Swara online radio - playing now

కనువిప్పు – నేటి స్వర కథ

శ్రీకాంత్భారతదేశానికి వచ్చి, తనవూరికెళ్ళిఅమ్మానాన్నలనుచూసిఆరేళ్ళయ్యింది. ఇప్పుడయినాతల్లిఫోనుచేయబట్టిగానిలేకుంటేకదిలేవాడా? నిరంతరంబిజిబిజిగాజీవితంగడిచిపోతోంది.

“నాన్నవంట్లోఈమధ్యనలతగాఉంటోంది, నీరసంగాఉంటున్నారు,  ఓసారినీవొక్కడివైనావచ్చిఏమైనాపరీక్షలుచెయ్యాలంటేచేయించివెళ్ళయ్యా”అనిదీనంగాఅమ్మమాట్లాడిన మాటలుఅప్పటికప్పుడుఅతన్నిమాతృదేశానికిబయలుదేరదీశాయి.

అతనుఅమెరికాలోవిమానంఎక్కినప్పుడు “కరోనా వైరస్”హడావిడిపెద్దగామొదలవ్వలేదు. ప్రపంచంలోచైనాలోనూతరువాతఇటలీలోనూఈవ్యాధిప్రబలిందన్నవార్తలుమాత్రంవిన్నాడు. చైనాలోఅయితేఅప్పటికేలాక్‌డౌన్ప్రక్రియప్రారంభమయ్యింది.

ఈనేపధ్యంలోఅతనుఢిల్లిలోవిమానందిగాడు. విమానాశ్రయంలోమాత్రంఅతన్నిప్లయింగ్స్క్వాడ్వచ్చిపరీక్షలకనితీసుకెళ్ళారు. “జ్వరంవచ్చిందా? దగ్గు, జలుబు, శ్వాసఇబ్బందులేమైనాఉన్నాయా?” అంటూప్రశ్నలేసి “అన్నిపరీక్షలుచేయాల్సిందే, అసలేవిదేశాలనుండివచ్చారు”అనిరెండురోజులుంచేశారు.

తనకివిమానంఎక్కగానేకాస్తఒళ్ళువెచ్చబడిందని, జ్వరంమాత్రవేసుకున్నాననివాళ్ళకుచెప్పలేదు. ఎక్కడతననిఆపేస్తారోననినిజందాచిపెట్టాడు.

“ప్రస్తుతంజ్వరమైతేలేదు. ఒకవేళకరోనాలక్షణాలుఅనిపిస్తేమాత్రంఎటూకదలకుండా 14 రోజులపాటుస్వీయనిర్బంధంలోవుండాలి” అనిహెచ్చరికలుచేసిహైదరబాద్విమానంఎక్కించారు.

శంషాబాద్విమానాశ్రయంలోమరలధర్మల్స్క్రీనింగ్చేయాలనితీసుకెళ్ళారు. మరలపరీక్షలన్నిచేసిరెండురోజులతరువాతచావుకబురుచల్లగాచెప్పారు. కరోనాపోజిటివ్అని, అయితేప్రారంభదశలోఉండటంచేతఐసొలేషన్వార్డులో 14 రోజులపాటుట్రీట్మెంట్తప్పనిసరిఅనిచెప్పారు. ఎంక్వయిరీలోభాగంగా “ఏపనిమీదఇండియాకువచ్చారు?” అనిఅడిగారు.

డాక్టర్అడిగినఆప్రశ్నకు, అడిగినవారిహృదయంకరిగేలాచాలా జాలిగా “తన  అమ్మానాన్నలకుతానుఒక్కణ్ణేకొడుకునని, తండ్రిఆరోగ్యపరిస్థితిబాగుండకపోవటంతోఅత్యవసరంగాస్వంతవూరుకువెడుతున్నాను” అనికళ్ళవెంటనీరుపెట్టుకునిమరీచెప్పాడు.

దానికాడాక్టర్మీవాళ్ళఫోనునెంబర్ఇవ్వండినేనుమాట్లాడతాననిశ్రీకాంత్నుండిఅతనినాన్నగారిసెల్నెంబర్తీసుకుని, “మీఅబ్బాయిమీ దగ్గరకురావాలనిఆతృతగాఉన్నాడుకానీఅతనికికరోనావ్యాధివుంది. ఈ పరిస్థితిలోఅతనుమీదగ్గరకొస్తేమీకు,మీచుట్టుపక్కలఉన్నవారికి,మీగ్రామానికికూడాఇదివ్యాప్తిచెందుతుంది. ఇదిగడ్డుకాలం. ప్రభుత్వంవారొకప్రక్కనలాక్‌డౌన్ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. మీఅబ్బాయికిధైర్యంచెప్పండి”అంటూశ్రీకాంత్తల్లితోమాట్లాడారు.

“రాకరాకఇన్నేళ్ళకువస్తున్నావు. సంపూర్ణఆరోగ్యంతోనీవుండాలిరా! డాక్టర్‌ గారు,నీకురెండువారాలవైద్యంఅవసరమనిచెపుతున్నారు.  ఆయనచెప్పినట్లుగానేనడచుకుందాంరా. నీకోసంఆరేళ్ళబట్టిఎదురుచూస్తున్నాం, ఈరెండువారాలుఉండలేమా? నీవుధైర్యంగావైద్యంచేయించుకునిపూర్తిగానయమైనతరువాతనేఇంటికిరానాయనా”అనితల్లిబాధపడుతూచెప్పింది.

“డాక్టర్‌గారుమీరుచెప్పినట్లుగానేనడుచుకుంటాను. మీరుఎప్పుడుపంపితేఅప్పుడేఇంటికివెళ్తాను”అనిచెప్పాడుశ్రీకాంత్. డాక్టర్‌గారునర్స్‌కుతీసుకోవలసినజాగ్రత్తలనుచెప్పివాడవలసినమందులనుసూచించివెళ్ళారు.

శ్రీకాంత్‌కుతల్లిఅన్నమాటలుపదేపదేగుర్తుకొచ్చిదిగులనిపించింది. “తనకుఎప్పుడుబిజిబిజి! పిల్లలపరీక్షలు, ఆఫీస్వర్క్, ఏవోట్రిప్పులకెళ్ళటం, ఎప్పుడుఇక్కడికిరమ్మనిఅమ్మఅడిగినాఅదిగోఇదిగోఅనితాత్సారంచేశాను.  ఆరేళ్ళనుండిఎదురుచూస్తున్నవారినిరీక్షణకుఇంకాముగింపుఎప్పుడో?”అనుకుంటునిద్రలోకిజారుకున్నాడు.

భార్యకుఫోనుచేసివిషయాలుచెప్పాడు.  ఆమె కూడా “అమెరికాలోపరిస్థితిఅసలేమీబాగాలేదని, స్వచ్చందంగా లాక్‌డౌన్పాటిస్తున్నాం” అనిచెప్పింది. “ఈరెండువారాలుసరైనవైద్యంచేయించుకోండి” అనిధైర్యంచెప్పింది.

అయితేహస్పటల్‌లోజాయిన్అయిన దగ్గరనుండితనకుజ్వరంలేదు. గొంతునొప్పిగానీ, దగ్గుగానీరావటంలేదు. దీంతోఅతనికివిసుగొస్తోంది. బయటకువెళ్ళటానికిలేదు. ఎవరితోమాట్లాడటంకుదరటంలేదు. తనేమోదుండుముక్కలావుంటేకరోనావుందనిభయపెడుతూఇక్కడుంచేశారు.

ఈపాటికిఅమ్మావాళ్ళదగ్గఱకెళ్ళిఊళ్ళోని  పాతమిత్రులనుకలసుకునేవాణ్ణి. తండ్రికిఆరోగ్యపరీక్షలనుచేయించేవాణ్ణి. ఏమీ లేకుండాఇక్కడకట్టిపడేశారువీళ్ళు.దాంతోశ్రీకాంత్‌కు చిరాగ్గాఉంది. ఆసమయంలోఅతనొకచదువుకున్నమూర్ఖుడయ్యాడు.

“చెప్పకుండావెళ్ళిపోతేవీళ్ళేంచేయగలరు?” అన్నఆలోచనవచ్చిందేతడవుగాబాత్‌రూంలోకెళ్ళిహాస్పటల్గోడదూకెళ్ళేమార్గంఏదయినాఉందేమోననిప్రయత్నించాడు. ఏదారీకనపడలేదు.

ఆరాత్రినర్సునుఅడిగి “ఉదయానేకాస్తబయటవాకింగ్చేస్తాను” అనిచెప్పాడు.  “గతరెండు రోజులుగామీ ఆరోగ్యంబాగానేఉంది. కరోనాపరీక్షలోకూడానెగటివ్రిజల్ట్  వచ్చిందికాబట్టిమీరుఉదయంకాసేపుబయటవాకింగ్చేయండిఫర్వాలేదు”అనిచెప్పిందినర్స్.

వాకింగ్కనిబయలుదేరినవాడురోడ్డుమీదకెళ్ళేప్రయత్నంలోడాక్టర్లకంటపడితిట్లుతినిమరలవార్డ్‌లోకి వచ్చాడు. మధ్యాహ్నంభోజనంచేశాకనర్స్వచ్చితనసెల్‌లోనిఓవీడియోక్లిప్పింగ్చూడమనిఇచ్చింది.

ఆవీడియోలోఓపోలీసాఫీసర్వేదననిండినగొంతుతో,దుఃఖాన్నిఅదిమిపట్టినదీనస్వరంతో, “అమ్మా  కూలి పనులకెళ్ళిననీవుకారం మెతుకులుతింటూ,నన్నుపాలు, వెన్నలతోపెంచిపెద్దచేసావు.నీ ఒక్కొక్కస్వేదపుచినుకునుదాచిదాచినన్నుపెద్దచదువులుచదివించిఇంతవాణ్ణిచేశావు. నేనుపోలీసుయూనిఫాంలోమొదటిసారి కనిపించినప్పుడుఎంతగాఆనందపడ్డావమ్మా?

చివరకునీవు అనారోగ్యంతోమంచంలోపడున్నా, నాకొడుకుఆమాయదారికరోనానుకట్టడిచేసేపనిలోఉన్నాడనివచ్చేపోయేవారికిగర్వంగాచెప్పావు. నేనునీఆఖరిచూపుకికూడానోచుకోలేకపోయానమ్మా. కానీతమ్ముడునిన్నుమహరాణిలాగాసాగనంపేఏర్పాట్లుచేశాను. నీకెంతోఇష్టమైనఈఖాకీయూనిఫాంచాటుననా దుఃఖాన్నిదాచుకోవాల్సివచ్చింది. ఎందరోఅమ్మలకు ధైర్యంఇచ్చేటందుకేనీదగ్గరకురాలేకపోయానమ్మా.   కానీనేనుజీవించిఉన్నంతకాలంనీకుమరణంలేదమ్మా”అంటూతనతల్లిఫోటోకుపోలీసువందనంచేశాడు.

ఆపోలీసాఫీసర్దుఃఖంశ్రీకాంత్‌నుకదిలించింది. తనమనసులోనిమలినాన్నికడిగివేసింది. తానుచేయాల్సినధర్మాన్నిగుర్తుచేసింది, అనుకుంటూకూర్చున్నాడు.

సాయంత్రంరౌండ్స్‌కి  నర్స్వచ్చింది. “సార్! మధ్యాహ్నం  నేనుఇచ్చినవీడియోనుచూశారా? అదియదార్ధంగాజరిగినసంఘటన, సార్”అంటూఆమెశ్రీకాంత్‌తోఅంటూండగానేఆమెకుఫోనువచ్చింది.

“సార్! రెండునిముషాలు”అంటూఅక్కడేఉన్నకుర్చీలోకూర్చునివీడియోకాల్ఆన్‌చేసింది.

“సార్! మా పాపమధురిమమాట్లాడుతోందిచూడండి”అంటూసెల్శ్రీకాంత్  చేతికిచ్చింది.

సెల్‌లోఓచిన్నపాపకనిపించి, “అంకుల్నమస్కారమండి! మీరుఅమెరికానుండివచ్చారుటకదా! మీకుకరోనావచ్చిందనిఅమ్మచెప్పింది. మీకుపూర్తిగాతగ్గిపోయిమీరుమీఊరువెళ్ళేదాకా, మాఅమ్మఇంటికిరాకూడదట. అమ్మఇంటికొస్తేఅమ్మద్వారానాకుకూడాఆజ్వరంవస్తుందట! అందుకేమీరుడాక్టరంకుల్చెప్పినట్లుగాఅమ్మఇచ్చినమందులువాడితొందరగాజ్వరంతగ్గించుకునిమీఊరికెళ్ళండి. అప్పటిదాకామాకుఅమ్మదూరంగాఉండాలి. నాకుఓరెండేళ్ళతమ్ముడున్నాడు. మాఇద్దరికిఅమ్మపైబెంగగాఉంది. అందుకనేప్రతిరోజుఅమ్మకువీడియోకాల్చేస్తూంటాను”అంటూముద్దుముద్దుగామధురిమతనబాధనుచెప్పకనేశ్రీకాంత్‌కుచెప్పింది.

ఆమాటలనువింటున్నఆ తల్లివెక్కిళ్ళతోఅతనికిపూర్తిగాకనువిప్పుకలిగింది. ఆనర్స్‌కుచేతులెత్తినమస్కరిస్తూ “ఇంకెప్పుడూఇలాంటిపిచ్చిపనులుచేయను” అనివాగ్దానంచేశాడుశ్రీకాంత్రేపటిపైఆశతో!

*****


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg
sailaja

Legend

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge