Swara online radio - playing now

ఆనాడే రాజద్రోహం కేసులను సూటిగా ప్రశ్నించిన గరిమెళ్ళ

-బండారు రామ్మోహనరావు.

జూలై 14,1893. జాతీయ కవి స్వాతంత్ర సమరయోధుడు గరిమెళ్ళ సత్యనారాయణ, జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

“మాకొద్దీ తెల్ల దొరతనము దేవా!

మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే,

మాకొద్దీ తెల్ల దొరతనము”

అనే పాట పల్లవి వినగానే మనకు ఈ శతాబ్దపు జాతీయ గేయ కవి, సాహిత్యంలో మేటి ధ్రువతార గా వెలిగిన గరిమెళ్ళ సత్యనారాయణ గారి పేరు గుర్తుకు వస్తుంది.

బ్రిటిష్ వారి వలస పాలనకు, సామ్రాజ్యవాదానికి, వ్యతిరేకంగా అనేక కవితలు పాటలు రాసి ఆయన భారత స్వాతంత్రోద్యమంలో ప్రజలకు చైతన్యం కలిగించారు.మాకొద్దీ తెల్ల దొరతనం అని పాట ఆనాటి బ్రిటిష్ పాలనలోని తెలుగు వారిని అందరినీ కదిలించింది. ఆ పాట రాసిన కవిగా ఆయన కీర్తి శిఖరాలకు చేరుకుంది.ఎవరి నోట విన్నా ఆ నాడు ఈ పాట వినిపించేది. ఈ పాట ద్వారా ఆ నాటి బ్రిటిష్ ప్రభుత్వం దమననీతిని ఆయన ఎండగట్టారు. ఆ నాటి బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల పై “రాజద్రోహం” కేసులు పెట్టి స్వాతంత్ర సమరయోధులను జైలుకు పంపుతున్నారని “రాజద్రోహామంటా రాజ్యంలో ఉందంటా” అనే చరణాన్ని ఒకే ఒక్క వాక్యంలో ఆనాటి రాజద్రోహ ఆరోపణలపై స్వాతంత్ర సమరయోధులను జైలులో కుక్కిన సంఘటన గురించి ఆయన ఈ పాటలో పలికించారు. ఈ పాట రాసినందుకు 1922 లో ఒక ఏడాది పాటు ఆయన కారాగార శిక్ష అనుభవించాడు. గరిమెళ్ళ సత్యనారాయణ ఒక నిరుపమాన దేశభక్తులు. తన గేయాల ద్వారా జనహృదయాల్లో దేశభక్తి కల్పించడంతోపాటు చెరసాలలు ఉరికొయ్యలు ఆయనను ఏమీ చేయలేమని నిరూపించారు. అలాగే ఆయన రాసిన “దండాలు దండాలు భారత మాత” అనే గీతం కూడా ప్రజలను ఎంతో జాగృతం చేసి స్వాతంత్ర ఉద్యమంలోకి ప్రజలను ఉరికేలాగా చేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో  గరిమెళ్ళ వారిని ప్రథములు గా చెప్పుకోవచ్చు. వారు నిజాయితీకి నిర్భీతికి మారుపేరు గా నిలిచారు. ఆయన అంత ప్రసిద్ధి పొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి నూతన ఒరవడి సృష్టించిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ నారాయణ గారు.

జాతీయోద్యమ స్ఫూర్తి:
1626200175481

1920 డిసెంబరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ “మా కొద్ది తెల్లదొరతనము” అనే పాటను రాశారు. రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీ ఒక్కొక్కటి” ఒక బేడా” అంటే పన్నెండు పైసలకు అమ్ముడుపోయి. ఆనోటా ఈనోటా ఈ పాట గురించి ఆనాడు బ్రిటిష్ కలెక్టర్ “బ్రేకన్ చెవిన పడింది. ఆయన గరిమెళ్ళ వారిని తన వద్దకు పిలిపించుకుని ఆ పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు గొప్ప గాయకుడు కూడా పోవడంతో తన కంచు కంఠంతో ఆయన ఆ పాట పాడారు. అది విన్న అప్పటి కలెక్టర్ తెలుగు భాష నాకు రాకపోయినప్పటికీ ఈ పాటలో ఎంతటి మహత్తర శక్తి ఉందో సామాన్య ప్రజలకు ఎలా చైతన్య పరచ గలదా నేను ఊహించగలను అన్నాడట. కానీ బ్రిటిష్ అధికారి అయినందువల్ల ఆ పాట రాసి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారనే నెపం మోపి గరిమెళ్ళ కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు.కవికి శిక్ష విధించినా కూడా కవి రాసిన పాటకు జైలు లేదు కదా! అందుకే ఆయన రాసిన పాట ఆ రోజుల్లో కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి గాంధీ టోపీ పెట్టుకొని వీధుల వెంట బారులు తీరి నడుచుకుంటూ వెళుతూ మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాటను ఆకాశం దద్దరిల్లేలా గా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట. సంవత్సర కాలం పాటు జైలు శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదల అయిన గరిమెళ్ళ  మళ్ళీ ప్రజల మధ్య ఆయన రాసిన పాట గొంతెత్తి పాడాడు. ఆ పాటతో మరొకసారి స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తిని ప్రజలలో రగిలించారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం గరిమెళ్ళ ప్రజలలో ఉండడం తమ ప్రభుత్వానికి మంచిది కాదని భావించారు. అందుకే ఆయనను  అరెస్ట్ చేసి కాకినాడ కలెక్టర్ ముందు హాజరు పరిచారు. ఆ కలెక్టర్ గరిమెళ్ళ గారికి రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించి రెండవసారి ఆయనను జైలుకు పంపించారు.

తండ్రి మరణించినా సిద్ధాంతాలు వీడని, క్షమాపణ చెప్పని గరిమెళ్ళ:

 గరిమెళ్ళ  వారు జైలులో ఉండగానే ఆయన తాత, తండ్రి, చివరికి భార్య కూడా మరణించారు. తన తండ్రి చనిపోయినప్పుడు చివరి చూపు చూసుకోవడానికి క్షమాపణ చెబితే జైలునుంచి వదిలిపెడతామని బ్రిటిష్ అధికారులు చెప్పారట. కానీ తన స్వతంత్ర భావాలను బయట పెట్టాను కానీ తాను ఏమీ తప్పు చేయలేదని అందుకనే తాను బ్రిటిష్ అధికారులకు క్షమాపణ చెప్పను అని తండ్రి శవాన్ని చూడకుండా ఆయన జైలులోనే ఉండిపోయాడట. అంతటి దేశ భక్తుడు గరిమెళ్ళ సత్యనారాయణ. ఆయన జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకు ఎన్నోచోట్ల సన్మానాలు చేశారు. ఆయన కష్టతరమైన జీవితంలో ఇది ఒక్కటి మాత్రమే మధుర ఘట్టం. ఆయన భార్య చనిపోయిన తర్వాత ఇద్దరు కుమార్తెలు ఉండగానే గరిమెళ్ళ మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. అప్పులు పెరగడంతో వున్న ఆస్తి అంతా అమ్మేసి అప్పులు తీర్చాడు. పొట్టకూటి కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగం కూడా వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశారు. శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి ఆయన రచించిన 18 పుస్తకాలు అచ్చువేశారు. ఆ తర్వాత ఆయన స్వాతంత్రోద్యమంలో రాజమండ్రి, విజయవాడ, మద్రాసులకు తరచు తిరగడంతో ఆ పుస్తకాలను పట్టించుకోకపోవడం వల్ల వాటిని చెదలు తినేశాయి. కానీ ప్రజల మనసుల్లో వారు వ్రాసిన దేశభక్తి భావాలు తిష్ట వేశాయి. వాటిని తొలగించడం ఇలాంటి చెదల వల్ల కూడా కాదు.

1921 లో గరిమెళ్ళ రాసిన “స్వరాజ్య గీతములు” అనే పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926 ఖండకావ్యం, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి.ఆయన జీవితంలో మూడు నాలుగు సార్లు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉండగానే తమిళ కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళ కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆయన ఆంగ్లంలో కూడా కొన్ని రచనలు చేశారు. ఆంగ్లం నుండి కొన్ని రచనలు తెలుగులోకి అనువదించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంగ్లంలో వ్రాసిన “ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా” అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. 1937లో జపాన్ అనే పుస్తకాన్ని రచించారు. గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకొని అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తర్వాత అక్కడ మానివేసి ఆచార్య రంగా గారి “వాహిని” పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఆ తర్వాత ఆనందవాణి పత్రికకు సంపాదకునిగా పని చేశాడు. ఆయన జీవితాంతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించాడు. చివరి దశలో గరిమెళ్ళ దుర్భరమైన పేదరికాన్ని అనుభవించారు. ఆంధ్రప్రభ వ్యవస్థాపకులు దేశోద్ధారక కాశీ నాధుని నాగేశ్వరరావు పంతులు వారికి కొంత వరకు ఆర్థికంగా సహాయపడ్డారు. ఒకవైపు పేదరికం మరోవైపు అనారోగ్యం ఆయనను కుంగదీసింది. జీవిత చరమాంకంలో ఒక కన్ను పోవడమే కాకుండా పక్షవాతం కూడా వచ్చింది. చివరికి దిక్కులేని పరిస్థితుల్లో ఆయన యాచన మీద బిచ్చం ఎత్తుకొని బతికాడు.చివరకు 1952 డిసెంబర్ 18న దుర్భరమైన దారిద్ర్యంతో అనారోగ్యంతో మరణించారు.

 స్వాతంత్రం వచ్చిన తరువాత తాను కష్టాల్లో ఉన్నా కూడా తనను గుర్తించి కనికరించని స్వయం పాలన లో ప్రభుత్వాన్ని నిందించలేదు. భారత పాలకుల మీద ఉన్న “మాకొద్దీ నల్ల దొరతనము” అని పాట రాయమని మిత్రులు సలహా ఇచ్చినా కూడా స్వయం పాలన మీద ఆయన కించిత్తు మాట అనలేదు. ఆ పాట రాయడానికి అంగీకరించలేదు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం వల్ల సిద్ధించిన స్వాతంత్రాన్ని ఆయన కించపరచలేదు. ఇలాంటి దేశభక్తుడికి ఈ దేశం ఏమిచ్చింది అనేకంటే ఈ దేశానికి ఆయన ఏమి ఇచ్చారు అనేది మనం ఆలోచించాలి. ఇలాంటి మహానుభావులకు నివాళులు అర్పిస్తూ ఆ స్ఫూర్తితోనే మనం బతకాలి.

 బండారు రామ్మోహనరావు.

సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge