Swara online radio - playing now

అనుభవానికి వస్తేనే తత్వం బోధ పడుతుందా?

పవన్ కళ్యాణ్ కు రాజకీయ తత్వం బోధ పడిందా?

-బండారు రామ్మోహనరావు.

“అనుభవానికి వస్తే తప్ప తత్వం బోధపడదన్నమాట” అనే డైలాగ్ మహాకవి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర ద్వారా అనిపిస్తారు.వేల కోట్లతో ముడివడి ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థ లో పార్టీ నిర్మాణం, సంస్థాగత విస్తరణ తనలాంటి వారికి కష్టతరమైన పని అని ప్రఖ్యాత సినిమా హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఎలాంటి శషభిషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు తేల్చిచెప్పారు. కాకపోతే ఆ మాట ఇన్నాళ్ల తర్వాత నింపాదిగా చెప్పారు. మొదట తన అన్న చిరంజీవి ప్రారంభించిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ అనుభవాలు, ఆ తర్వాత తెలుగునాట జనసేన అనే పేరుతో ఆయనే స్వయంగా కొత్త పార్టీ ప్రారంభించిన తర్వాత ఇన్నాళ్ళకు ఆయన జ్ఞానోదయమైంది. అందుకే గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం లోని మాటలు గుర్తుకొచ్చాయి.దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు పరిణామాల పై ఆయన ఇలా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీ కార్యకలాపాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్నారు. పైగా తాను పగటి కలలు కనే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. తెలంగాణ నేల పై కొత్త రక్తం, చైతన్యం కలిగిన యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ షర్మిల కొత్తగా పెట్టిన పార్టీ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం ఎంతో అవసరమని ప్రజలకు మేలు జరిగేది ఏదైనా మంచిదే అన్నారు.

ప్రజా రాజ్యం పార్టీ అనుభవం ఏమి నేర్పింది:

పవన్ కళ్యాణ్ గత పన్నెండేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే మొదట తన అన్న ప్రఖ్యాత సినీ నటుడు చిరంజీవి ప్రారంభించిన పార్టీకి అన్నీ తానే అయి వెనక ఉండి నడిపించాడు. ఆ తర్వాత ఆ ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పంచలు ఊడ గొట్టి పరిగెత్తించి కొడతామని సినిమాలలో లాగా పంచ్ డైలాగులు చెప్పి ప్రజారాజ్యం తరఫున ప్రగల్భాలు పలికారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలో పోటీ చేసింది. ఆ ఎన్నికలలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కి ఆశించినంత ఫలితాలు రాకపోయినా గౌరవప్రదమైన సీట్లతోనే తెలుగు ప్రజలు ఆశీర్వదించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 16 శాతం ఓట్లను ప్రజారాజ్యం పార్టీ కైవసం చేసుకుంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కలిపి 16, తెలంగాణ ప్రాంతంలో మరొక 2 స్థానాలు కలిపి మొత్తం మీద 18 అసెంబ్లీ స్థానాలు సంపాదించుకుంది. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడైన చిరంజీవి స్వయంగా పాలకొల్లు,తిరుపతి అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి తిరుపతి లో గెలిచి పాలకొల్లు లో ఓడిపోయారు. ఒకసారి చరిత్రలోకి వెళితే ఎన్టీరామారావుగారు 1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో రెండు వందల ఒక్క స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అచ్చం అలాగే తాను కూడా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెసును ఓడించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని చిరంజీవి ఆశించారు. ఆశ పడటంలో తప్పులేదు  కానీ ఆశాభంగం కాగానే మెల్లమెల్లగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీని ఏకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. చివరికి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తిరుపతి అసెంబ్లీ సీటుకు కూడా ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వం తీసుకుని ఆరేళ్ళు రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తన సినిమాలలో తాను బిజీ అయిపోయి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

1625850672532

పవన్ కళ్యాణ్ జనసేన ప్రస్థానం:

ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో దూకుడుగా ఆర్భాటంగా జనసేన పార్టీని ప్రారంభించారు.తన అన్న ప్రజారాజ్యం పార్టీ లో చేసిన పొరపాట్లు జనసేన లో జరగనీయకుండా జాగ్రత్త పడతారని చాలామంది ఆశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాష్ట్రాలు ఇంకా వేరు కాకముందే 2014 లో జరిగిన ఎన్నికల లో రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపి కలిసిన ఉమ్మడి కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో టిడిపి, బిజెపి మిత్రపక్షాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎలాంటి రాజకీయ పదవి తీసుకోకుండా ఆ కూటమి ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా కలిసి పనిచేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అటు బిజెపి, ఇటు తెలుగుదేశం పార్టీలతో అది నాయకులతో రాజకీయంగా బెడిసి కొట్టడం వల్ల మొట్టమొదట తెలుగు దేశం కంటే ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకొని అమరావతి రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకించాడు. రైతుల భూములను లాక్కో వద్దని అమరావతి రైతులకు అండగా నిలిచారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో కలిసి పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలను సీరియస్ గా తీసుకోకుండా సినిమా షూటింగ్ లకు కాల్షీట్స్ ఇచ్చిన విధంగానే రాజకీయాలను కూడా అలాగే భావించడం వల్ల దెబ్బతిన్నారు. అలాగే రాష్ట్రంలో రాజకీయ విధానాలను నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన తనకు తానుగా అపరిపక్వత తో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో పలుచన అయిపోయారు.

1625850758765

2019 లో రాజకీయంగా మరింత దెబ్బతిన్న జనసేన జనసేనాని:

తెలుగు రాష్ట్రాలలో అపారమైన ప్రజాభిమానం, యువత మద్దతు ఉన్నా కూడా 2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీ లతో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆయన పార్టీ పోటీ చేసిన సీట్లలో ఒకే ఒక్క సీటు గెలిచింది. ఆ తర్వాత ప్రజారాజ్యం సీటు పై గెలిచిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తో అంటకాగుతున్నారు.తన గెలుపు లో పవన్ కళ్యాణ్ ప్రమేయం ఏమీ లేదని తన పలుకుబడితోనే గెలిచానని ఆ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించారు.ఇక ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్  స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత గత ఏడేళ్లుగా ఎదురైన ఈ చేదు అనుభవాలతో పవన్ కళ్యాణ్ విరక్తి చెందారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎన్ని తప్పులు చేసినా కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చు. 2019 లో జరిగిన ఎన్నికలలో సాంప్రదాయ రాజకీయ పార్టీల లాగా ఆయన మద్యం డబ్బులతో తో పాటు తాయిలాలు చూపించి ఓట్లను  కొనలేదు. దానికి ఆయనను నిజంగా అభినందించాలి. అధికారం లక్ష్యం కాదు మార్పు లక్ష్యం అని ఆయన ధైర్యంగా ప్రకటించారు. కానీ ఇప్పటికి ఆయనకు రాజకీయ తత్వం బోధపడింది. పార్టీ నడపాలంటే ఎంత కష్టమో దానికి డబ్బు, దస్కం ఎంత అవసరమో తెలిసివచ్చింది. దానికి సమాధానంగా ఆయన ప్రస్తుత రాజకీయాలను అభివర్ణించారు.  రాజకీయాలు మారాలని కొత్తగా పార్టీలు స్థాపించే వారందరికీ ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది.

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ వ్యక్తిగత ప్రైవేటు ఆస్తులుగా మారిన ఈ సందర్భంలో ప్రజాస్వామ్యయుతంగా, వ్యక్తి పూజ లేకుండా ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ అనుభవం చెబుతుంది. రాష్ట్ర ప్రజలకు ఇది ఒక గుణపాఠంగా పనికి వస్తుంది.

-బండారు రామ్మోహన రావు.

   సెల్ నెంబర్.98660 74027.


What's Your Reaction?

confused confused
0
confused
fail fail
0
fail
fun fun
0
fun
lol lol
0
lol
win win
0
win
love love
0
love
omg omg
0
omg

0 Comments

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us

    Contact Us

Choose A Format
Image
Photo or GIF
Story
Formatted Text with Embeds and Visuals
Audio
Soundcloud or Mixcloud Embeds
Video
Youtube, Vimeo or Vine Embeds
Gif
GIF format
Poll
Voting to make decisions or determine opinions
Meme
Upload your own images to make custom memes
Personality quiz
Series of questions that intends to reveal something about the personality
Trivia quiz
Series of questions with right and wrong answers that intends to check knowledge