకపోవడమే అసలు సమస్య. కొత్తగా మనుషులు పుడతారు. దానిద్వారా కుటుంబాల సంఖ్య పెరుగుతుంది. దాంతో ఇది నిరంతర ప్రక్రియగా మారుతుంది. కానీ  భూమి అనేది పరిమితమైన వనరు.కొత్తగా మనుషులు పుట్టినట్టు భూమి పుట్టదు. దాంతో ఇది ఆచరణ సాధ్యం కాని హామీగా మిగిలిపోతుంది. ప్రస్తుతం అదే జరిగింది. ఇక రాజకీయ వాగ్దానాల సంగతి సరే సరి తెలంగాణ ఉద్యమకారుడిగా కెసిఆర్ ఆర్ ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని తుంగలో తొక్కి తానే ముఖ్యమంత్రి అయ్యారనేది మరొక రాజకీయ విమర్శ కెసిఆర్ పై ఉంది. ఇక భారతరత్న బిఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో నెక్లెస్ రోడ్డుపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ గత ఐదేళ్లుగా నలుగుతూనే ఉంది. ఇప్పటికి విగ్రహం ఏర్పాటు సంగతి అలా ఉంచి కనీసం పని మొదలు పెట్టలేదు. ఇలాంటి విమర్శలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయ వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కెసిఆర్ పైనే పూర్తిగా ఉంది .

1626717636365

ఇక ఈ పథకం కూడా ఆచరణలో విఫలమై మరింత విమర్శల పాలు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 1200 కోట్ల రూపాయలు కేటాయించినా కూడా రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు సంవత్సరానికి 100 దళిత కుటుంబాలకు మాత్రమే ఈ పది లక్షల రూపాయల సహాయం చేయగలుగుతారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసిన హుజురాబాద్ నియోజక వర్గంలోనే సుమారు ఇరవై ఒక్క వేల సంఖ్యలో దళిత కుటుంబాలు ఉన్నప్పుడు వీరందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని అంటే వంద సంవత్సరాలు కూడా సరిపోదు. దానికి ఉదాహరణగా హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన సర్వే స్పష్టం చేస్తుంది. అక్కడ రెండు వేల కోట్ల రూపాయలతో ఒకే సంవత్సరంలో 20 వేల దళిత కుటుంబాలకు సహాయం చేయవచ్చు. కానీ అలా  తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అమలు కావాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఏకమొత్తంగా ఒకే సంవత్సరంలో కావాల్సి ఉంటుంది. అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఒక సంవత్సరంలో రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం ప్రగతి సాధ్యం కాదు. ఇలాంటప్పుడు ఇందులో లబ్ధిదారుల ఎంపికలో అవినీతి ఆశ్రిత పక్షపాతం జరగదని చెప్పలేము. ఆదిలోనే హంసపాదు కాదు కానీ ఆచరణ సాధ్యం కాని బ్రహ్మాండమైన పథకాలు ప్రకటించి ప్రజలలో అపహాస్యం కావలసిన అవసరం  ప్రభుత్వానికి ఉండకూడదు. నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా నియామకాల విషయంలో యువత పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. దళితుల అభివృద్ధికి విద్య ,ఆరోగ్యాలు చాలా అవసరమైనవి. దాన్ని పక్కన పెట్టి మిగతా అభివృద్ధి సాధ్యం కాదు. విద్య ఆరోగ్యాల అభివృద్ధి ద్వారా దళితులకు ఉపాధి కల్పన సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని అంబేద్కర్ మహాశయుడు  70 ఏళ్ల క్రితమే చెప్పారు. అయినా సరే తమకు ఇష్టమైన పథకాలను ప్రకటించడం, ఆ తర్వాత చేతులెత్తేయడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ దళిత బంధు పథకం ప్రకటనే రాజకీయ విమర్శలకు కారణమైంది. పథకాన్ని ప్రకటించిన టైమింగ్ తో పాటు ఆచరణలో వచ్చే లోటుపాట్ల గురించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పథకాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ పథకం వెనుక ఉద్దేశం ఆ పథకాన్ని ప్రకటించిన సందర్భం వల్ల ఈ విమర్శలకు తావు ఇచ్చినట్లయింది. కనుక ఇప్పటికైనా దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అన్ని సక్రమంగా అమలు కావాలంటే కేవలం డబ్బు ఒక్కటే సరిపోదు. దానికి కావలసిన ఏర్పాట్లు మొదట చేయాల్సి ఉంటుంది. అందుకే హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సంగతి ప్రజలు చూసుకుంటారు. కానీ పథకాల అమలు సంగతులు ఒక మంచి మోడల్ గా హుజరాబాద్ నియోజకవర్గం అటు ప్రభుత్వానికి ఇటు పక్షాలకు ఒక పాఠం నేర్పుతుందనేది నగ్నసత్యం.

-బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge